ఉపాధ్యాయులకు శిక్షణ
నిర్మల్ రూరల్: అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు మంగళవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా విద్యాబోధనలో మార్పు చేసేందుకు ఏడాదికోసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులకు ప్రత్యక్ష అనుభవం ద్వారా సిలబస్‌లో ఉన్న సుమారు 20 ప్రయోగాలను 40 మంది ఉపాధ్యాయులతో చేయించారు. కార్యక్రమాన్ని సెక్టోరియల్ అధికారులు రాజేశ్వర్, లింబాద్రి, ప్రవీణ్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులకు ఉపయోగపడతాయని తెలిపారు. బోధన కార్యక్రమాలు మెరుగుపర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థులను ప్రభావితం చేయడంలో ప్రయోగాలు ఉపయోగపడతాయన్నారు. అగస్త్య ఫౌండేషన్ అధికారులు అనిల్ కుమార్, వెంకటరెడ్డి, సురేశ్, రాజ్‌కుమార్, శ్రీకాంత్ ప్రయోగాలను వివరించారు. వ్యర్థాలను ఉపయోగంలోకి తేవడం ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన పరికరాలతో ప్రయోగాలను చేయించడం, తదితర అంశాలపై చర్చించి ప్రయోగం ద్వారా చేసిచూపారు. శిక్షణలో జేవీఎన్‌ఆర్ ప్రిన్సిపాల్ మణికుమారి, డీఎస్‌వో వినోద్‌కుమార్, ఉపాధ్యాయులు కూన రమేశ్, రఫీక్, సంతోష్, అన్సార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment