ధాన్యం తూకం వేశాకే సర్వే చేయాలి
లోకేశ్వరం: ధాన్యం తూకం వేశాకే సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించాలని, అప్పటి వరకు సర్వే నిలిపివేయాలని మండల రైతులు డిమాండ్ చేశారు. అబ్దుల్లాపూర్, జోహర్పూర్, ధర్మోర గ్రామాల్లో రైతులు పంచాయతీ కార్యాలయాలను మంగళవారం ముట్టడించారు. ధాన్యం తూకం వేసేవరకు సమగ్ర కుటుంబ సర్వే నిలిపి వేయాలని రైతులు ఆందోళన చేశారు. కేంద్రాలను ప్రారంభించి నెల రోజులు అయినా నేటికీ ధాన్యం తూకం వేయడం లేదన్నారు. తూకంలో జాప్యంతో చాలా మంది రైతులు దళారులకు విక్రయిస్తున్నారని తెలిపారు. ధాన్యం తూకం వేసే వరకు సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించమని స్పష్టం చేశారు.
సమగ్ర కుటుంబ సర్వేను అడ్డుకున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment