ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
లక్ష్మణచాంద: ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి కృష్ణ ఆదిత్య కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. మండలంలోని పీచర గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి పరిశీలించారు. ధాన్యంలో తేమశాతాన్ని పరిశీలించారు. ప్రమాణాలకు అనుగుణంగా రైతులు ధాన్యం తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. సన్నరకం ధాన్యం ఇప్పటివరకు ఎన్ని క్వింటాళ్లు సేకరించారు.. ఇంకా ఎన్నిక్వింటాళ్లు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గన్నీ సంచులు, టార్పాలిన్‌లు రైతులకు అందుబాటులోఉంచాలన్నారు. కొనుగోలు చేసిన వెంటనే వివరాలు ట్యాబ్‌లో నమోదు చేయాలని సూచించారు. రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్న కళ్యాణి, సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాల్, డీఎస్‌వో కిరణ్‌కుమార్, డీసీవో రాజమల్లు, డీఏ వో అంజిప్రసాద్, ఎంపీడీవో రాధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment