రైతులకు ‘భరోసా’
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ ప్రభుత్వం రైతుల ఖతాల్లో రైతుభరోసా నిధులు జమ చేస్తోంది. చెప్పిన విధంగానే రిపబ్లిక్ రోజున సీఎం రేవంత్ నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతు భరోసా ఇస్తామని పేర్కొన్నారు. ప్రారంభం రోజు ఆదివారం కావడంతో రైతు భరోసా డబ్బులు జమకాలేదు. సోమవారం మధ్యాహ్నం నుంచి రైతుల ఖాతాల్లో నిధుల జమ మొదలైంది. ప్రభుత్వం ఖరారు చేసిన మార్గదర్శకాల మేరకు అర్హులైన రైతులకు నిధులు అందనున్నాయి. అయితే, గతంలో అమలు చేసిన విధంగానే విడతల వారీగా నిధులు జమ అవుతాయని అధికారులు వెల్లడించారు.
నిధులు విడుదల..
రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ఇప్పటికే బ్యాంకుల్లో నిధుల జమ అయ్యాయి. గత ప్రభుత్వం అమలు చేసిన విధానంలో కొన్ని మార్పులు చేశారు. సాగు చేసే భూములకే భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే స్పష్టమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.
తొలిరోజు 18 రెవెన్యూ గ్రామాల రైతులకు..
రైతు భరోసా నిధులు మండలానికి ఒక గ్రామం చొప్పున మొదటి వివత జమ చేసినట్లు తెలిసింది. జిల్లాలో 18 మండలాల పరిధిలోని 18 రెవెన్యూ గ్రామాలకు చెందిన 6,710 మంది రైతుల ఖాతాల్లో తొలిరోజు రైతు భరోసా డబ్బులు జమయ్యాయి.
ఖాతాల్లో జమ అవుతున్న నగదు ఎకరాకు రూ.6 వేల చొప్పున చెల్లింపు లబ్ధిదారుల ఫోన్లకు మెస్సేజ్‌లు
జిల్లాలోని మొత్తం రైతులు 2,01,326
రైతు భరోసాకు కావాల్సిన సొమ్మురూ.283,11,85,496
సోమవారం సాయంత్రం నాటికి బ్యాంక్
డీటెయిల్స్ అప్డేట్ అయినవారు 1,83,954
మండలాల వారీగా సోమవారం రైతు భరోసా జమ అయిన రైతులు..
మండలం రెవెన్యూవిలేజ్ రైతుల సంఖ్య
బాసర లబ్ది 369
భైంసా ఖడ్గమ్ 240
దస్తురాబాద్ దేవునిగూడెం 230
దిలావర్పూర్ సాంగ్వి 258
కడెం నర్సాపూర్ 841
ఖానాపూర్ అడవిసారంగాపూర్ 127
కుభీర్ అంతర్ని 305
కుంటాల విట్టాపూర్ 314
లక్ష్మణచాంద వడ్యాల్ 1,185
లోకేశ్వరం బాగాపూర్ 573
మామడ వాస్తాపూర్ 108
ముధోల్ వెంకటాపూర్ 201
నర్సాపూర్(జి) నందన్ 332
నిర్మల్ రూరల్ తాంశా 632
పెంబి పస్పుల 327
సారంగాపూర్ పెండల్‌దరి 97
సోన్ సంఘంపేట్ 351
తానూర్ సింగన్‌గాం 220
Comments
Please login to add a commentAdd a comment