● మూడింటికీ ఒక్కరే బాస్.. ● స్వాగతం పలుకుతున్న సమస్యలు
ఖానా‘పురము’లో..
ఐదేళ్లక్రితం కొత్త మున్సిపాలిటీగా ఏర్పడిన ఖానా పూర్ పట్టణంలో ఎక్కడి సమస్యలు అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. రూ.15 కోట్లతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ సమస్య వెంటాడుతోంది. రెండు కోట్లతో చేపట్టిన డివైడర్ పనులూ అసంపూర్తిగానే ఉన్నాయి. ఐదేళ్లయినా మున్సిపాలిటీకి సొంత భవ నం లేకపోవడంతో శిథిలావస్థలో ఉన్న ఇరుకు గదుల్లో కొనసాగుతోంది. రూ.3 కోట్లతో చేపట్టిన సమీ కృత మార్కెట్ పనులు మధ్యలోనే నిలిచిపోయా యి. మిషన్ భగీరథ కారణంగా పట్టణంలోని రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఐదేళ్ల మున్సిపల్ పాలనలో ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడ కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించిన దాఖలాలు లేవు. వారసంతలో సరైన స్థలం, సౌకర్యాలు లేక వ్యాపారులు, రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎమ్మెల్యే రూ.4.80 కోట్లతో సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు భూమి పూజ చేసినా పనులు ముందుకు సాగడం లేదు. రూ.50 లక్షలకు పైగా వెచ్చించి గోదావరిలో నిర్మిస్తున్న వైకుంఠధామం ఏటా వరదకు కొట్టుకుపోతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment