వంద రోజుల్లో అభివృద్ధి చేసిచూపిస్తా
● ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ.పాల్ ● తాజా మాజీ సర్పంచులతో సమావేశం
నిర్మల్‌టౌన్: సర్పంచ్‌లుగా ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడి గెలిస్తే ఆ గ్రామాన్ని వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఏ.పాల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో తాజా మాజీ సర్పంచులతో సోమవారం సమావేశం నిర్వహించారు. వారికి రావాల్సిన బిల్లులపై చర్చించారు. పెండింగ్ బిల్లుల విడుదలకు కృషి చేస్తానన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిర్మల్ జిల్లాగా ఏర్పడినా గ్రామాలు, మండలాల అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్పంచులు అప్పుల పాలయ్యారని తెలిపారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ఎప్పుడూ రెడ్లు, రావులకే అధికారం ఇద్దామా అని ప్రశ్నించారు. బీసీలకు అధికారం వచ్చేలా ప్రజలు ఓట్లు వేయాలని సూచించారు. కేటీఆర్, రేవంత్ కొట్టుకోవడం.. తిట్టుకోవడం తప్ప ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. అనంతరం ప్రజాశాంతి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment