బాధ్యతలు స్వీకరించిన ‘పుర’ ప్రత్యేక అధికారి
నిర్మల్‌చైన్‌గేట్/భైంసాటౌన్/ఖానాపూర్: జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల ప్రత్యేక అధికారిగా నియమితులైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వరుసగా నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయాలకు వచ్చిన ప్రత్యేక అధికారికి కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం ఫైజాన్ అహ్మద్ సిబ్బందితో మాట్లాడారు. సమయానికి పనులు చేయాలని సూచించారు. విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం కొనసాగాలని ఆదేశించారు. ఖానాపూర్ మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రగతికి సంబందించిన నివేదికలు ఎప్పటికప్పుడు తనకు అందజేయాలని సూచించారు. వారానికి రెండు రోజులు ఖానాపూర్ ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. పట్టణంలోని డబుల్ బెడ్రూం ఇళ్లలో అనర్హుల తొలగింపు కోసం నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి ఆధ్వర్యంలో సర్వే పూర్తయిందని కలెక్టర్ సంతకం కాగానే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మున్సిపల్ మాజీ చైర్మన్ చిన్నం సత్యం అడిషనల్ కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. కార్యక్రమాల్లో నిర్మల్ ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ హరిభువణ్, పట్టణ ప్రణాళిక అధికారి హరీశ్, ఆర్వో అనూఫ్, మెప్మా పీడీ సుభాష్, భైంసా మున్సిపాలిటీ కమిషనర్ రాజేశ్‌కుమార్, ఖనాపూర్ మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment