సమస్యలపై సత్వరం స్పందించాలి
నిర్మల్‌చైన్‌గేట్: ప్రజల సమస్యలపై అధికారులు సత్వరం స్పందించాలని, ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూసమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, తదితర సమస్యలపై పలువురు అర్జీలు సమర్పించారు. కలెక్టర్ కూడా సమస్యను ఓపికగా విని పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరించినప్పుడు వాటికి సంబంధించిన వివరాలను క్లుప్తంగా రిమార్కుల విభాగంలో పొందుపర్చాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలి..
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున ప్రత్యేక అధికారులంతా ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించాలన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పరీక్ష ఫలితాల వివరాలు అందజేయాలని తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ప్రతీ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది శనివారం శ్రమదానం నిర్వహించాలని సూచించారు. పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించాలని తహసీల్దార్లు ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్‌అహ్మద్, కిశోర్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
ప్రజావాణిలో కలెక్టర్ అభిలాష అభినవ్
ఆసుపత్రిలో పోస్టులు భర్తీ చేయాలి..
జిల్లా జనరల్ ఆసుపత్రిలో పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించక పోవడంతో ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ సిబ్బందిపై పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నారు. నిర్మల్ జిల్లా ఏర్పడిన తర్వాత ఆసుపత్రిలో ఓపీ సంఖ్య పెరిగింది. దానికి అనుగుణంగా ఇప్పటివరకు శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ సిబ్బందిని నియమించలేదు.
– సిర్ర దేవేందర్, ఏఐటీయూసీ తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్
మా భూమిని విడిపించాలి..
నాకు ముజ్గి గ్రామంలో 205ఆ, 205ఆ/1 లో 2.37 గుంటల భూమి ఉంది. ఇందులో నుండి కోల్కొండ శారద 1.05 గుంటల భూమిని కబ్జా చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. సర్వేయర్‌తో సర్వే చేయించి పంచనామా తీసుకున్నా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అధికారులు స్పందించి మా భూమిని మాకు ఇప్పించండి. – భూమన్న, ముజ్గి
Comments
Please login to add a commentAdd a comment