భైంసా బల్దియాలో..
భైంసాలో పాత పట్టణంలోని దాదాపు అన్ని కాలనీల్లో రోడ్లు అధ్వాన్నంగా మారాయి. మిషన్ భగీరథ పనులతో రోడ్లపై గుంతలు ఏర్పడ్డాయి. కల్వర్టులు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల డ్రైనేజీలు శిథిలావస్థకు చేరాయి. 4, 5, 6 వార్డుల్లోని శివారు కాలనీలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. కాలనీలు ఏర్పడి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ మట్టి రోడ్లే ఉన్నాయి. డ్రైనేజీలు లేక మురికినీరు రోడ్లపైన, ఇళ్ల ముందు నిలుస్తోంది. దుర్గంధం, దోమలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలతోపాటు పట్టణ ప్రజలు సెలవు దినాల్లో కుటుంబ సభ్యులతో సరదాగా బయటకు వెళ్లాలంటే సరైన పార్కు కూడా లేదు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద పార్కు నిర్మించినా అసంపూర్తి పనులతో అందుబాటులోకి రాలేదు. ఏపీ నగర్లోని పార్కు సైతం వృథాగా మారింది. ఓపెన్జిమ్ పరికరా లు చోరీ అయి నామరూపాల్లేకుండా పోయింది. స్టేడియం ఉన్నా కోచ్లు లేకపోవడం, పట్టణా నికి దూరంగా ఉండడంతో నిరుపయోగంగా మారింది. రూ.1.40 కోట్లతో నిర్మించిన ఆధుని క వైకుంఠధామం వరదతో దెబ్బతింది. పట్టణంలో రూ.44.60 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టడంతో తాగునీటికి ఇబ్బందులు తీరాయి. కానీ లీకేజీలతో నీరు వృథాగా పోతోంది.
Comments
Please login to add a commentAdd a comment