కోడ్ సాకుతో పథకాలు నిలిపివేయొద్దు
● బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సాకుతో జనవరి 26న ప్రారంభించిన నాలుగు పథకాల అమలు నిలిపివేయవద్దని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం మాట్లాడా రు. అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం స్పష్ట త ఇవ్వాలన్నారు. సొంత స్థలం లేని పేదలకు ఇళ్లు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం వి ఫలమైందన్నారు. జిల్లాలో ఇల్లు లేని పేదలు 1.90 లక్షల మంది ఉంటే.. నిర్మల్ నియోజకవర్గం నుంచే సుమారు 70 వేల దరఖాస్తులు అందాయని తెలి పారు. మొదటి విడతలో నియోజకవర్గానికి కేవలం 3,500 ఇళ్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. అర్హులను ఎలా గుర్తిస్తారు, దానికి సంబంధించిన పూర్తి ప్రణాళికను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. రేషన్ కార్డు జారీలపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, మెడిసమ్మె రాజు, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment