వందశాతం పన్నులు వసూలు చేయాలి
● మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్
నిర్మల్టౌన్: నిర్మల్ మున్సిపాలిటీలో వంద శా తం పన్నులు వసూలు చేయాలని, పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సి పల్ వరంగల్ రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ప్రతీ డిపార్ట్మెంట్లోని రికార్డులను పరిశీ లించారు. పన్నుల వసూలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయ అధి కారులతో సమావేశం నిర్వహించారు. అధికా రులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. ప్ర జలకు సేవలు అందించాలని సూచించారు. మార్చి 31లోపు వంద శాతం పన్నులు వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఈ హరిభువన్, ఆర్వో అనూప్, శానిటరీ ఇన్స్పెక్టర్ దేవీదాస్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment