● డీఈవో రామారావు
సోన్: తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో రామారావు ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని సిద్దులకుంట సెకండరీ పాఠశాలను గురువారం తనిఖీ చేశా రు. ఈసందర్భంగా పదో తరగతి విద్యార్థుల ప్రత్యే క తరగతులను పరిశీలించారు. పలు ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. విద్యార్థుల ఎస్ఏ–1 రికార్డులు, స్లిప్ టెస్ట్ మార్కుల రికార్డులను పరిశీలించారు. ఉపాధ్యాయులు దత్తత తీసుకున్న విద్యార్థులు ప్రణాళిక పాటించేలా చూడాలన్నారు. మధ్యాహ్న భోజనం, సరుకుల గదిని పరిశీలించారు. ఫుడ్‌సేఫ్టీ కమిటీతో మధ్యాహ్న భోజనం నాణ్యత పరీక్షించాలని సూచించారు. అంతకుముందు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 50 మంది విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈవో పరమేశ్వర్, ప్రధానోపాధ్యాయుడు హరీశ్‌రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు చంద్రమోహన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణగౌడ్, సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment