ఇందూరులోనే పసుపు బోర్డు | Sakshi
Sakshi News home page

ఇందూరులోనే పసుపు బోర్డు

Published Mon, May 6 2024 6:00 AM

ఇందూర

సుభాష్‌నగర్‌: ఇందూరు కేంద్రంగానే పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కానుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. పసుపు రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఎంపీ అర్వింద్‌ పసుపు బోర్డు కోసం ప్రధాని మోదీ వెంట పడి సాధించారని అన్నా రు. వెంటనే గెజిట్‌ కూడా వచ్చిందన్నారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిగా, అర్వింద్‌ను రెండోసారి ఎంపీగా గెలిపిస్తే బోర్డు ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన ఇందూరు విశాల జ నసభలో అమిత్‌ షా ముఖ్యఅతిథిగా హాజర య్యారు. నవనాథ సిద్దుల గుట్ట, కందకుర్తి త్రివే ణి సంగమం, డిచ్‌పల్లి రామాలయం, బాసర సరస్వతి అమ్మవారికి నమస్కరించి ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు.

బీడీ కార్మికుల కోసం ఆస్పత్రి

పార్లమెంట్‌ పరిధిలో బీడీ కార్మికుల సంక్షేమం కోసం 500 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని అమిత్‌ షా ప్రకటించారు. 70 ఏళ్ల కాంగ్రెస్‌ హయాంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టలేదన్నారు. మోదీ ఐదేళ్లలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ చేశారని గుర్తు చేశారు. రామ జన్మభూ మి రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్‌ నాయకులను ఆహ్వానించారని, అయితే ఓవైసీకి భయపడి హాజరుకాలేదని అమిత్‌ షా ఎద్దేవా చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానానికి చేరుకుంటుందని పేర్కొన్నారు. నిజా మాబాద్‌లో వెలుగు చూసిన పీఎఫ్‌ఐ మూలాలను కూకటి వేళ్లతో పెకిలించి వేశామన్నారు. మోదీ సర్జికల్‌ స్ట్రైక్‌ ద్వారా పాకిస్తాన్‌లోకి చొరబడి ఉగ్రవాదులను చంపారని అన్నారు.

● రిజర్వేషన్లపై సీఎం రేవంత్‌రెడ్డి ఫేక్‌ వీడియో సృష్టించి ప్రచారం చేశారని, తన వ్యాఖ్యలు వక్రీకరించి దుష్ప్రచారం చేశారని అమిత్‌ షా అన్నా రు. ఎన్నికల సమయంలో అలా చేస్తే ఏం జరుగుతుందో రేవంత్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. ముస్లిం మహిళల ఆత్మగౌరవం కోసం మోదీ త్రిపుల్‌ తలాక్‌ను రద్దు చేస్తే.. కాంగ్రెస్‌ దాన్ని మళ్లీ తీసుకొస్తానని ప్రకటించిందన్నారు.

● చెరుకు ఫ్యాక్టరీలు మూత పడటానికి బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కారణమని అమిత్‌ షా విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిందని, చక్కెర కర్మాగారాలు తెరిపించాలన్నారు. ప్రజలు మే 13న కమలం గుర్తుకు ఓటు వేసి అర్వింద్‌ను గెలిపించాలని కోరారు.

అభివాదం చేస్తున్న ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యేలు రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌, నాయకులు ప్రకాశ్‌రెడ్డి, దినేశ్‌, మోహన్‌రెడ్డి, గంగారెడ్డి

స్పష్టం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

ప్రధాని మోదీ వెంట పడి అర్వింద్‌ సాధించారని ప్రశంస

ఇందూరులోనే పసుపు బోర్డు
1/2

ఇందూరులోనే పసుపు బోర్డు

ఇందూరులోనే పసుపు బోర్డు
2/2

ఇందూరులోనే పసుపు బోర్డు

Advertisement
 

తప్పక చదవండి

Advertisement