‘నిజామాబాద్‌ ఎంపీ సీటు బీఆర్‌ఎస్‌దే’ | Sakshi
Sakshi News home page

‘నిజామాబాద్‌ ఎంపీ సీటు బీఆర్‌ఎస్‌దే’

Published Mon, May 6 2024 6:05 AM

‘నిజామాబాద్‌ ఎంపీ  సీటు బీఆర్‌ఎస్‌దే’

నిజామాబాద్‌నాగారం: పార్లమెంట్‌ ఎన్నికల్లో ఖచ్చితంగా నిజామాబాద్‌ ఎంపీ సీటు బీఆర్‌ఎస్‌కే దక్కుతుందని నిజామాబాద్‌ అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. నగరంలోని 44వ డివిజన్‌లో ఆదివారం ఆయన ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బాధ్యతగా తీసుకొని బాజిరెడ్డి గెలుపు కోసం కృషి చేస్తున్నారన్నారు. మేయర్‌ దండు నీతూకిరణ్‌, నాయకులు నీలగిరిరాజు, ప్రభాకర్‌రెడ్డి, సుజిత్‌సింగ్‌ఠాకూర్‌, సత్యప్రకాష్‌, సుదాంరవి తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

ఆర్మూర్‌టౌన్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ ఉద్యోగులు, టీన్జీవోఎస్‌ కార్యాలయంలో పోలీస్‌ సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫారం–1 సమర్పించి ఓటేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు హక్కు కోసం 408 మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 364 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే హోమ్‌ ఓటింగ్‌ కోసం 390 మంది దరఖాస్తు చేసుకోగా 374 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీవో రాజాగౌడ్‌ పర్యవేక్షిస్తున్నారు.

ముప్కాల్‌ మండల పరిధిలో..

బాల్కొండ: ముప్కాల్‌ మండలం రెంజర్లలో ఐదుగురు, నల్లూరులో ముగ్గురు ఓటర్లు ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం నుంచి ఇంటింటికి పోలింగ్‌ సిబ్బంది తిరుగుతూ బ్యాలెట్‌ పత్రాలతో ఓటింగ్‌ పూర్తి చేశారు. ఓటింగ్‌ సందర్భంగా ఏ పార్టీ నాయకులను దగ్గరలోకి అనుమతించలేదు. పీవో, ఏపీవో, సెక్టోరియల్‌ అధికారులు పాల్గొన్నారు.

నెహ్రూనగర్‌లో

ఇంటింటి ప్రచారం

ఎడపల్లి(బోధన్‌): నెహ్రూనగర్‌లో కాంగ్రెస్‌ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షులు పు లి శ్రీనివాసరావు మాట్లాడుతూ..పేదలకు సంక్షేమ పఽథకాలు కాంగ్రెస్‌ ద్వారా అందుతాయని చెప్పారు. ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షులు ఈరంటి లింగం, మాజీ సర్పంచ్‌ అమానుల్లా, ఖాజా భేగ్‌, గ్రామ పార్టీ అధ్యక్షుడు సలీం, ఫెరోజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement