నూతన కార్యవర్గం ఎన్నిక
బోధన్: మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్– హ్యుమన్ రైట్స్ ఫోరం) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలో ఇటీవల జరిగిన జిల్లా మహాసభలో వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ,సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు పర్యవేక్షణలో ఎన్నిక జరిగిందని ఒక ప్రకటనలో వేది క ప్రతినిధులు తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా గడ్డం గంగులు (బోధన్) ఉపాధ్యక్షులుగా ఎండీ అహ్మద్ (బోధన్), తెయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరిత, ప్రధాన కార్యదర్శిగా గొంట్యాల రమేష్ (నిజామాబాద్), సహాయ కార్యదర్శులుగా అరుణరేఖ, జగన్ (ఆర్మూర్), కోశాధికారిగా ఆకుల సత్యనారాయణ (నిజామాబాద్), కార్యవర్గ సభ్యులుగా మీనా సహానీ (నిజామాబాద్), అరుణ్‌కుమార్ (బోధన్), మారుతి(బోధన్), శ్రీనివాస్ (బోధన్),అన్వేష్ (నిజామాబాద్), పోచన్న, రామాగౌడ్, కృష్ణ గోపాల్‌రావు, నరేందర్ ఎన్నికయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment