నిందితులను కఠినంగా శిక్షించాలి
నిజామాబాద్ నాగారం: జగిత్యాల్ జిల్లాలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు మదాలే అజయ్, జిల్లా కార్యదర్శి బత్తుల కిష్టయ్య, డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలోని ధర్నా చౌక్‌లో సోమవారం వారు ధర్నా నిర్వహించి, మాట్లాడారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలన్నారు. దుండగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ధర్నాలు, నిరసనలు చేస్తామని హెచ్చరించారు. నాయకులు వెంకటరమణ, విజ య సాలంకే, సక్కి ప్రభాకర్, సాయినాథ్, అనిల్, మారుతి, దీపక్, సచిన్, ధనుష్ పాల్గొన్నారు.
మాలమహానాడు ఆధ్వర్యంలో..
జగిత్యాల జిల్లాలో అంబేడ్కర్ విగ్రహంను ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్ గైని గంగారాం అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో సోమవారం వారు నిరసన తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు సక్కి విజయ్‌కుమార్, కార్యదర్శి సిద్ధం రాజేందర్, లక్ష్మన్, జాఫర్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment