న్యాయవాదిపై దాడి సరికాదు
ఖలీల్‌వాడి: నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది మహమ్మద్ ఖాసీమ్‌పై ఖాన్ బ్రదర్స్ భౌతిక దాడి చేయడం సరికాదని బార్ అసోసియేషన్ నాయకులు అన్నారు. నగరంలోని జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ హాల్‌లో సోమవారం వారు సమావేశం నిర్వహించారు. బార్ అధ్యక్షుడు జగన్ మోహన్‌గౌడ్ మాట్లాడుతూ.. న్యాయవాది ఖాసీమ్ కార్యాలయ స్థలాన్ని అమ్మివేయాలని లేదంటే చంపివేస్తామని బెదిరించి, ఆదివారం ఆయనపై అర్షద్ ఖాన్, ముజఫర్ ఖాన్, ముజాయిద్ ఖాన్ దాడి చేసి తీవ్రంగా గాయపర్చారన్నారు. వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని, రాష్ట్రంలో న్యాయవాద ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు మంథని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులపై భౌతికదాడులను ఎదుర్కోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నూతన చట్టం తయారు చేస్తున్నదని తెలిపారు. అనంతరం న్యాయవాదులు జిల్లాకోర్టు ఆవరణ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఖాసీమ్‌ను పరామర్శించారు. నిజామాబాద్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజా వెంకటరెడ్డి కార్యాలయంలో ఆయననను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. సీనియర్ న్యాయవాదులు ఎర్రం గణపతి, తుల గంగాధర్, పరుచూరి శ్రీధర్, బార్ ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్‌రావు, కార్యదర్శి సురేష్, కోశాధికారి దీపక్, న్యాయవాదులు అపూర్వ, గంగోనే కవిత, మానిక్ రాజు, కృష్ణనంద్, నారాయణ, వెంకటేశ్వర్, మధుసుధన్‌రావు, హరిప్రసాద్, భాస్కర్, శ్యామ్‌బాబు పాల్గొన్నారు.
నిరసన తెలుపుతున్న న్యాయవాదులు
Comments
Please login to add a commentAdd a comment