నియామకం
తెయూ(డిచ్పల్లి): అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు శివ నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లో ఇటీవల జరిగిన జాతీయ మహాసభల్లో సభ్యులు శివను ఎన్నుకున్నారు. తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని శివ ఒక ప్రకటనలో తెలిపారు.
దివ్యాంగుల సమస్యలు
పరిష్కరించాలి
బోధన్: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ. 6వేల పింఛన్ ఇవ్వాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సోమవారం పట్టణంలోని సబ్ కలెక్టర్ ఆఫీసు ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు వినతిపత్రం అందించారు. దివ్యాంగుల ఫించన్ పెంపుదల, ఇతర డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 9న ఛలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టామని ప్రతినిధులు తెలిపారు. వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గైని రాములు, యేశాల గంగాధర్, షేక్ నజీర్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment