రైతు శ్రేయస్సు కోసమే ‘సంఘాలు’
కమ్మర్పల్లి: రైతు ఉత్పత్తిదారుల సంఘాలతో ప్రయోజనం ఉంటుందని, రైతుల శ్రేయస్సు కోసమే మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసినట్లు ఐకేపీ జిల్లా ఫామ్ విభాగం డీపీఎం మారుతి అన్నారు. కమ్మర్పల్లిలో సోమవారం వారు మహిళా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గం పరిధిలో శ్రీరాంసాగర్ మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీని రిజిస్టర్ చేయడంతోపాటు, దానికి అనుబంధంగా అన్ని మండలాలలో మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రైతులు ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు వంటి అవసరాలను స్థానికంగా తీర్చుకోవడానికి ఈ సంఘాలను వేదికగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఏవో రమ్యశ్రీ మాట్లాడుతూ, రైతులు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలలో కూడా రాణించాలని సూచించారు. ఏపీఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు చేపట్టే రైతులకు 35 శాతం సబ్సిడీతో రుణాలు ఇప్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment