నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్‌నాగారం: నగరంలోని గాయత్రినగర్‌లోని పద్మశాలి తర్ప40 నూతన కార్యవర్గంను సోమవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నందాల సురేష్‌కుమార్, ఉపాధ్యక్షులుగా పెకుడ రాజు, మార గంగాధర్, కార్యదర్శిగా మిట్టపల్లి రాజు, సంయుక్త కార్యదర్శులుగా మచ్చ విశ్వప్రసాద్, చెలిమెల గణేష్, కోశాధికారిగా గొనే రాజేశ్వర్, ముఖ్య సలహాదారులుగా చిక్కెల స్వాత్మారాం, కార్యవర్గ సభ్యులుగా మంచె నరేశ్, బొల్లి నర్సింలు, బండ రాజేందర్, పుట్ట గణేష్, అల్లె చంద్రమోహన్, అయ్యవార్ ప్రభుదాస్, ఈసీ మెంబర్ తాళ్లరాము, దైవశెట్టి బట్టు పోమయ్య ఎన్నికయ్యారు.
కాంగ్రెస్‌తోనే
రైతు సంక్షేమం సాధ్యం
నిజామాబాద్ రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతు సంక్షేమం సాధ్యం అని సీనియర్ కాంగ్రెస్ నాయకులు అగ్గు భోజన్న స్పష్టం చేశారు. నగరంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసి నట్టేట ముంచిందన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీల్లో భాగంగా రైతు రుణమాఫీ, ఖరీఫ్ పంటకు రూ.500 బోనస్ ప్రకటించడం హర్షణీయమన్నారు. రైతులు అందరు కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉండాలని వివరించారు. మునుముందు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నడుస్తుంది రైతు ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్నదాతలు ధనవంతులవుతారని అన్నారు. సన్నాలకు బోనస్ ఇవ్వడంతో సీఎం రేవంత్‌రెడ్డికి రూరల్, ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
గడుగు గంగాధర్‌కు సన్మానం
నిజామాబాద్ సిటీ: రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు, కాంగ్రెస్ నాయకుడు గడుగు గంగాధర్‌ను సోమవారం జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో పలువురు నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు గడు గును ఘనంగా సన్మానించారు. నాయకు లు అరవపల్లి పురుషోత్తంగుప్తా, వెంకట రాజబా బు, సుభాష్‌జాదవ్, గూపన్‌పల్లి చర్చి ఫాదర్, సభ్యులు బెన్ని,ప్రశాంత్,కమలాకర్, సుమ న్, యోహాను,ప్రభాకర్,బాలలక్ష్మి,బంటు వినో ద,నీరడి అనుసూయ,మెట్టు క్రాంతి లున్నారు.
కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలి
నిజామాబాద్ సిటీ: వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అనంతరం నూర్జహాన్ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్యశాఖలో 2000 సంవత్సరం నుంచి కాంట్రాక్ట్ పద్దతిలో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలను రెగ్యులరైజేషన్ చేసి, వారికి కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. దశాబ్దాల తరబడి ఆందోళనలు, నిరవధిక సమ్మెలు చేసినా ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసి రాత పరీక్ష లేకుండా నేరుగా వారిని రెగ్యులర్ చేయాలన్నారు. సర్వీసు వెయిటెజీకి 50 మార్కులు ఇవ్వాలన్నారు. నాయకులు శంకర్‌గౌడ్, ప్రమీల, పుష్ప, కవిత, సావిత్రి, సరోజ పాల్గొన్నారు.
ఆలయానికి
వెండి హారతిపల్లెం వితరణ
నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండా బాలాజీ ఆలయానికి సోమవారం ఖలీల్‌వాడిలోని శ్రీవిష్ణు ఆస్పత్రి నిర్వాహకులు బొద్దుల రాజేంద్రప్రసాద్–వనిత వారి కుమార్తె అవిశరాజ్ జన్మదినం పురస్కరించుకొని స్వామివారికి 800 గ్రాముల వెండి హారతి పల్లెం అందజేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వేణు, అర్చకులు నాగరాజాచారి, జూనియర్ అసిస్టెంట్ ప్రశాంత్‌కుమార్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment