ధరణి పోర్టల్ సమస్యలపై సమీక్ష
జక్రాన్పల్లి: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ధరణి సమస్యలపై సీఎంఆర్వో ప్రాజెక్టు డైరెక్టర్ మకరంద్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధరణిలో చేపడుతున్న రిజిస్ట్రేషన్లను పరిశీలించారు. ధరణిలో సాంకేతిక సమస్యలపై అడిగి తెలుసుకున్నారు. ధరణిలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అడిగారు. స్లాట్ బుకింగ్ సమయంలో ఏవైన సందేహాలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. ధరణిలో కొత్త మాడ్యుల్స్ రైతులకు ఎలా ఉపయోగపడుతున్నాయని చర్చించారు. ధరణి సమస్యలపై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. ఆయన వెంట ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్ కిరణ్మయి, డిప్యూటీ తహసీల్దార్ దత్తాద్రి, ఆర్ఐ ప్రవీణ్, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment