నియామకాలెన్నడో?
హోదా పోస్టులు దరఖాస్తులు
స్టాఫ్‌నర్సు 30 894
ఏఎన్‌ఎం 03 447
డాటాఎంట్రీఆపరేటర్, 01 152
అకౌంటెంట్
ఫార్మాసిస్ట్ 06 400
డాటా ఎంట్రీ ఆపరేటర్ 03 172
ఆర్‌బీఎస్‌కే మెడికల్‌ఆఫీసర్ 11 11
జిల్లా కో ఆర్డినేటర్ 01 25
న్యూట్రీషన్ 01 50
నిజామాబాద్‌నాగారం : వైద్యారోగ్యశాఖలో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు తొమ్మిది నెలలుగా నిరీక్షిస్తున్నారు. దరఖాస్తుదారులు కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. వైద్యారోగ్యశాఖలో స్టాఫ్‌నర్స్, ఏఎన్‌ఎం, డాటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్, ఆర్‌బీఎస్‌కే, ఫార్మాసిస్ట్, కో ఆర్డినేటర్, న్యూట్రిషన్ తదితర పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు. దరఖాస్తులు భారీ సంఖ్యలో రావడంతో అప్పటి డీఎంహెచ్‌వో సుదర్శనం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పేరుతో కాలయాపన చేశారనే విమర్శలున్నాయి. మెరిట్ జాబితాను నెల రోజుల్లో తయారు చేస్తామని చెప్పారని, తొమ్మిది నెలలవుతున్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఆయన పదవీ విరమణ చేయడం, పార్లమెంట్ ఎన్నికల కోడ్, మూడు నెలలపాటు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో కొనసాగడం జాప్యానికి కారణమైంది. ఆగస్టులో పూర్తిస్థాయి డీఎంహెచ్‌వోగా రాజశ్రీ వచ్చినప్పటికీ ఆమెకు పూర్తిస్థాయి అవగాహన రావడానికి రెండు నెలల సమయం పట్టింది. ఆ వెంటనే శాఖలో బదిలీల ప్రక్రియ చేపట్టడంతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకం అటకెక్కింది.
ఆశలన్నీ డీఎంహెచ్‌వోపైనే..
పోస్టులు పదుల సంఖ్యలో ఉన్నప్పటికీ వందల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే గతంలో పని చేసిన శాఖ జిల్లా అధికారులు అవుట్ సోర్సింగ్ నియామకాలను పట్టించుకోలేదని, ఇప్పుడు తమ ఆశలన్నీ ప్రస్తుత డీఎంహెచ్‌వోపైనే ఉన్నాయని దరఖాస్తుదారులు అంటున్నారు. మెరిట్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారని ఆశతో ప్రతిరోజూ కార్యాలయానికి వస్తున్నారు. కొందరు దరఖాస్తుదారులు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల ద్వారా పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
నెల చివరివరకు భర్తీ చేస్తాం
ఎన్నికల కోడ్ అమలులో ఉండడం, నేను బాధ్యతలు తీసుకున్న తరువాత బది లీల ప్రక్రియ చేపట్డంతో అవుట్‌సోర్సింగ్ నియామకాలు ఆలస్యమయ్యా యి. స్వయంగా దరఖాస్తులను పరిశీలించి మెరిట్ జాబితాను రూపొందిస్తున్నా. ఈ నెలాఖరు నాటికి కచ్చితంగా పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటా.
– రాజశ్రీ, డీఎంహెచ్‌వో
వైద్యారోగ్యశాఖలో భర్తీకాని
అవుట్‌సోర్సింగ్ పోస్టులు
పదుల సంఖ్యలో పోస్టులు..
వందల సంఖ్యలో దరఖాస్తులు
దరఖాస్తులు స్వీకరించి
తొమ్మిది నెలలు..
నాటి నుంచి ఎదురుచూపులే
Comments
Please login to add a commentAdd a comment