బిడ్డ అనారోగ్యం తట్టుకోలేక..
మోపాల్(నిజామాబాద్‌రూరల్) : ఒక వైపు 18 నెల ల కుమార్తెకు తీవ్ర అనారోగ్య సమస్య.. మరోవైపు ఆర్థిక భారం.. వెరసి తీవ్ర మానసిక క్షోభతో మోపాల్ మండలంలోని న్యాల్‌కల్ మాసాని చెరువు లో కూతురుతో సహా దూకి బలవన్మరణానికి పా ల్పడ్డాడు తండ్రి. వెళ్లిపోతున్నా.. క్షమించాలంటూ భార్య మానస, కుటుంబ సభ్యులకు సూసైడ్ నోట్ రాసి తనువు చాలించాడు. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ నగరంలోని ఇంద్రాపూర్‌కు చెందిన రఘు పతి క్రాంతికుమార్ (35) కు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మానసతో వివాహమైంది. వీరికి 18 నెలల నేహశ్రీ , 3 నెలల వయస్సుగల మరో పాప ఉంది. నేహశ్రీ అంటే తండ్రికి ఎనలేని ప్రేమ. క్రాంతికుమార్ డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి)లోని గు రుకుల పాఠశాలలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధు లు నిర్వర్తిస్తున్నాడు. నేహశ్రీకి మానసిక అనారో గ్యం కారణంగా రెండు సార్లు బ్రెయిన్ ఆపరేషన్ చే యించాడు. వైద్య ఖర్చులు పెరిగిపోయాయి. అయినప్పటికీ కూతురు ఆరోగ్యం మెరుగుపడలేదు. మ రోవైపు అప్పులు తీర్చే మార్గం లేక క్రాంతికుమార్ నిత్యం మనస్తాపానికి గురయ్యేవాడు. క్రాంతికుమా ర్ తన జన్మదిన వేడుకలు ఆదివారం రాత్రి ఇంట్లో స్నేహితులతో జరుపుకున్నాడు. రోజంతా సంతోషంగా గడిపిన ఆయన పెద్ద కుమార్తెతో కలిసి ని ద్రించాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల స మయంలో నేహ శ్రీని వెంట బెట్టుకుని బైక్‌పై మాసాని చెరువు కట్టకు చేరుకుని కూతురితో కలిసి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
చెరువు కట్టపై బైక్‌ను నిలిపి..
సోమవారం ఉదయం భర్త క్రాంతికుమార్, పెద్ద కు మార్తె నేహ శ్రీ కన్పించకపోవడంతో మానస ఆందో ళనకు గురైంది. వెంటనే తల్లిదండ్రులు, బంధువుల కు సమాచారమివ్వగా, వారంతా గాలించారు. క్రాంతికుమార్ బైక్ మాసాని చెరువు కట్ట పై కన్పించడంతో పోలీసులకు సమాచారమిచ్చా రు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికి తీయించా రు. పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. కేసు నమోదు చేసుకు ని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు.
క్రాంతికుమార్ సూసైడ్ నోట్‌లో సారీ అమ్మ, నాన్న, భార్య, చెల్లె, తమ్ముడు.. తాను వెళ్లిపోతున్నానని, భార్య మానస చిన్న కుమార్తెను మంచిగా చూ సుకోవాలని, సంతోషంగా ఉండాలని రాసినట్లు పో లీ టసులు పేర్కొన్నారు. కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.
18 నెలల చిన్నారితో చెరువులో దూకి తండ్రి బలవన్మరణం
కుటుంబ సభ్యులు క్షమించాలంటూ సూసైడ్ నోట్
Comments
Please login to add a commentAdd a comment