సమ్మె ఎఫెక్ట్‌! | - | Sakshi
Sakshi News home page

సమ్మె ఎఫెక్ట్‌!

Published Fri, Mar 17 2023 2:22 AM | Last Updated on Fri, Mar 17 2023 2:22 AM

 బరంపురం ఫస్ట్‌గేట్‌ వద్ద ప్రధాన రహదారిపై ఆందోళనకారులు - Sakshi

బరంపురం ఫస్ట్‌గేట్‌ వద్ద ప్రధాన రహదారిపై ఆందోళనకారులు

శుక్రవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2023
● డ్రైవర్ల ఆందోళనతో స్తంభించిన 2వేల ట్యాంకర్‌ ట్రక్కుల రవాణా ● రాష్ట్రవ్యాప్తంగా అడుగంటి పోతున్న పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ● ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు ● నిరసనకారులతో చర్చించాలని రవాణా మంత్రిని ఆదేశించిన స్పీకర్‌

భువనేశ్వర్‌: సరుకులు, ఇంధనం రవాణా చేసే వాహనాలను నిలిచి పోవడంతో వర్ణనాతీతమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒడిశా డ్రైవర్‌ మహాసంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో కొనసాగుతున్న స్టీరింగ్‌ విరమణ నిరవధిక సమ్మెతో ఈ పరిస్థితులు తాండవిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే శనివారం నుంచే రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్‌ సంక్షోభం పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్ర రాజధాని పరిసర ప్రాంతాల్లో పలు ఇంధన విక్రయ కేంద్రాల్లో పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు నిండుకోవడంతో మూసివేసినట్లు సమాచారం. రాష్ట్రంలో 1,600 పెట్రోలు బంకులకు పారాదీప్‌, బాలాసోర్‌, ఝార్సుగూడ, జట్నీ డిపోల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ఇంధనం సరఫరా అవుతుంది. అయితే డైవర్ల సమ్మెతో సుమారు 2వేల ట్యాంకర్‌ ట్రక్కుల్లో ఈ రవాణా స్తంభించిపోయింది. వాణిజ్య వాహనాల డ్రైవర్ల సమ్మె పిలుపు దృష్ట్యా, ఆందోళనకు ముందు చాలా ఇంధన కేంద్రాలు మంగళవారమే 3 రోజులకు సరిపడా ఇంధనం ముందస్తుగా నిల్వ చేయడంతో ఇప్పటి వరకు నిరాటంకంగా ఇంధనం లభ్యత సాధ్యమైందని ఉత్కళ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సంజయ్‌లాథ్‌ తెలిపారు. గత రెండు రోజులుగా వాణిజ్య రవాణా వాహనాల రవాణా పూర్తిగా స్తంభించిన విషయం తెలిసిందే. క్రమంగా ఇంధన నిల్వలు అడుగంటి పోతున్నాయని ఆయన ముందస్తు సమాచారం జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో వినియోగదారులు పరిమితి కొనుగోలు చేస్తే అందుబాటులో ఉన్న నిల్వలతో మరో 1, 2 రోజులు చలామణి అవుతుంది. లేకుంటే సంక్షోభం తక్షణమే తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరించారు.

చర్చలకు ఆహ్వానం..

దాదాపు శుక్రవారం మధ్యాహ్నం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని సంజయ్‌లాథ్‌ తెలిపారు. ఇదే పరిస్థితి చోటు చేసుకుంటే అంబులెన్స్‌ సేవలు ప్రభావితమయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. డ్రైవర్ల సంఘం సమ్మె విరమిస్తే ఇంధన రవాణా వాహనాలు బయల్దేరేందుకు సిద్ధంగా ఉన్నాయని భరోసా ఇచ్చారు. పెట్రోల్‌, డీజిల్‌ను నిత్యావసర వస్తువులుగా పరిగణిస్తున్నందున డ్రైవర్ల సమ్మె పరిధిలోకి రాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు. రాష్ట్రంలో నిత్య వినియోగం కోసం డీజిల్‌ సగటున 6వేల లీటర్లు, పెట్రోల్‌ 2,750 కిలో లీటర్లు అవసరం ఉంటుందని వివరించారు. సమ్మె కారణంగా కూరగాయల సరఫరా, నిత్యావసర వస్తువుల సరఫరా కూడా ప్రభావితమైంది. దీంతో ప్రజలు కిరాణా, కూరగాయల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు. ఈ సరుకుల ధరలు రెట్టింపు అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆందోళన చేస్తున్న డ్రైవర్లతో చర్చించి శుక్రవారం సభలో వివరణ ప్రవేశ పెట్టాలని రవాణాశాఖ మంత్రి టుకుని సాహుకు శాసనసభ స్పీకర్‌ బిక్రమ్‌ కేశరీ అరూఖ్‌ గురువారం ఆదేశించారు.

జాతీయ రహదారులపై తిష్ట..

సామాజిక భద్రత, పెన్షన్‌తో సహా 10 ప్రధాన డిమాండ్లతో ఒడిశా డ్రైవర్ల మహాసంఘం బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెను ప్రారంభించింది. సంక్షేమ నిధి ఏర్పాటు, మరణాంతరం కుటుంబానికి ప్రయోజనాలు, 60 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌ తదితరాలు తమ డిమాండ్లలో ఉన్నాయి. ఆందోళన చేస్తున్న డ్రైవర్లు రాష్ట్రంలోని పలు చోట్ల ప్రదర్శనలు నిర్వహించి పికెటింగ్‌లకు దిగారు. ఆందోళనకారులు జాతీయ రహదారులపై వాణిజ్య వాహనాలను నిలిపి వేశారు.

నిన్న.. నేడు..

భువనేశ్వర్‌: రాష్ట్రంలో డ్రైవర్ల ఆందోళన కొనసాగుతుండటంతో కూరగాయల ధరలపై ప్రభావం కనిపిస్తోంది. నగరంలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. రెండు రోజులుగా లారీ రవాణా స్తంభించడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు చెబుతున్నారు. మరో సగం ట్రక్కులు మార్గంమధ్యలో రోడ్డుపై ఇరుక్కుపోయాయి. ఈ పరిస్థితుల్లో పరిసర ప్రాంతాల నుంచి కూరగాయల దిగుమతికి గండిపడింది.

పర్యవేక్షిస్తున్న ఎస్పీ జగ్‌మోహన్‌ మినా, ఐఐసీ

అధికారులు

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
 యూనిట్‌–1 మార్కెట్లో కూరగాయల విక్రయాలు 
1
1/4

యూనిట్‌–1 మార్కెట్లో కూరగాయల విక్రయాలు

2
2/4

3
3/4

4
4/4

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement