అర్జీలు స్వీకరించి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ అరుణ్ బాబు
నరసరావుపేట: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)కు వచ్చే ప్రతి ఫిర్యాదు పరిష్కారం కావాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 110 వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు ఇక్కడకి వస్తుంటారని, అటువంటి వారి సమస్యలను సావధానంగా విని, సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, ఆ పరిష్కారంతో అర్జీదారు సంతృప్తి చెందాలని అన్నారు. ఇందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరిష్కారం చూపాలని సూచించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారులకు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు సూచన కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌కు 110 అర్జీలు
పీహెచ్‌సీల ద్వారా 104 సర్వీసులు నిర్వహించాలి
మమ్మల్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా 104 సర్వీసులను నిర్వహించాలి. పెండింగ్‌లో ఉన్న మూడు నెలల జీతాలు చెల్లించాలి. డ్రైవర్, డీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించండి. వాహనాలకు ఫిట్‌నెస్ ఇన్స్యూరెన్స్ చేయించండి.
– కోటేశ్వరరావు, అశోక్‌బాబు, నరసింహారావు, ఏపీ 104 ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment