పేదలకు మేలుచేసేలా.. జగనన్న పాలన | Sakshi
Sakshi News home page

పేదలకు మేలుచేసేలా.. జగనన్న పాలన

Published Thu, Mar 14 2024 2:05 AM

- - Sakshi

ప్రతీ పేదవాడిని ధనికుడిని చేసిన ఘనత జగనన్నదే.. 

స్కాముల కేసుల భయంతోనే మోదీ పంచకు చంద్రబాబు 

పవన్‌ కళ్యాణ్‌ ఒక కాపీరాయుడు 

 ఎర్ర పుస్తకం పేరుతో లోకేశ్‌ అధికారులను బెదిరిస్తున్నాడు 

 జగన్‌ బటన్‌ నొక్కితే డబ్బులు పేదల ఖాతాల్లోకి.. 

 చంద్రబాబు బటన్‌ నొక్కితే సుజనా, సీఎం రమేష్‌, రామోజీ, రాధాకృష్ణ ఖాతాల్లోకి.. 

 టీడీపీ, జనసేన సోషల్‌ మీడియా వేధింపులకు ఓ మహిళ బలి 

 విజయనగరంలో వైఎస్సార్‌ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

 పాల్గొన్న వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జిల్లా నేతలు

విజయనగరం రూరల్‌: దేశ చరిత్రలోనే ప్రతీ పేదవాడిని ధనికుడిని చేసిన ఘనత ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్‌సీపీ యువజన విభా గం రాష్ట్ర అధ్యక్షుడు, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వ ర్యంలో విజయనగరం పట్టణంలో బుధవారం నిర్వ హించిన యువజన భేరి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు జిల్లా యువత ఘన స్వాగతం పలికింది. జగనన్న పాలన కు జేజేలు పలికింది. పట్టణంలోని వెంకటలక్ష్మి కూడలి నుంచి ప్రారంభమైన భారీ ర్యాలీలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. యువతకు అభివాదం చేస్తూ ఉత్సాహపరిచారు. యువజన ర్యాలీ ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచి, కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం కూడలి మీదుగా మూడులాంతర్లకు చేరుకుంది. అక్కడ యువతనుద్దేశించి సిద్ధార్థరెడ్డి ప్రసంగించారు. ఆయన మాటల్లోనే..

► రానున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది. యువత ఎన్నికల ప్రచారంలో పాల్గొని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మంచిని చెప్పాలి. చంద్రబాబునాయుడు మోసాలను ప్రజలకు వివ రించాలి. మూడు పార్టీల అనైతిక పొత్తులను ఇంటింటికీ తెలియజేయాలి. రాజకీయాలకు సంబంధంలేని బీసీ మహిళ గీతాంజలి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన మేలును వివరిస్తే.. టీడీపీ, జనసేన పార్టీ సోషల్‌ మీడియా విభాగం ఆమెను వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడేలా చేశాయి.

►జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు కలిగిన మేలును చూసి టీడీపీ, జనసేన, రామోజీ, రాధాకృష్ణలు ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు పుష్కరాల పేరుతో అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. నీరు–చెట్టుతో కోట్లాది రూపాయలను టీడీపీ నాయకులకు దోచిపెట్టారు. మార్గదర్శి పేరుతో రామోజీరావు ప్రజల డబ్బును కొట్టేశాడు. ఇలాంటి తప్పుడు పనులను చేస్తున్న వారికి మద్దతు తెలుపుతున్న పవన్‌కళ్యాణ్‌ లాంటివారికి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి.

►చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బటన్‌ నొక్కితే డబ్బులు రామోజీ, లింగమనేని, సీఎం రమేష్‌, సుజనాచౌదరి, రాధాకృష్ణ జేబులు నిండాయి. ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కితే నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరుతున్నాయి. పారదర్శక పాలన అంటే ఇదే.

► ఎన్నికల వేళ పగటి వేషగాళ్లు వస్తుంటారు. అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలి. చంద్ర బాబునాయుడు లాంటి వారికి ఎన్నికలు వస్తే పొత్తులు గుర్తుకువస్తాయి. పొత్తు పేరుచెప్పి ప్రజల ను మోసం చేయడం ఆయన నైజం. ప్రధాని మోదీ ని దేశంలో ఏ నాయకుడు తిట్టనన్ని తిట్లు చంద్రబా బు తిట్టాడు. ఇప్పుడు కేసుల భయంతో మోదీ పాదాలపై వాలాడు.

► ఏడు శాతం ఓటు బ్యాంకు ఉన్న జనసేనకు 2 పార్లమెంట్‌ సీట్లు ఇస్తే, ఒకశాతం ఓటు బ్యాంకులేని బీజేపీకి 6 సీట్లు ఇవ్వడం చంద్రబాబుకు ఉన్న భయాన్ని తేటతెల్లం చేస్తుంది. రోజుకో సీటు తగ్గిస్తున్నా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌.. త్యాగా లు పేరు చెప్పి చంద్రబాబునాయుడు చెప్పినట్టు ఆడుతూ అభిమానులను మోసం చేస్తున్నాడు. నిలువునా ముంచేస్తున్నాడు. వాస్తవంగా పవన్‌ కళ్యాణ్‌ ఒక కాపీరాయుడు. రెండు చోట్ల ఓడిపోయిన బాధను ప్రజలపై రుద్దుతున్నాడు.

► రాష్ట్ర ప్రజలకు మరుపు ఎక్కువని, ఏది చేసినా మరిచిపోతారని చంద్రబాబు భావన. గుండెకు తగిలిన గాయంతో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వెంట ఉన్న నాయకులకు పదవులు ఆశచూపి విమర్శలు చేయిస్తున్నారు. సాయంచేసిన వారిని చనిపోయే వరకు ప్రజలు గుర్తు పెట్టుకుంటారన్న విషయాన్ని మర్చిపోతున్నారు.

► లోకేశ్‌ రెడ్‌బుక్‌ పేరుతో అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. చంద్రబాబు అమరావతి రైతుల ను మోసం చేసి తన అనుయాయులను కోటీశ్వరులను చేశాడు. రానున్న ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఆలోచించి ఓటేయాలి. ప్రతీ ఒక్కరూ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించనున్న మేనిపేస్టో గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారంటే అది కేవలం ఆయనపై ఉన్న నమ్మకమే. చెప్పింది చేయడం, చేయగలిగిందే చేయడం జగన్‌మోహన్‌రెడ్డి తత్వం అని సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు.

► కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ప్రసంగించారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వివరించా రు. వైఎస్సార్‌ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎస్‌.బంగారునాయుడు, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్‌, అల్లు చాణక్య, నందీ

 

1/1

Advertisement
 
Advertisement
 
Advertisement