మలేరియా, డెంగీ నియంత్రణకు కృషి
గుమ్మలక్ష్మీపురం: మలేరియా, డెంగీ వ్యాధుల నియంత్రణకు కృషి చేస్తున్నట్లు జిల్లా మలేరియా అధికారి మణి తెలిపారు. ఈమేరకు మలేరియా కేసులు ఎక్కువగా నమోదైన గుమ్మలక్ష్మీపురం మండలంలోని కుంతేసు గ్రామాన్ని బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల మలేరియా వ్యాధి బారన పడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన వారి ఆరోగ్య పరిస్థితుల గురించి ఆరాతీశారు. మలేరియాతో బాధపడుతున్న వారి ఇంటి సభ్యులందరికీ రక్తపరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులను అందజేశారు. నిరంతరం పర్యవేక్షణ చేపట్టి గ్రామంలో మలేరియా కేసులు పెరగకుండా వైద్యసిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె దుడ్డుఖల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి ల్యాబ్‌లో నిర్వహిస్తున్న రక్తపరీక్షలు, వాటి ఫలితాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మలేరియా పాజిటివ్ వచ్చిన ప్రతి గ్రామంలో ఏఎల్వో పిచికారీతో పాటు నీరు నిల్వ ఉండకుండా తగు జ్రాత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆమె వెంట సహాయ మలేరియా అధికారి సూర్యనారాయణ, విస్తరణ అధికారి సత్యరావు, సబ్ యూనిట్ అధికారి రాధాకృష్ణ ఉన్నారు.
జిల్లా మలేరియా అధికారి మణి
Comments
Please login to add a commentAdd a comment