గర్జించిన విద్యార్థిలోకం
● విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ● విద్యా, వసతి దీవెన బకాయిల చెల్లింపులో జాప్యంపై మండిపాటు ● టీడీపీ కూటమి ప్రభుత్వ తారుపై నిరసన ● కలెక్టరేట్‌ను ముట్టడించిన విద్యార్థులు ● అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
విద్యార్థుల డిమాండ్‌లు ఇవే...
●ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలి.
●పార్వతీపురం మన్యం జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.
●జిల్లా కేంద్రంలో, పాలకొండలో పీజీ, డైట్, నర్సింగ్ సెంటర్లు, మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి.
●పాఠశాల్లలో ఖాళీగా ఉన్న టీచర్, ఏఎన్‌ఎం పోస్టులు భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో వార్డెన్‌లు, వర్కర్లను నియమించాలి.
●గరుగుబిల్లి, సీతంపేట మండలాల్లో జూనియర్ కళాశాల, కురుపాం కేంద్రంలో డిగ్రీ కళాశాల, వీరఘట్టాంలో డిగ్రీ కళాశాలలకు సొంత భవనం నిర్మించాలి.
●ఎస్సీ, బీసీ పోస్టు మెట్రిక్ వసతి గృహాలకు సొంత భవనాలు, గిరిజన పోస్టు మెట్రిక్ వసతి గృహాలకు అదనపు భవనాలు నిర్మించాలి.
●మెస్ చార్జీలు రూ.3000కి పెంచాలి. బకాయి మెస్ బిల్లులు విడుదల చేయాలి.
●విద్యార్థుల మరణాలు ఆగేలా చూడాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి.
●తల్లికి వందనం, పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్ అమలుపై స్పష్టత ఇవ్వాలి.
●మెడికల్ కళాశాలల ప్రైవేటుపరం చేయడాన్ని ఆపేయాలి. వైద్యకళాశాలల్లో సెల్ప్ ఫైనాన్స్ విధానాన్ని రద్ధు చేయాలి.
●సంక్షేమ వసతి గృహాల్లో భోజనం కోసం అక్షయపాత్ర విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.
పార్వతీపురంటౌన్: విద్యారంగ సమస్యల పరిష్కారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం జాప్యంపై విద్యార్థిలోకం గర్జించింది. తక్షణమే విద్యాదీవెన, వసతిదీవెన, తల్లికి వందనం నిధులు విడుదల చేయాలని, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాల ని డిమాండ్ చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్టీసీ కాంపెక్స్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించా రు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. డిగ్రీ కళాశాలల్లో అమలు చేస్తున్న హానర్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఎస్ ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజు, పండు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలోని ఆరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 12 ప్రైవేట్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు విద్యా, వసతి దీవెన నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులపై ఫీజుల ఒత్తిడి పెరిగిందన్నారు. విద్యార్థులకు భారంగా మారిన ప్రత్యేక ఫీజులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలచేసేవరకు కళాశాల యాజమాన్యాలు ఎటువంటి ఒత్తిడి చేయకుండా చూడాలన్నా రు. శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థుల ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్నిక ల కోడ్ కారణంగా నిరసన ర్యాలీలు నిర్వహించరాదని, తక్షణమే విరమించుకోవాలి హెచ్చరించారు. తమ సమస్యలను అధికారులకు విన్నవించుకుంటామని తెలిపినా పట్టించుకోకుండా పోలీసులు బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యా ర్థులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇందులో పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గుర య్యారు. సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ నిరసన శిబిరం వద్దకు వచ్చి విద్యార్థుల గోడు విన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్, కె.డేవిడ్, టి.అఖిల్, సీహెచ్ సింహాచలం, సురేష్, సింహాద్రి, పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానం అమలు చేయాలి. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో యూనిర్సిటీ, మెడికల్ కళాశాలకు ఏర్పాటు చేయాలి. వసతి గృహాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.
– కీర్తన, విద్యార్థిని, డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని
హానర్స్ విధానం రద్దు చేయాలి
డిగ్రీ కళాశాలల్లో హానర్స్ విధానం రద్దు చేయాలి. విద్యా, వసతి దీవెన నిధులను విద్యార్థుల ఖాతాల్లోకి జమచేసి అర్ధిక భరోసా కల్పించాలి. అధికారం చేపట్టి ఐదునెలలవుతున్నా విద్యార్థుల చదువుకు ఆధారమైన విద్యా, వసతి దీవెన నిధులు విడుదల చేయకపోవడం విచారకరం. తక్షణమే దీనిపై ప్రభుత్వం స్పందించాలి.
– బి.దివ్యభారతి,
డిగ్రీ ఫస్టియర్ విద్యార్థిని
Comments
Please login to add a commentAdd a comment