రాజాంలో విజిలెన్స్ దాడులు
రాజాం సిటీ: పట్టణంలోని పలు హోటళ్లలో విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించి గృహావసరాలకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను హోటళ్లలో వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మెయిన్‌రోడ్డులోని రాజధాని హోటల్లో ఐదు సిలిండర్లు, బస్టాండ్ ఆవరణలోని నవదుర్గ టిఫిన్ సెంటర్లో నాలుగు సిలిండర్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదుచేసినట్లు విజిలెన్స్ ఎస్సై బి.రామారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడులు కొనసాగిస్తామని, అక్రమంగా గ్యాస్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోటళ్లు, టీదుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు తదితరాల్లో ఎక్కువగా గృహావసరాల సిలిండర్లు వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికై నా వ్యాపారులు కమర్షియల్ గ్యాస్ వినియోగించాలని సూచించారు. ఈ దాడుల్లో డీటీ ఎస్.చిరంజీవిరావు, పురుషోత్తం, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment