మండల వనరుల కేంద్రాలకు నిధులు
పార్వతీపురంటౌన్: జిల్లాలోని అన్ని ప్రభు త్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, మండల వనరుల కేంద్రాలకు, పాఠశాలల నిర్వహణకు నిధులు మంజూరు చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాఠశాలలు, మండల వనరుల కేంద్రం నిర్వహణ ఖర్చుల నిమిత్తం 2024–2025 విద్యా సంవత్సరానికి 1029పాఠశాలల వార్షిక నిధులు (స్కూల్ యాన్యువల్ గ్రాంట్) రూ. 1,08,22,500, 15మండలాల వనరుల కేంద్రా ల అభివృద్ధి నిమిత్తం ఒక్కో కేంద్రానికి రూ. 1,30,000 చొప్పున మొత్తం రూ.19,50,000 లు విడుదల చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖాధికారులు పై నిధుల ను పాఠశాల, మండల వనరుల కేంద్రం అభివృద్ధి నిమిత్తం సద్వినియోగం చేయాలని స్పష్టం చేశారు.
పక్కాగా రాములోరి
ఆభరణాల లెక్క..
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో స్వామివారి అభరణాలను బుధవారం తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా దేవదాయశాఖ జేవీఓ(జ్యూయలరీ వెరిఫికేషన్ అధికారి) పల్లం రాజు సమక్షంలో స్వామివారి బంగారు, వెండి వస్తువులను సరి చూశారు. ఆభరణాల బరువును సరిచూసి రికార్డుల్లో నమోదు చేశారు. దేవస్థానానికి దాతలు సమకూర్చిన బంగారు, వెండి ఆభరణాల వివరాలను సేకరించారు. కార్యక్రమంలో ఈఓ వై.శ్రీనివాసరావు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment