ఆలస్యం!
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024
●తొలి సంతకం..
అమలులో
లక్ష్మీనృసింహస్వామికి
జేసీ పూజలు
సీతానగరం: మండల కేంద్రంలోని సువర్ణము ఖి నదీ తీరంలో వెలసిన లక్ష్మీనృసింహస్వామివారిని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోభిక గురువారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికా రు. జేసీ ముందుగా ఆలయ ప్రదక్షణ చేశారు. అనంతరం స్వామివారికి పూజలుచేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కదలని గజరాజులు
కొమరాడ: మండల వాసులను గజరాజుల సమస్య వీడడం లేదు. విక్రంపురం నుంచి డంగభద్ర రహదారిపై ఏనుగులు గురువారం సంచరించాయి. ఆ రోడ్డు గుండా ప్రయాణానికి స్థానికులు హడలిపోయారు. ఏ క్షణంలో ఏ ముప్పు తలపెడుతాయోనని డంగభద్ర, కోన వలస, నందాపురం, తమ్మనదొరవలస, కురుంపేట తదితర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు ధ్వంసం చేయడంతో రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అటవీశాఖ సిబ్బంది పంట పొలాలు, గ్రామాల్లోకి ఏనుగులు చొర బడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బోధన సమయాన్ని పెంచొద్దు
పార్వతీపురంటౌన్: బోధనా సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్య దర్శి ఎస్.మురళీమోహనరావు కోరారు. ఈ మేరకు గురువారం డీఈఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 8 పీరియడ్లు బోధన కొనసాగుతోందన్నారు. గంట పెంచడం వల్ల ప్రయోజనం లేదన్నారు. ప్రస్తుతం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ కొనసాగుతున్నాయన్నారు. బోధనేతర కార్యక్రమాలు, యాప్‌ల నుంచి ఉపశమనం కల్గిస్తే బోధనా సమయం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఉపాధ్యాయ నియామక పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు మరింత కాలం వేచిచూడక తప్పదు. డీఎస్సీకి మరికొంత కాలం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రూ.వేలకు వేలు ఫీజులు చెల్లించి, సుదూర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లలో డీఎస్సీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను ఈ ఏడాది అక్టోబర్‌లో నిర్వహించగా.. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన 22,889 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇందులో ఒక్క మన్యం జిల్లా నుంచే 11,580 మంది హాజరయ్యారు. మొత్తం భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్యను ఉమ్మడి జిల్లాలో 446గా చూపుతున్నారు. వాస్తవానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 15 నుంచి 30వ తేద వరకు పరీక్షలు నిర్వహించి, ఏప్రిల్ 7న ఫలితాలు వెలువడించనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యారు. ఉద్యోగాల భర్తీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడింది. తర్వాత ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్‌ను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది.
తొలి సంతకం చేసినా...
ఎన్నికలకు ముందు.. తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ చేపడతామని నాడు ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం డీఎస్సీ ఫైల్‌పైనే చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు దాటినా ఇప్పటికీ నోటిఫికేషన్ ఊసు లేదు. ఇటీవల టెట్ నిర్వహించి, ఫలితాలు విడుదల చేసిన విషయం విదితమే. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈలోగా ఎస్సీ వర్గీకరణను ఈ నోటీఫికేషన్ నుంచే అమలు చేయాలన్న డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఇదే వంకతో నోటిఫికేషన్‌ను ప్రభుత్వం మరింత జాప్యం చేస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఉండాలన్నది తమ ఉద్దేశమని ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనసభలో ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిషన్‌ను వేసింది. దానిపై కమిషన్ అధ్యయనం చేయడం.. నివేదిక ఇవ్వడం.. తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. ఇలా చూసుకుంటే ఈ విద్యాసంవత్సరంలో పోస్టుల భర్తీ కల్లేనని నిరుద్యోగులు వాపోతున్నారు.
పాఠశాలను తక్షణమే మార్చాలి
● మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి
పార్వతీపురంటౌన్: పార్వతీపురం పట్టణంలో నిర్వ హిస్తున్న కురుపాం ఏకలవ్య పాఠశాలను తక్షణమే మార్పుచేయాలని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. ఏకలవ్య పాఠశాలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌కు కురుపాంలో గత ప్రభుత్వ హయాంలోనే పక్కా భవనాలు నిర్మించామన్నారు. మిగిలిన చిన్నచిన్న పనులు పూర్తిచేసి సొంత భవనంలోకి తరగతులు నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌కు వినతి పత్రం అందజేశామన్నారు. ఇరుకు గదుల్లో వసతి, విద్యాభ్యాసనకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
● నిబంధనలకు పాతర
న్యూస్‌రీల్
డీఎస్సీ అభ్యర్థులకు తప్పని నిరీక్షణ
ఉపాధ్యాయ నియామకాలు ఇప్పట్లో లేనట్లే!
శిక్షణకే రూ.వేలు పోస్తున్నారు..
డీఎస్సీ మీద ఆశతో జిల్లా నుంచి వేలాది మంది అభ్యర్థులు విజయనగరం, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు వెళ్లి కొన్ని నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారు. శిక్షణ, గదులు అద్దెకు తీసుకోవడం, భోజనం, ఇతర ఖర్చులకు కలిపి నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. నోటిఫికేషన్ ప్రక్రియ ఆలస్యమయ్యేకొద్దీ తమకు మరింత ఖర్చు పెరుగుతుందని అభ్యర్థులు వాపోతున్నారు. దీనికితోడు పరీక్షకు సిద్ధమవుతున్న వారిలో చాలామంది ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారూ ఉన్నారు. సెలవు పెట్టి, శిక్షణ పొందుతున్నామని.. ఇప్పుడు ఆ జీతమూ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment