ఉమా జూట్ మిల్‌ను డిసెంబర్ 4 లోగా తెరవాలి
కొత్తవలస: మండలంలోని సీతంపేట సమీపంలో గల ఉమా జూట్‌మిల్‌ను డిసెంబర్ 4వ తేదీ లోగా తెరవాలని లేదంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని కార్మిక సంఘం అధ్యక్షుడు గణేష్ పండా స్పష్టం చేశారు. ఈ మేరకు కర్మాగారం ఆవరణలో కార్మిక సంఘం సాధారణ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేయింబవళ్లు కార్మికులు 45 సంవత్సరాలుగా యాజమాన్యానికి సహకరిస్తూ 3 స్పిన్నింగ్ ఫ్రేమ్స్ నుంచి 22 స్పిన్నింగ్ ఫ్రేమ్స్‌కు, 100 మగ్గాలు పెట్టిన పురిమిల్లు నుంచి గోనె సంచులను ఉత్పత్తి చేసే మిల్లుగా అభివృద్ధి చేశామన్నారు.ఈ మిల్లులో వచ్చిన లాభాలతో ఇతర ప్రాంతాల్లో యాజమాన్యం పెద్ద ఎత్తున ఆస్తులను కూడపెట్టుకుంని ఆరోపించారు. మిల్లులో తయారైన ఉత్పత్తి అమ్ముడు పోలేదని, ముడిసరుకు ధర పెరిగిపోయిందన్న నెపంతో ఈ ఏడాది జూలై–15న కర్మాగారాన్ని యాజమాన్యం మూసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో నాలుగువందల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. జేసీఎల్, సీసీఎల్ ఆధ్వర్యంలో పలు దఫాలు చర్చలు నిర్వహించినప్పటికీ ఈ చర్చలకు యాజమాన్యం గైర్హాజరవుతూ వచ్చిందని, వచ్చేనెల 4లోగా కర్మాగారాన్ని తెరవని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.కార్యక్రమంలో యూనియన్ నాయుకులు కె.శ్రీను, కె.ఈశ్వరరావు, ఎస్.గోవింద, ఎస్.రాంబాబు, పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.
లేదంటే ప్రత్యక్ష ఉద్యమానికి సిద్ధం
కార్మిక సంఘం సాధారణ సమావేశంలో తీర్మానం
Comments
Please login to add a commentAdd a comment