సెల్‌టవర్ ఎక్కిన యువకుడు
● మైనర్‌తో పెళ్లికి అంగీకరించాలని డిమాండ్
● కౌన్సెలింగ్ ఇచ్చిన పోలీసులు
● బాలికను వేధిస్తున్నాడని తల్లిదండ్రుల ఫిర్యాదు
బొబ్బిలి: ప్రేమించిన అమ్మాయి తనను పట్టించుకోకుండా అమ్మగారింటికి వెళ్లిపోతోందని, తనను పిలిపించి ప్రేమ, పెళ్లికి అంగీకరిస్తేనే దిగుతానంటూ ఓ యువకుడు సెల్‌టవర్ ఎక్కి అందరినీ భయభ్రాంతులకు గురిచేశాడు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లిలో ఉంటున్న సింగనపల్లి అజయ్‌కుమార్ అనే ఇంటర్‌మీడియట్ విద్యార్థి పదో తరగతి నుంచి తనకు పరిచయమున్న ఓ బాలికను ప్రేమించాడు. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఆ బాలిక అమ్మమ్మగారింటి వద్ద ఉండి(అజయ్ ఉన్న ప్రాంతంలోనే)చదువుకుంటోంది. అయితే బాలిక అమ్మగారింటికి వెళ్లిపోతున్నట్లు తెలిసి అడ్డుకునే ప్రయత్నం చేసిన అజయ్‌పై తల్లిదండ్రులు పోలీసు రిపోర్టు ఇవ్వగా అజయ్‌ను పిలిచి పోలీసులు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి ఇటువంటి పనులొద్దని హెచ్చరించారు. దీంతో కోపం పెంచుకున్న అజయ్ గొల్ల పల్లిలోని ఓ సెల్‌టవర్ ఎక్కి బెదిరింపులకు దిగాడు. గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో జరగని సంఘటన కావడంతో స్థానిక ప్రజలు గుమిగూడారు. అజయ్ భవానీ మాలలో ఉండడంతో ప్రజలతో పాటు భవానీ మాలాధారులు కూడా అక్కడికి చేరుకున్నారు. సుమారు రెండు గంటల సేపు సెల్‌టవర్ ఉన్న ప్రాంతం వద్ద
ఉద్విగ్న భరిత వాతావరణం నెలకొంది. సెల్‌టవర్ చివరికంటా ఎక్కి అటూ ఇటూ తిరుగుతున్న యువకుడ్ని కిందనున్న వారు గెంతవద్దు..కిందికి దిగు అంటూ కేకలు వేస్తున్నా యువకుడు చలించలేదు. తాను ప్రేమించిన అమ్మాయి పేరుచెప్పి ఇక్కడికి తీసుకువచ్చి తన ప్రేమను అంగీకరిస్తున్నానని చెప్పాలని, అప్పుడే దిగుతానని చెప్పడంతో పోలీసులు అమ్మాయిని తీసుకుని వచ్చారు. బాలికతో ప్రేమ, పెళ్లికోసం ఒప్పుకోవాలని సెల్‌టవర్ పైనుంచే యువకుడు చెప్పడంతో కిందికి దిగితే మాట్లాడదామని చెప్పించారు.
పోక్సో కేసు నమోదు
అనంతరం యువకుడ్ని కిందికి దించారు. యువకుడిని అక్కడి నుంచి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనకు మైరార్టీ తీరలేదని, తీరిన వెంటనే పెళ్లి చేసుకుందామని బాలిక చెప్పిందని, ఇద్దరం ప్రేమించు కున్నామని అజయ్ పోలీసులకు చెప్పాడు. డీఎస్పీ పి. శ్రీనివాసరావు బాలిక ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామన్నారు. బాలిక, తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై ఎస్సై రమేష్ పోక్సో కేసు నమోదు చేశారు. దీంతో కథ సుఖాంతమైందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment