ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం..: కలెక్టర్
సీతానగరం: జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనులోలు చేస్తుందని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ హామీ ఇచ్చారు. రైతులకు సరైన గిట్టుబాటు ధర అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. మండలంలోని అంటిపేట గ్రామాన్ని జేసీ ఎస్‌ఎస్ శోభికతో కలిసి బుధవారం సందర్శించారు. అక్కడున్న రైతులను ధాన్యం కొను గోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. దళారు ల మాటలు విని రైతులు మోసపోవద్దని, అవసరమైన గన్నీ బ్యాగ్‌లు, రవాణా, హమాలీల సదుపా యం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. రైతులు ధాన్యం విక్రయించినట్టు రశీదు ఇస్తామని, 48 గంటల్లో రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు, బిల్లుల చెల్లింపు విషయమై రైతులు అధైర్యపడొద్దని సూచించారు. రైతులు ఇచ్చిన కొలతల మేరకే మిల్లర్లు సరుకు తీసుకోవాలని, అధికంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్ప వని హెచ్చరించారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపత్యంలో ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాల్లో ఉంచుకోవాలని కలెక్టర్ చెప్పా రు. వారి వెంట జిల్లా వ్యవసాయాధికారి రాబర్ట్ పాల్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు పి.శ్రీనివాసరావు, సీతానగరం తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, ఏఓ ఎస్.అవినాష్, వివిధ శాఖల అధికారులు, రామవ రం సర్పంచ్ పి.సత్యంనాయుడు, వ్యవసాయ సహాయకులు ఉన్నారు.
డిసెంబర్ 7న మెగా పేరెంట్స్ డే
పార్వతీపురం: డిసెంబర్ 7న నిర్వహించే మెగా పేరెంట్స్ డే సమావేశాన్ని విజయవంతం చేయాల ని అధికారులకు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. తన కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీఓలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేరేంట్స్ డే సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రుల తో పాటు ప్రజాప్రతినిధులు, మండల అధికారులు హాజరయ్యేలా ఆహ్వానాలు పంపించాలన్నారు. ఆహ్వాన పత్రికలను విద్యార్థులచే తయారు చేయించాలన్నారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, హాజరు శాతం తదితర అంశాలను చర్చించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలతో కార్డులను అందిచాలన్నారు. తల్లిదండ్రులకు పలు క్రీడలను నిర్వహించాలన్నారు. కార్యక్రమాలలో యాంకర్‌లుగా విద్యార్థులు వ్యవహరించాలన్నారు. మొత్తం కార్యక్రమాన్ని డాక్యుమెంట్ తయారు చేయాలని, ఉత్తమ పాఠశాలకు అవార్డు ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ ఎంవి.కరుణాకర్, సహాయ సంచాలకులు సీతారాం, ఐపీఓ ఖరీముల్లా, డీపీఓ టి.కొండలరావు, డీఆర్‌డీఏ పీడీ వై.సత్యంనాయు డు, మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసరావు, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్‌ఈ డి.పురుషోత్తంతో పాటు ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment