పైళ్లెన నెల రోజులకే అనంత లోకాలకు..
ఉక్కునగరం:
పెళ్లైన నెల రోజులకే ఓ యువకుడికి నిండు నూరేళ్లు నిండిపోయాయి. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన సంఘటన.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. మృతులిద్దరూ మేనమామ, మేనల్లుడు కావడం గమనార్హం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ దరి ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన డబ్బీరు పవన్‌కుమార్(31) పరవాడ ఫార్మాసిటీలో పని చేస్తూ కూర్మన్నపాలెం దరి శాతావాహన నగర్‌లో నివాసముంటున్నాడు. అతని మేనల్లుడు కొండవలస రూపేష్‌కుమార్(21) హైదరాబాద్‌లో సీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి బైక్‌పై స్టీల్‌ప్లాంట్ ప్రధాన మార్గంలో కణితి జంక్షన్ వైపు వెళ్తున్నారు. అదే సమయంలో కూర్మన్నపాలెం నుంచి కణితి జంక్షన్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు బైక్‌ను సుమారు 30 మీటర్లు ఈడ్చుకుపోయింది. ఇద్దరిపై ఆర్టీసీ బస్సు టైర్లు ఎక్కడంతో.. వీరు సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పవన్‌కుమార్ బంధువులు అక్కడకు చేరుకుని రోదించిన తీరు అందరినీ కలచివేసింది. పవన్‌కుమార్‌కు గత నెల 26న వివాహమైంది. మరికొన్ని రోజుల్లో భార్యను తీసుకువచ్చేందుకు చూస్తున్న ఈ సమయంలో ఇలా జరిగిందంటూ అతని అక్క కన్నీటి పర్యంతమైంది. రూపేష్‌కుమార్ ఇక్కడకు ఎందుకు వచ్చాడో తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న స్టీల్‌ప్లాంట్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు లొంగిపోయాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం వారి మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తీరని శోకం
పాలకొండ రూరల్: పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకు చెందిన విశ్రాంత విద్యుత్ శాఖ ఉద్యోగి డబ్బీరు ప్రసాదరావు, లక్ష్మి దంపతుల కుమారుడు పవన్‌కుమార్, మేనల్లుడు రూపేష్ బుధవారం విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతుడు పవన్‌కుమార్‌కు గత నెల 26నే వివాహం జరిగింది. ఈ వేడుకకు హైదరాబాద్ నుంచి రూపేష్ వచ్చినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. పెళ్లి సందడి పూర్తయిన నెల రోజుల్లో తీరని విషాదం చోటుచే సుకోవటంతో కుటంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నతనం నుంచి స్నేహంగా ఉండే పవన్‌కుమార్, రూపేష్‌లు మరణంలోనూ విడిపోలేదని రోదిస్తున్నారు. వార్త తెలియగానే ఈ ప్రాంత వాసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుల
దుర్మరణం
మృతులిద్దరూ మేనమామ, మేనల్లుడు
Comments
Please login to add a commentAdd a comment