రాజాం – పాలకొండ రైల్వే లైను అనుసంధానం చేయండి
గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2024
ప్రస్తుతం వరహాలగెడ్డ దుస్థితి
ప్రశాంతంగా జీసీటీఏ ఎన్నికలు
పాలకొండ రూరల్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పార్వతీపురం మన్యం జిల్లా కార్య ని ర్వాహక కార్యవర్గ(జీసీటీఏ) ఎన్నికలు బుధవా రం ప్రశాంతంగా జరిగాయి. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జోన్ 1 జీసీటీఏ అధ్యక్షుడు డాక్ట ర్ పైడితల్లి, పరిశీలకుడిగా శ్రీకాకుళం జిల్లా జనరల్ సెక్రటరీ డాక్టర్ ఢిల్లేశ్వరరావు వ్యవహరించారు. వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొని జీసీటీఏ నూతన అధ్యక్షుడిగా స్థానిక కళాశాలకు చెందిన జంతుశాస్త్ర ఉపన్యాసకుడు బి.రాజును, ప్రధాన కార్యదర్శిగా జి.శ్రీనివాసరావు (సాలూరు కళాశాల పొలిటికల్ సైన్స్ అధ్యాపకుడు), మహిళా కార్యదర్శిగా బి. మంజుల(సీతంపేట డిగ్రీ కళాశాల పొలిటికల్ సైన్స్ ఉపన్యాసకురాలు), కోశాధికారిగా తేజేశ్వరరావు(వీరఘట్టం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతికశాస్త్ర అధ్యాపకుడు)ను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గాన్ని ప్రిన్సిపాల్ ఎం.శ్యాంబా బు, ఇతర అధ్యాపకులు అభినందించారు.
ధాన్యం కొనుగోలుకు
పక్కాగా ఏర్పాట్లు
● సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి
పాలకొండ: ధాన్యం కొనుగోలుకు సంబంధించి పక్కాగా ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. మండలంలోని సింగన్నవలస గ్రామంలో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందికి పలు సూచనలు చేశారు. తేమశాతం పరిశీలన, నాణ్యత గుర్తింపు పరికరాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఏఓ వాహనికి సూచించారు. అనంతరం ఆయన రైస్ మిల్లర్లతో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అవగాహన కల్పించండి
వీరఘట్టం: ఽదాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని సబ్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి సూచించారు. మండలంలోని తూడి సచివాలయాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. ధాన్యం కొనుగోలుపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. గోనె సంచులు సిద్ధం చేయాలన్నారు. ధాన్యం విక్రయాలకు రైతులు సిద్ధంగా ఉన్నా.. మిల్లులు అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు చేయలేదని సిబ్బంది తెలిపారు. తగు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ చందక సత్యనారాయణను ఆదేశించా రు. ఏఓ జక్కువ సౌజన్య, ఆర్‌ఐ లక్ష్మునాయుడు ఉన్నారు.
సీతంపేట ఐటీడీఏకి ప్రథమ స్థానం
● ఉత్సాహంగా గిరిజన స్వాభిమాన ఉత్సవాలు
ఏయూక్యాంపస్: గిరిజన స్వాభిమాన ఉత్సవా లు ఘనంగా ముగిశాయి. జనజాతి గౌరవ్ దివ స్ వేడుకల్లో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ, టీజీఆర్–టీఎం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహకారంతో ఈ నెల 15 నుంచి 26 వరకు గ్రామ, పంచాయతీ, ఐటీడీఏ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో జనజాతి గౌరవ్ దివస్ నిర్వహించారు. గిరిజన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడం, సాంస్కృతిక వారసత్వాన్ని నేటి తరానికి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాలను జరిపారు. స్వాభిమాన ఉత్సవాల్లో భాగంగా గిరిజన సంత, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు చిత్రలేఖనం, వ్యాసరచ న, వక్తృత్వ పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. రుషికొండ వద్ద ఏర్పాటు చేసిన గిరిజన సంత, బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్‌లో గిరిజన ఉత్పత్తులు విక్రయాలు జరిపారు. కార్యక్రమాలలో ఎనిమి ది ఐటీడీఏలు, 17 జిల్లాల నుంచి వెయ్యి మందికి పైగా విద్యార్థులు, సాంస్కృతిక బృందాలు పాల్గొన్నాయి. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలు గా నిలిచిన వారికి పాడేరు ఐటీఏడీ ప్రాజెక్టు అధికారి అభిషేక్ బహుమతులను ప్రదానం చేశారు. పోటీల్లో ప్రథమ స్థానాన్ని సీతంపేట, రెండో స్థానం పాడేరు ఐటీడీఏలు కై వసం చేసుకున్నాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాణి మంద, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
చెరబట్టి..
రూపు మార్చి!
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం టౌన్:
పార్వతీపురం జిల్లా ప్రధాన కేంద్రం కావడంతో స్థలాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. కబ్జాదారులకు కాదేదీ అనర్హం అన్నట్లు.. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే, అక్కడ పాగా వేసేందుకు సిద్ధమవుతున్నారు. ‘పసుపుబిళ్ల’ ఉండటంతో అధికారులూ సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ప్రభుత్వ చెరువులను ఆక్రమించేందుకు పూనుకొంటున్నారు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు బహిరంగంగానే పట్టణంలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే పార్వతీపురంలో నెల్లిచెరువు, బిల్లబంద, దేవుడి బంద, లంకెల చెరువు, లక్ష్మునాయుడు చెరువు.. ఇలా దాదాపు చెరువులన్నీ కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న వరహాలగెడ్డ రూపురేఖలనే ఆక్రమణలతో మార్చేశారు. కొత్తవలసలోని తమ్మినాయుడు చెరువుపైనా ‘తమ్ముళ్ల’ కన్నుపడింది.
ఇక్కడ వరహాల గెడ్డ ఉండేది..
గతంలో ఇక్కడ వరహాలగెడ్డ ఉండేదని చెప్పుకునే పరిస్థితి పట్టణ నడిబొడ్డున ఏర్పడింది. వరహాలగెడ్డ పార్వతీపురం మండలంలోని చందలంగి గ్రా మ అడవుల్లో పుట్టి కొత్తవలస, బుట్టివలస, సివండ్రవలస, పెద్దమరికి, శ్రీరంగపురం, గదబవలస, కృష్ణపల్లి, జగన్నాథపురం, పార్వతీపురం, బెలగాం, అడ్డాపుశీల గ్రామాల మీదుగా సుమారు 23 కిలోమీటర్లు ప్రవహించి గరుగుబిల్లి మండలంలోని ఉల్లిభద్ర గ్రామం వద్ద నాగావళిలో కలుస్తుంది. సర్వే నెంబరు 410, 411లో గల వరహాలగెడ్డ పార్వతీపురం పట్టణానికి ప్రకృతి వరప్రసాదంగా స్థానికులు భావిస్తారు. పట్టణ మురుగును, వర్షపు నీటిని బయటకు తోడుకువెళ్లే సహజ వనరుగా పరిగణిస్తారు. అధికార పార్టీ కూటమి నేత అండతో కొంతమంది దర్జాగా కబ్జా చేస్తున్నారు. గెడ్డను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే పనిలో అధికారులు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరహాలు గెడ్డపై అడుగడుగునా వంతెనలు నిర్మించి.. వాటిపై ఉన్న స్థలాన్నీ అద్దెకు ఇచ్చుకునే దుస్థితి నెలకొంది. ఇది ప్రభుత్వ స్థలమని గతంలోనే అధికారులు బోర్డులు పెట్టినప్పటికీ ఫలితం లేకపోతోంది. అధికార పార్టీకి చెందిన కీలక నేత అండదండలతో మొత్తం గెడ్డ స్వరూపమే మారిపోతోంది. ఆక్రమణదారులకు అప్పగించేందుకు రూ.కోట్లు చేతులు మారుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తమ్మినాయుడు చెరువుపైనా కన్ను!
పార్వతీపురం పట్టణంలోని కొత్తవలస సర్వే నంబరు 137లోని 8.77 ఎకరాల విస్తీర్ణం కలిగిన తమ్మినాయుడు చెరువుపై కొంతమంది టీడీపీ నాయకు ల కన్ను పడింది. రికార్డుల్లో పక్కాగా ప్రభుత్వ చెరువు అని ఉన్నప్పటికీ.. అధికార పార్టీ ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు జిరాయితీగా చేసేందుకు రికార్డులు మార్పిడి చేస్తున్నారు. పోరంబోకును ఇనాం కింద మార్చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. అప్పట్లో స్థానికులు అడ్డుకున్నారు. కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో వారి ప్రయత్నానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో కబ్జాదారులు మిన్నుకున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మరలా కబ్జాకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికి అధికారులు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
● కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేసిన ఎంపీ అప్పలనాయుడు
సాక్షి, న్యూఢిల్లీ: రాజాం, పాలకొండ, సీతంపేట, కొత్తూరు, హడ్డుబంగి, పర్లాకిమిడి ప్రాంతాల మధ్య రైల్వే లైనును అనుసంధానం చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజయనగ రం ఎంపీ అప్పలనాయుడు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా బుధవారం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ ప్రాజెక్టుపై డీపీఆర్ తయారీకి వెంటనే అనుమతలు ఇవ్వాలని కోరారు. ఒడిశా రాష్ట్రంతో అనుసంధానించుకునే విధంగా రైల్వే మార్గం ఏర్పాటు చేయడం అనేది ప్రాంతీయ ఆర్థికాభివృద్థికి ఎంతో ముఖ్యమ ని కేంద్ర మంత్రికి తెలిపారు. అదే విధంగా మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, కెమెరామెన్‌లకు కోవిడ్ సమయం నుంచి రైల్వే పాసులను నిలిపివేశారని.. వీటిని వెంటనే పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజులతో కలిసి సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు.
న్యూస్‌రీల్
గెడ్డలు, చెరువులపై కబ్జాదారుల కన్ను
పార్వతీపురం పట్టణంలో యథేచ్ఛగా కబ్జాలు
చేతులు మారుతున్న రూ.కోట్లు
అధికార పార్టీ నేత అండతో రెచ్చిపోతున్న ‘తమ్ముళ్లు’
ఆక్రమణల లెక్కలు తేల్చాలి..
పార్వతీపురం పట్టణంలో చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. విలువైన గెడ్డ భూములను, చెరువులను ఆక్రమించిన వారిపై తగు చర్యలు చేపట్టాలి. పట్టణ నడిబొడ్డున ఉన్న వరహాలగెడ్డ, తమ్మినాయుడు చెరువు ఆక్రమణల కారణంగా రూపురేఖలే మారిపోతున్నాయి. పాత రికార్డుల ప్రకారం కొలతలు వేసి, ఆక్రమణలు తొలగించి.. ఆక్రమణదారులపైన, అందుకు సహకరించిన అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – వి.దాలినాయుడు, కోరాడ కాళీకుమార్, బలగ శంకరరావు
– ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి ప్రతినిధులు, పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment