టీకా కార్యక్రమం పరిశీలన
పార్వతీపురం టౌన్: చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్యారోగ్య శాఖ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్‌మోహన్‌రావు అన్నారు. పట్టణంలోని 16వ వార్డులో వైద్య సిబ్బంది నిర్వహించిన టీకా కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. టీకాలు వేయాల్సిన అర్హులైన పిల్లలు, గర్భిణుల వివరాలు రికార్డులో పరిశీలించి షెడ్యూల్ ప్రకారం ఎంతమందికి వేయాల్సి ఉంది.. సంబంధిత తేదీలు పరిశీలించి పిల్లల తల్లిదండ్రులకు ముందస్తుగా సమాచారం అందజేసారా.. అని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ క్యారియర్‌లో టీకా వయల్స్, వాటి వీవీఎం, అందుబాటులో ఎన్ని సిరంజీలు ఉంచారు.. తనిఖీ చేశారు. టీకాలకు వినియోగించిన సిరంజీల సూదులను వెంటనే హబ్ కట్టర్ సాయంతో కట్ చేయాలని ఆదేశించారు. టీకా కార్డులను తనిఖీ చేసి పిల్లలందరికీ సకాలంలో టీకాలు వేస్తున్నారా...అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలకు వారి వయసును బట్టి వేయాల్సిన వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో పూర్తి చేసేలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, వారి పరిధిలో టీకా నిర్వహించే ప్రదేశం ముందుగా తెలియజేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. టీకా కార్యక్రమ వివరాలు అదే రోజూ ఆర్‌సీహెచ్ పోర్టల్‌లో నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. తల్లిదండ్రులలో మాట్లాడి చలికాలంలో పిల్లల ఆరోగ్య పరంగా తీసుకోవలసిన జాగ్రత్తలు, సలహాలు సూచించారు. కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు పుష్ప, జయగౌడ్, ఏఎన్‌ఎం నారాయణమ్మ, ఆశ కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment