●బాల్య వివాహాల రహిత జిల్లానే లక్ష్యం
బాల్య వివాహాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే మన అందరి లక్ష్యం కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. బాల్య వివాహ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కలెక్టర్ కార్యాలయం వద్ద క్యాండల్ ర్యాలీని ప్రారంభించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, అప్ హోల్డ్ సంస్థ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2025 నాటికి బాల్య వివాహల రహిత జిల్లాగా రూపాంతరం చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. బాల్య వివాహాల నిరోధానికి తల్లిదండ్రులు కూడా సహకరించాలన్నారు. అనంతరం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. డీఈఓ నల్ల తిరుపతినాయుడు, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ప్రభాకరరావు, డీఆర్డీఏ పీడీ వై.సత్యంనాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
– పార్వతీపురం
Comments
Please login to add a commentAdd a comment