కమిషనింగ్‌ పూర్తిచేయండి | Sakshi
Sakshi News home page

కమిషనింగ్‌ పూర్తిచేయండి

Published Tue, May 7 2024 1:20 AM

కమిషన

జ్యోతినగర్‌(రామగుండం): ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియ పూర్తిచేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ సూ చించారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో ఏర్పా టు చేసిన ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను అదనపు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి సోమవా రం ఆయన తనిఖీ చేశారు. అదనపు బ్యాలెట్‌ యూనిట్ల ర్యాండమైజేషన్‌ పూర్తిచేసి, ఈవీఎంల కమిషనింగ్‌ ప్రారంభించామని తెలిపారు. తహస్దీల్దార్‌ కుమారస్వామి పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

పాలకుర్తి(రామగుండం): కన్నాల జెడ్పీ హై స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రాలను జెడ్పీ సీఈవో నరేందర్‌ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. త్వరితగతిన పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. పాలకుర్తి, ఈసాలతక్కళ్ళళ్లల్లి, బసంత్‌నగర్‌ డీఆర్డీవో రవీందర్‌ ఠాథోడ్‌ పర్యటించి పోలింగ్‌ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పరిశీలించారు. ఎంపీడీవో శశికళ, ఏపీఎం సదానందం, సీసీ రాంబాబు, హెచ్‌ఎం కమలాకర్‌రావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

‘మీరూ ఓటు వేయండి’

పెద్దపల్లిరూరల్‌: ప్రజాస్వామ్యంలో ఓటుహ క్కు విలువైనదని, ప్రతీఓటరు దానిని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అ న్నారు. ఎన్నికల విధులు నిర్వర్తించాల్సి ఉన్నందున సబ్‌ డివిజనల్‌ పోలీసు అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ పద్ధతిన సోమవారం వారు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

విద్యుత్‌ ఉత్పత్తి పునరుద్ధరణ

రామగుండం: పట్టణంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని ఆదివారం రాత్రి ఉత్పత్తి దశలోకి తీసుకొచ్చా రు. గతనెల 29న మిల్స్‌లో తలెత్తిన సాంకేతిక లోపంతో యూనిట్‌ను షట్‌డౌన్‌ చేశారు. దీంతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదు రో జులుగా ఇంజినీర్లు, ఉద్యోగుల నిరంతరం శ్ర మిచి యూనిట్‌ను విద్యుత్‌ ఉత్పత్తిని పునరుద్ధరించారు. గత మూడు నెలలుగా తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం, పునరుద్ధరించడం తదితర పనులతో రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా, శాశ్వత పరిష్కారం లభించడంలేదు.

నీటి సమస్య పరిష్కరించాలి

మంథని: గ్రామాల్లో తాగునీటి సమస్య తలె త్తకుండా చర్యలు తేసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తెలిపారు. గుంజపడుగు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సో మవారం ఆమె తనిఖీ చేశారు. తాగునీటి సరఫరా తీరు పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం పోలింగ్‌ కేంద్రాలు సందర్శించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. పంచాయతీ కార్య దర్శి రత్నాకర్‌ తదితరులు ఉన్నారు.

ప్రశాంతంగా ఈసెట్‌

రామగిరి(మంథని): సెంటినరీకాలనీ జేఎన్టీయూలో సోమవారం ఈసెట్‌ ప్రశాంతంగా ముగిసింది. 150 మంది విద్యార్థులకు ఇద్దరు గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్‌ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ప్రతీ విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రంలోకి అనుమతించామని అన్నారు. ఎస్సై సందీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

కమిషనింగ్‌ పూర్తిచేయండి
1/6

కమిషనింగ్‌ పూర్తిచేయండి

కమిషనింగ్‌ పూర్తిచేయండి
2/6

కమిషనింగ్‌ పూర్తిచేయండి

కమిషనింగ్‌ పూర్తిచేయండి
3/6

కమిషనింగ్‌ పూర్తిచేయండి

కమిషనింగ్‌ పూర్తిచేయండి
4/6

కమిషనింగ్‌ పూర్తిచేయండి

కమిషనింగ్‌ పూర్తిచేయండి
5/6

కమిషనింగ్‌ పూర్తిచేయండి

కమిషనింగ్‌ పూర్తిచేయండి
6/6

కమిషనింగ్‌ పూర్తిచేయండి

Advertisement
 
Advertisement