రూ.14.05లక్షలు పట్టివేత | Sakshi
Sakshi News home page

రూ.14.05లక్షలు పట్టివేత

Published Fri, May 10 2024 3:35 PM

-

జగిత్యాలక్రైం/సారంగాపూర్‌: జగిత్యాలలోని తహసీల్‌ చౌరస్తా వద్ద పట్టణ ఎస్సై మన్మథరావు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రాయికల్‌ మండలం అల్లీపూర్‌ గ్రామానికి చెందిన మందుల లచ్చన్న నుంచి రూ.6లక్షలు పట్టుకున్నారు. కొత్తస్టాండ్‌ చౌరస్తా వద్ద కథలాపూర్‌ మండలం గంభీరావుపేటకు చెందిన ఒగ్గు ప్రకాశ్‌ నుంచి రూ.7.50 లక్షలు సీజ్‌ చేశారు. కొత్తబస్టాండ్‌ వద్ద మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్‌ ఇమ్రాన్‌ రూ.45 వేల విలువైన కూలర్లు తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. అలాగే సారంగాపూర్‌లో మహారాష్ట్రకు చెందిన వామన్‌లాల్‌ సింగ్‌ చౌహన్‌ అనే మామిడి వ్యాపారి నుంచి రూ.55వేలు పట్టుకున్నారు. పోతారం గ్రామంలో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న రమేశ్‌ నుంచి రూ.5 వేల విలువైన మద్యం బాటిళ్లను స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement