
AP Elections Political Latest Updates Telugu
9:45 PM, Mar 11th, 2024
కృష్ణా జిల్లా:
చంద్రబాబు ఓటమి భయంతో ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకున్నాడు: మంత్రి జోగి రమేష్
- టీడీపీ, జనసేన, బీజేపీ గుంపులుగా వస్తున్నాయి.
- జగన్ సింహాలా సింగల్ గా పోటీచేస్తారు
- చంద్రబాబు, పవన్ తోడు దొంగలు
- కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తా అని దొంగ హామీలు ఇస్తారు
- చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మరు
- జూ. ఎన్టీఆర్‌ని చంద్రబాబు వాడుకుని వదిలేశాడు
9:20 PM, Mar 11th, 2024
విజయవాడ:
టీడీపీ, బీజేపీ, జనసేనల మధ్య కుదరని ఏకాభిప్రాయం
- ఎనిమిది ఎంపీ సీట్లతో పాటు పది అసెంబ్లీ సీట్లకి పట్టుబట్టిన బీజేపీ
- సుధీర్ఘంగా చర్చించినా కొలిక్కి రాని సీట్ల పంచాయితీ
- విశాఖ, అనకాపల్లి, అరకు, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ లేదా గుంటూరు, హిందూపూర్, రాజంపేట లేదా తిరుపతి లోక్ సభ స్ధానాల కోసం బీజేపీ పట్టు
- శ్రీకాకుళం లేదా ఎచ్చెర్ల,విశాఖ నార్త్, విశాఖ సౌత్ లేదా వెస్ట్ లేదంటే మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలు కావాలంటూ బీజేపీ ప్రతిపాదనలు
- పి.గన్నవరం, రాజమండ్రి లేదా ముమ్మిడివరం, ఉండి లేదా నరసాపురం, కైకలూరు, కదిరి, గుంతకల్లు లేదా మదనపల్లె, శ్రీకాళహస్తి అసెంబ్లీ కావాలంటున్న బీజేపీ
- తాము అడిగిన సీట్లని కేటాయించాలన్న బీజేపీ కేంద్ర మంత్రి షెకావత్
- బీజేపీ ప్రతిపాదనలపై ఖంగుతిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
- మూడు ఎంపీ సీట్లకి, 24 అసెంబ్లీ సీట్లకి తగ్గలేనని తేల్చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
- బీజేపీ నేతలతో ఉమ్మడి సమావేశం ముగిసాక మరోసారి పవన్ తో చర్చించిన చంద్రబాబు
- అసెంబ్లీ సీట్లు 24 నుంచి 22కి....మూడు ఎంపీ స్ధానాలనుంచి రెండుకి తగ్గించుకోవాలని పవన్ ని కోరిన చంద్రబాబు
- సీట్లు తగ్గించుకోలేనని...క్యాడర్‌కి సమాధానం చెప్పుకోలేకపోతున్నానని పవన్ స్పష్టం చేసినట్లు ప్రచారం
- రేపు కూడా మరోసారి చర్చలు జరిగే అవకాశం
8:30 PM, Mar 11th, 2024
కొలిక్కిరాని సీట్ల పంచాయితీ
- ఎడతెగని చర్చలు..
- 12 గంటలకు మొదలైన చర్చలు..
- 12 గంటలకు చంద్రబాబు నివాసానికి వచ్చిన గజేంద్ర సింగ్ షెకావత్, పాండా.
- ఒంటిగంటన్నరకు చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్.
- దాదాపు 8గంటలు చర్చలు జరిపిన మూడు పార్టీల నేతలు.
- చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం.
- బీజేపీ ప్రతిపాదనలతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి.
7:40 PM, Mar 11th, 2024
కృష్ణాజిల్లా
- బంటుమిల్లి మండలం రామవరపుమోడీలో టీడీపీకి ఎదురుదెబ్బ .
- పెడన వైసీపీ ఇంఛార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు.
- టీడీపీ నేత గూడవల్లి నాంచారయ్యతో పాటు కార్యకర్తలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప్పాల రాము.
7:20 PM, Mar 11th, 2024
చంద్రబాబు పచ్చి మోసగాడు, నమ్మొద్దు: ఎంపీ కేశినేని నాని
- చేయూత ఈ రోజు మీకు పెద్ద పండగ.
- మీలో పథకాలు ఎవరికి వస్తున్నాయి అంటే ప్రజలు ఒక్కసారిగా చెయ్యి ఎత్తడంతో నాకు చాలా ఆనందంగా ఉంది.
- జగన్ మోహన్ రెడ్డిని ఓడించడానికి అందరిని పోగేసుకుంటున్నాడు బాబు.
- చంద్రబాబు పచ్చి మోసగాడు, మీరు నమ్మొద్దు.
- సీఎం జగన్ నమ్మకస్తుడు. ఇచ్చిన మాట తప్పడు.
- జగన్‌ను సీఎంగా మనం అందరం గెలిపించుకోవాలి.
- మనందరం బాగుండాలి అంటే పిల్లలు బాగా చదువుకోవాలి అంటే వెనకబడిన కులాలు బాగుండాలి అంటే జగన్ సీఎం కావాలి.
6:50 PM, Mar 11th, 2024
తణుకు:
సీఎం జగన్ గొప్ప నిజాయితీ పాలన అందించారు: మంత్రి కారుమూరి
- రూ. 3300 కోట్లు తణుకు అభి వృద్ధి కి కేటాయించారు
- నా మీద ప్రతి పక్షాలు బురద చల్లినా... నాకు మంత్రి పదవి ఇచ్చిన దేవుడు జగన్‌మోహన్‌రెడ్డి
- కార్య కర్తల కోసం అహర్నిశలు కష్టపడతాను
- మూడు కండవాలు కప్పుకుని వస్తున్న వారిపై యుద్దానికి సిద్దంగా ఉన్నాం
5:50 PM, Mar 11th, 2024
కృష్ణాజిల్లా:
చంద్రబాబు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు: కొడాలి నాని
- జనసేన , బీజేపీని కలుపుకుని ఎన్నికలకు వస్తున్నాడు
- రాజకీయంగా, ఆర్ధికంగా తను బాగుపడాలన్నదే చంద్రబాబు ఆలోచన
- ముస్లింలు, క్రైస్తవులకు బీజేపీ అన్యాయం చేసిందంటాడు
- మళ్లీ అదే బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాడు
- మోదీని వ్యక్తిగతంగా తిట్టాడు... ఇప్పుడు మోదీ గొప్పోడంటున్నాడు
- మోదీని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకోవాలని చంద్రబాబు చూస్తున్నాడు
- అధికారంలోకి రావడానికి చంద్రబాబు ఎవరి కాళ్లైనా నాకుతాడు
- మంచి జరిగితేనే ఓటేయమని దమ్ముగా అడుగుతున్న ఏకైక నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి
- పవన్ , చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసినా వైఎస్సార్‌సీపీని ఓడించలేరు
- జగన్‌మోహన్‌రెడ్డిని రెండవ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదు
- టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలి
- తుప్పు పట్టిన సైకిల్‌ను రాబోయే ఎన్నికల్లో తుక్కుతుక్కుగా ఓడించి .... బుడమేరులో పడేయాలి
5:47 PM, Mar 11th, 2024
చంద్రబాబుపై సీఐడీ చార్జ్‌షీట్
- అసైన్డ్ భూముల కుంభకోణంలో ఛార్జ్ షీట్
- రూ. 4, 400 కోట్ల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు సీఐడీ నిర్ధారణ
- అసైన్డ్ భూముల స్కాంలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు
- చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ ముద్దాయిగా చార్ఝ్ షీట్
- 1100 ఎకరాల అసైన్డ్ భూముల కుంభకోణం జరిగినట్టు పేర్కొన్న సీఐడీ
- అమరావతి రాజధానిలో భారీ భూదోపిడీ
- క్యాపిటల్ సిటీ ప్లాన్ తో చంద్రబాబు అండ్ కో భూ దోపిడీ
- చంద్రబాబు, ఆయన బినామీలు అసైన్డ్ భూములు కాజేసినట్టు సీఐడీ నిర్ధారణ
- రికార్డులను ట్యాంపరింగ్ చేసి అసైన్డ్ భూముల స్కాం చేసినట్టు సీఐడీ నిర్ధారణ
- చంద్రబాబు, నారాయణతో పాటుమాజీ తహసీల్దార్ సుధీర్ బాబు, రామక్రిష్ణ హౌసింగ్ లిమిటెడ్ ఎండీ అంజనీ కుమార్ ముద్దాయిలుగా ఛార్జ్ షీట్ దాఖలు
4:55 PM, Mar 11th, 2024
ఎన్టీఆర్ జిల్లా:
తిరువూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన వలస పక్షి కొలికపూడి:
వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్ నల్లగట్ల స్వామిదాస్
- విజయవాడ నడిబొడ్డులో జరిగిన వంగవీటి మోహన రంగా హత్యను వైఎస్సార్‌కు ఆపాదించే దుష్టప్రయత్నం చేయడం దారుణం
- తిరువూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చిన వలస పక్షి కొలికపూడి శ్రీనివాస్
- కొలికపూడి చెప్పేవన్నీ అబద్ధాలే అని ప్రజలు గమనించారు
- మహానేత వైఎస్సార్ పై నిందలు వేసే ప్రయత్నం మానుకోవాలి
- కాపుల ఓట్లుకోసం ఒక దుష్ట తలంపుతో చేస్తున్నాడు
- ఆనాడు ప్రభుత్వం ఎవరిది, ఆ రోజు పత్రికలు చూశావా, ఘర్షణలు చూశావా కొలికపూడి
- కనీస విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడటం,అబద్దాలు,మాయల పకీరుల కల్లబొల్లి మాటలు చెబితే నమ్మే ప్రజలు లేరు
- కొలికపూడి శ్రీనివాస్‌కు నియోజకవర్గ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
4:49 PM, Mar 11th, 2024
విజయవాడ
మొదటికొచ్చిన బీజేపీ, టీడీపీ, జనసేన సీట్ల పంచాయతీ
- సీట్ల సంఖ్యపై బీజేపీ పట్టు
- ఢిల్లీలో కేవలం ఎన్డీయేపై చేరికపైనే చర్చలు
- సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుపుతున్న షెకావత్
- షెకావత్ ప్రతిపాదనలతో ఖంగుతిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్
- ఎనిమిది ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు కావాలని బీజేపీ ప్రతిపాదన
- ఆరు ఎంపీ, ఆరు ఎమ్మెల్యేలంటూ ఇన్నాళ్లూ టీడీపీ లీకులు
- ఎల్లో మీడియాలోను అదే ప్రచారం
- 8 ఎంపీ, 8 ఎమ్మెల్యే ఇవ్వాల్సిందేనని బీజేపీ స్పష్టత
- అంగీకరించాల్సిందేనని చంద్రబాబుకి బీజేపీ అల్టిమేటం
4:02 PM, Mar 11th, 2024
విశాఖ:
నాలుగు ప్రాంతాల్లో నాలుగు సిద్దం బహిరంగ సభలను ఏర్పాటు చేశాం: మంత్రి బొత్స
- సభలకు విశేషమైన స్పందన వచ్చింది
- నేను మేలు చేస్తేనే ఓటు వేయని సీఎం జగన్ చెపుతున్నారు
- లక్షలాది మంది వచ్చి సీఎం జగన్ కు ఆశీర్వాదం తెలిపారు
- పొత్తుల కోసం చంద్రబాబు పవన్ కళ్యాణ్ వెంపర్లాడుతున్నారు
- 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు పోత్తల కోసం అందరి గుమ్మం ఎక్కుతున్నారు
- చంద్రబాబు అంటే కట్టప్ప, చంద్రబాబు అంటే వెన్నుపోటు దారుడు.. అంటూ చంద్రబాబు గురించి బీజేపీ నేతలు మాట్లాడిన వీడియో ప్రదర్శించిన బొత్స
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి చంద్రబాబు ఏం చెపుతారు
- సీఎం జగన్ మాటలను కొన్ని మీడియా సంస్థలు వక్రికరించారు
- 175 స్థాలనాలకు 175 స్థానాలను వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది
3:59 PM, Mar 11th, 2024
విజయవాడ
సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న మూడు పార్టీల చర్చలు
- రెండున్నర గంటలు దాటినా చర్చలలో కుదరని ఏకాభిప్రాయం
- విశాఖ సిటీలో రెండు అసెంబ్లీ స్ధానాలు కావాలంటున్న బీజేపీ
- విశాఖ నార్త్, విశాఖ సౌత్ లేదా విశాఖ వెస్ట్ లేదంటే వి.మాడిగుల అసెంబ్లీ కోసం బీజేపీ పట్టు
- తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం సీటుని కోరుతున్న బీజేపీ
- మదనపల్లె, శ్రీకాళహస్తి, కదిరి స్థానాల కోసం బీజేపీ పట్టు
- పలు అసెంబ్లీ స్థానాలపై వీడని సందిగ్ధత
3:27 PM, Mar 11th, 2024
విశాఖపట్నం
బీజేపీలో టికెట్ వార్
- పురంధేశ్వరి వ్యూహాలకు ఎంపీ జీవిఎల్ ప్రతి వ్యూహం
- విశాఖ లోక్ సభ స్థానంపై కన్నేసిన జీవీఎల్
- విశాఖ లోక్‌సభ సీటు జీవీఎల్ నరసింహ రావుకు ఇవ్వాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పలు సంఘాల లేఖలు
- వైజాగ్ బ్రాహ్మణుల సంక్షేమ సంఘం, మాజీ నావియన్ సెయిలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రాజస్థానీ విప్ర సంక్షేమ సంఘం , విశాఖ జిల్లా బీజేపీ ఓబిసీ మోర్చా, కృష్ణ దేవరాయ సంక్షేమ సేవా సంఘం, వాల్టెయిర్ కలిబరి, స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ , భారతీయ సాంస్కృతిక సంఘ్ , మిథిలా సాంస్కృతిక పరిషత్, అఖిల భారతీయ పూర్వ సైనిక్ సేవా పరిషత్ లు నడ్డా కు లేఖలు
3:25 PM, Mar 11th, 2024
అనంతపురం:
చంద్రబాబు మాకొద్దు అంటున్న ప్రజలు
- టీడీపీ నేతలు బలవంతంగా వేసి వెళ్లిన పోస్టర్లను తొలగించిన వృద్ధులు
- కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం కురాకులపల్లిలో ఘటన
3:20 PM, Mar 11th, 2024
సత్తెనపల్లి:
చంద్రబాబు ఓ మ్యానిపులేటర్: మంత్రి అంబటి రాంబాబు
- సిద్ధం సభ చూసి ఓర్వలేకపోతున్నారు
- లక్షలాది మంది జనం చూసి తట్టుకోలేకపోతున్నారు
- అందుకే గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ వేసుకోవాల్సిన అవసరం మాకేంటి?
- చంద్రబాబే తన సభలకు గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్ వేసుకోవాలి
2:57 PM, Mar 11th, 2024
విజయవాడ
సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న అయోమయం
- ఎనిమిది ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ సీట్లకోసం పట్టపడుతున్న బీజేపీ
- చంద్రబాబు నివాసంలో ఏపీ బీజేపీ పురందేశ్వరికి అందని ఆహ్వానం
- ఏయే సీట్లు బీజేపీకి ఇవ్వాలనే దానిపై జరుగుతున్న కీలక చర్చలు
- ఈ కీలక సమావేశానికి పురందేశ్వరిని దూరం పెట్టిన చంద్రబాబు
- గంట నుంచి కొనసాగుతున్న చర్చలు....చర్చలలో బీజేపీ కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్,జాతీయ ఉపాద్యక్షుడు బైజయంత్ పాండా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్
- సీట్ల సర్దుబాటుపై కొనసాగుతున్న అయోమయం
- సీట్ల కోసం విజయవాడలోనే మకాం వేసిన సిఎంరమేష్, రఘురామకృష్ణంరాజు, సత్యకుమార్
- అనకాపల్లి పరిశీలనలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేరు
- రాజమండ్రి లొక్ సభ స్ధానాన్ని సోము వీర్రాజుకి అడుగుతున్న బీజేపీ అగ్రనేతలు
- హిందూపూర్ రేసులో విష్ణువర్దన్ రెడ్డి పేరు
- సాయంత్రానికి జాబితాని బీజేపీ పార్లమెంటరీ కమిటీకి పంపనున్న షెకావత్
2:45 PM, Mar 11th, 2024
పురందేశ్వరి లేకుండానే చర్చలు
విజయవాడ:
- చంద్రబాబు నివాసంలో మూడు పార్టీ నేతల భేటీ
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి లేకుండానే జరుగుతున్న చర్చలు
- ఈ కీలక సమావేశానికి పురందేశ్వరిని దూరం పెట్టిన చంద్రబాబు
- బీజేపీ పోటి చేసే పార్లమెంట్ స్థానాల్లో అని కులాలు ఉండేలా కార్యాచరణ
- మైనార్టీలు పోటీ నియోజకవర్గాల్లో బీజేపీ కి అవకాశం ఇవ్వాలని ప్రతిపాదనలు
- బీజేపీ కీలక నేతలు ఎంపీ జీవిఎల్, సోము వీర్రాజు, విష్ణు వర్దన్ రెడ్డిలు పోటీ చేస్తారని క్లారిటి ఇచ్చిన బీజేపీ
- సోము వీర్రాజు ఎమ్మెల్యేగా పోటీ కాకుండా గతంలో మాదిరి ఎమ్మెల్సీ ఇస్తామన్న టీడీపీ. నో చెప్పిన బీజేపీ
- గుంటూరు తూర్పు, విజయవాడ వెస్ట్, కడప, శ్రీకాళహస్తి కావాలంటున్న బీజేపీ
- విజయవాడ వెస్ట్ పై పట్టుబడుతున్న జనసేన
2:10 PM, Mar 11th, 2024
వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే
- గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం జగనన్న నెరవేచ్చారు
- సీనియర్ ఎన్టీఆర్, జూ.ఎన్టీఆర్కి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు.
- టీడీపీ, జనసేన, బీజేపీ గుంపుగా వస్తున్నాయి
- ఢిల్లీ వెళ్లి చంద్రబాబు, పవన్ మోదీ కాళ్లు పట్టుకున్నారు
- చంద్రబాబుకి విలువలు, విశ్వసనీయత లేవు
- చంద్రబాబు పచ్చి మోసగాడు.
- రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేశారు.
- 2014లో మోసం చేసినట్టే మళ్లీ మోసం చేస్తారు.
- మంచి చేశాడు కాబట్టి ప్రజల గుండెల్లో జగన్ నిలిచారు.
- జగన్ సింగల్ గా వస్తారు.
- వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడే
మంత్రి జోగిరమేష్ వ్యాఖ్యలు
1:52 PM, Mar 11th, 2024
ఎవరు.. ఎక్కడ?
- చంద్రబాబు ఉండవల్లి నివాసంలో కూటమి నేతల మీటింగ్
- సీట్ల సర్దుబాటుపై ప్రధాన నేతల మధ్య చర్చలు
- ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నదానిపైనే అయోమయం
- సోము వీర్రాజు సంగతేంటన్న దానిపైనే ప్రధాన చర్చ
- మీటింగ్‌లో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శ్రీ బైజయంత్ పాండాల
విశాఖపట్నం
1:52 PM, Mar 11th, 2024
ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు
- ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు
- ఈనెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్న పీఎం మోదీ
- ఎన్నికల ప్రచారంలో భాగంగా.. శనివారం విశాఖలోని రైల్వే మైదానంలో నిర్వహించబోయే సభలో పాల్గొననున్న ప్రధాని
- ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్ వెలువడాల్సి ఉంది
1:15 PM, Mar 11th, 2024
కూటమి చర్చలకు పురంధేశ్వరికి నో ఇన్విటేషన్
- చంద్రబాబు నివాసంలో బీజేపీ, జనసేన కూటమితో చర్చలు
- సీట్ల సర్దుబాటులో ఇప్పటికీ కొనసాగుతున్న అయోమయం
- చంద్రబాబు నివాసానికి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా.
- మరికాసేపట్లో చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్
- ఎనిమిది పార్లమెంట్, ఎనిమిది ఎమ్మెల్యే సీట్లకి పట్టపడుతున్న బీజేపీ
- చంద్రబాబు నివాసంలో చర్చలకి పురందేశ్వరికి అందని ఆహ్వానం
- ఏయే సీట్లు బీజేపీకి ఇవ్వాలనే దానిపై జరగనున్న కీలక చర్చలు
- ఈ కీలక సమావేశానికి పురందేశ్వరిని దూరం పెట్టిన చంద్రబాబు
12:25 PM, Mar 11th, 2024
చంద్రబాబు నివాసానికి బీజేపీ, జనసేన నేతలు
- కూటమిలో పొత్తులపై చర్చించేందుకు చంద్రబాబుకు ఇంటికి చేరుకున్న నేతలు
- చంద్రబాబు నివాసానికి చేరుకున్న కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ , బీజేపీ కేంద్ర ఉపాధ్యక్షుడు జయంత్ పాండా.
- షెకావత్‌తో పాటు వచ్చిన జనసేన నాదెండ్ల మనోహర్.
- కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న పవన్ కళ్యాణ్.
12:10 PM, Mar 11th, 2024
ఆరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన
- నిడదవోలు అసెంబ్లీ జనసేన అభ్యర్థిగా దుర్గేష్
- ఆరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన పవన్
- పంతం నెగ్గించుకున్న బుచ్చయ్య చౌదరి
- బుచ్చయ్య చౌదరి కోసం కందుల దుర్గేష్‌కు హ్యాండ్ ఇచ్చిన పవన్
- రాజమండ్రి రూరల్ సీటు ఆశించిన కందుల దుర్గేష్
- జనసేన నేతలు ఆందోళనను పట్టించుకోని పవన్ కళ్యాణ్
- చంద్రబాబు ఆదేశం మేరకు దుర్గేష్‌ని నిడదవోలు పంపాలని పవన్ నిర్ణయం
11:55 AM, Mar 11th, 2024
చంద్రబాబు ఇంటికి చేరుకున్న టీడీపీ నేతలు..
- ఉండవల్లి నివాసానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.
- ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్న అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యేలు.
- కాసేపట్లో చంద్రబాబు నివాసానికి రానున్న బీజేపీ ముఖ్య నేతలు, పవన్ కళ్యాణ్.
- సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు.
11:20 AM, Mar 11th, 2024
చంద్రబాబు, పవన్‌కు మంత్రి కాకాని కౌంటర్
- మేదరమెట్ల సిద్ధం సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు.
- లక్షలాది మంది జనం వచ్చారు.
- ప్రజల్లో ఎంత స్పందన ఉందో తెలుస్తోంది.
- ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందాయి.
- అందుకే అంతమంది సభకు వచ్చారు.
- సభ సక్సెస్ అవ్వడంతో చంద్రబాబుకి కడుపుమంట పెరిగింది.
- వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు గ్రాఫిక్స్?
- దీనికి పచ్చబ్యాచ్ సమాధానం చెప్పాలి.
- గ్రాఫిక్స్‌కి పేటెంట్ హక్కుదారుడు చంద్రబాబు
- అమరావతి రాజధాని అని బాహుబలి గ్రాఫిక్స్‌లో చూపించావు.
- గ్రీన్ మ్యాట్ వేస్తే.. దాని గురించి బురద చల్లాలని దుర్మార్గ ప్రయత్నం చేశారు.
- చంద్రబాబు అబద్ధాల కోరు.. సిద్ధం సభల ద్వారా జగన్ ప్రజల్లోకి వెళ్తుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు.
- రా కదలిరా సభ చేస్తున్నారు.. ఈ సభల్లో ఎక్కడన్నా జనాలు ఉన్నారా?
- ఎన్నికల ముందు చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పొత్తు కోసం తిరుగుతున్నాడు.
- జనం లేని పార్టీకి పవన్ కళ్యాణ్ సేనాని.
- 2014లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి.
- ఢిల్లీలో మోదీ గురించి ఏదేదో మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఆయనతో పొత్తుకోసం తిరుగుతున్నాడు
- లోకేష్ మా అమ్మని తిట్టాడు అని సిగమెత్తినట్లు పవన్ మాట్లాడి.. ఇప్పుడు సిగ్గు లేకుండా వారిద్దరూ కలిసి పోటీ చేస్తున్నారు.
- పవన్, లోకేష్ కాలర్ పట్టుకుంటాడేమో అనుకున్నా.. కానీ పవన్.. చంద్రబాబు, లోకేష్ కాళ్ళు పట్టుకున్నాడు
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జెండాలు మార్చుకున్నారు.. జనాలేమో వైసీపీలోకి వచేస్తున్నారు.
10:30 AM, Mar 11th, 2024
టీడీపీకి ఎంపీ కేశినేని నాని కౌంటర్
- మైలవరంలో సర్నాల తిరుపతిరావును మీరు గెలిపించుకోవాలి
- మీకు ఏ చిన్నపాటి ఇబ్బంది వచ్చినా హెల్త్ సెంటర్ మీకు దగ్గరలోనే ఉన్నాయి.. అదే జగన్న అంటే
- కుల మత బేధాలు లేకుండా మీకు డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు
- జగనన్న మాటిచ్చి నిలబెట్టుకున్నాడు.
- చంద్రబాబు మాట ఇచ్చి మోసం చేశాడు
- జగనన్న ఈ కాలనీలో ఇప్పటివరకు 93 కోట్లు ఇచ్చారు.
- మీ ఆరోగ్యాలు బాగుండాలి అని జగనన్న ఈ పథకాలు తీసుకు వచ్చారు.
- చంద్రబాబు నమ్మించి మీ అందరినీ మోసం చేశారు.
- ఇంతక ముందు వసంత కృష్ణ ప్రసాద్ మిమ్మల్ని మోసం చేశాడు నమ్మక ద్రోహం చేశాడు.
- అందుకే జగనన్న సామాన్యుడైన సర్నాలను నిలబెట్టారు.
- ఒక సామాన్యుడి బాధ సామాన్యుడికి తెలుసు.
9:55 AM, Mar 11th, 2024
అన్ని సీట్లు కూడా రావని బాబుకి తెలిసిపోయింది: గ్రంధి శ్రీనివాస్
- మెదరమెట్లో జరిగిన సిద్ధం సభ దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది
- సూర్యుడు నిప్పులు కక్కుతున్నా.. 15 లక్షల మంది ఎక్కడా అలసిపోకుండా జై జగన్ నినాదాలతో మేమంతా సిద్ధమంటూ మారుమోగిపోయింది
- పేదలకు పెత్తందారులకు జరిగే యుద్ధంలో.. సీఎం జగన్ అర్జునుడిలా విజయం సాధిస్తారు...
- విద్యా వైద్యం పట్ల గత ప్రభుత్వాలు తిలోదకాలు ఇచ్చాయి
- నాడు వైఎస్సార్ పేదల కోసం ఒక్క అడుగు వేస్తే.. జగన్ పది అడుగులు వేశారు
- దగాకి వెన్నుపోటుకి కుట్ర రాజకీయాలకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్
- ప్రజలను మోసం చేయడం దగా చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
- ఇచ్చిన హామీలు 90% సీఎం జగన్ నెరవేర్చారు
- డిబిటీ నాన్ డిబిటీ ద్వారా 3 లక్షల కోట్లు పేదల ఖాతాల్లో చేర్చారు
- చంద్రబాబు సూపర్ సిక్స్ కోసం రూ. 87 వేల కోట్లు ఖర్చు పెట్టాలి.. ఇచ్చిన హామీలకు లక్షా 50 వేల కోట్లు అవుతుంది
- ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు.. రూ. 1,40,000 కోట్ల హామీలిస్తున్నారు
- ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడం.. వారికి పంగనామాలు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
- చెప్పాడంటే చేస్తాడు అంతే.. అనే బలమైన నమ్మకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
- ఒంటరిగా వెళ్తే 23 సీట్లు కూడా రావనీ చంద్రబాబుకి తెలిసి పోయింది
- సీపీఎం సీపీఐ కాంగ్రెస్ తో చంద్రబాబు అనధికార పొత్తు పెట్టుకుంటున్నారు
- పేదల పక్షాన నిలుస్తున్న జగన్‌పై.. పొత్తులతో యుద్ధం చేయాలని చూస్తున్నారు
- సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు వెల్ నెస్ సెంటర్లతో గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేశారు
- రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది
ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ వ్యాఖ్యలు
8:45 AM, Mar 11th, 2024
అభిమానులకు ముద్రగడ లేఖ..
- వైఎస్సార్‌సీపీలో చేరికపై తన అభిమానులకు లేఖ విడుదల చేసిన కాపు ఉద్యమనేత ముద్రగడ
- ఈ మధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాలు మీడియా ద్వారా మీకందరికి తెలుసు అనుకుంటున్నాను.
- సీఎం జగన్ పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీలోకి వెళ్ళాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నాను
- మరోసారి ముఖ్యమంత్రి పీఠం మీద వైఎస్ జగన్‌ను కూర్చోపెట్టడానికి ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తాను.
- పేదలకు మరెన్నో సంక్షేమ పథకాలు.. అభివృద్ధిని సీఎం జగన్‌తో చేయించాలని ఆశతో ఉన్నాను.
- మీ బిడ్డ అయిన నేను ఎప్పుడు తప్పు చేయలేదు.. చేయను.
- ఈనెల 14న కిర్లంపూడి నుండి తాడేపల్లికి బయలుదేరుతున్నాను.
- అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు పాలపంచుకుని రావాలన్నారు.
8:00 AM, Mar 11th, 2024
ప్రతిపక్ష పార్టీల తొలి ఉమ్మడి సమావేశం..
- విజయవాడలో బీజేపీ - జనసేన - టీడీపీ తొలి ఉమ్మడి సమావేశం.
- సీట్ల సర్దుబాటు, పోటీ చేసే స్థానాలపై చర్చ.
- సీట్ల సర్దుబాటుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం.
- ఇప్పటికే సీట్ల అంశంపై చర్చిస్తున్న కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , ఎంపీ జై జయంత్ పాండా, సంఘటన మంత్రి శివ ప్రకాష్
- నిన్న బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్‌తో బీజేపీ పెద్దలు భేటీ.
7:35 AM, Mar 11th, 2024
ఎవరికి ఎన్ని సీట్లు..
- ఉదయం 10:30 గంటలకి నోవాటెల్ హోటల్‌కి చంద్రబాబు.
- పొత్తులో భాగంగా మూడు పార్టీల ఉమ్మడి సమావేశం
- పొత్తుల ఖరారు తర్వాత జరుగుతున్న మూడు పార్టీల మొదటి సమావేశం.
- జనసేన-బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు కేటాయించినట్లు ఇప్పటికే చంద్రబాబు వెల్లడి.
- ఏయే స్థానాల్లో జనసేన-బీజేపీ పోటీ చేయాలనే దానిపై సమావేశంలో చర్చ.
- ఆయా స్థానాల్లో అభ్యర్థులు ఎంపీకపైన కసరత్తు చేయనున్న మూడు పార్టీలు.
- మూడు పార్టీలు పోటీ చేసే స్థానాలపై ఈరోజు సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం.
7:05 AM, Mar 11th, 2024
ఓటును సంధించండి: సీఎం జగన్
- జమ్మిచెట్టుపై దాచిన ఈ అస్త్రాన్ని బయటకు తీయండి
- పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులపై ప్రయోగించండి
- మేదరమెట్ల సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- నాకు అధికారమంటే వ్యామోహం లేదు.. ప్రతి చరిత్ర పుస్తకంలో నా పేరు ఉండాలి..
- ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫొటో ఉండాలన్నదే కోరిక
- పేదల తలరాతలు మార్చాలన్నదే నా కల, నా లక్ష్యం
- బాబు సైకిల్‌కు చక్రాలు లేవు.. అది తుప్పు పట్టింది
- దాన్ని తోయడానికి వేరే పారీ్టలు కావాలి
- అందుకే దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారు
- దత్తపుత్రుడు సైకిల్ దిగమంటే దిగుతాడు.. ఎక్కమంటే ఎక్కుతాడు
- త్వరలో మేనిఫెస్టో.. చేయగలిగిందే చెబుతాం
- 2014 ఎన్నికల్లో మాయ మాటలు చెప్పి మోసం చేశారు.. ఇప్పుడు మళ్లీ అదే డ్రామాకు సిద్ధమయ్యారు
- బాబు మాటలు నమ్మితే సంక్షేమాభివృద్ధి దూరం
- మీ బిడ్డ మాట ఇచ్చాడంటే చేస్తాడంతే
- ప్రతి గడప నుంచి స్టార్ క్యాంపైనర్లు బయటకు రావాలి
- ఈ మార్పు కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ సీఎం అవ్వాలని ఇంటింటా చెప్పండి
- పార్టీలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా
7:00 AM, Mar 11th, 2024
కేంద్ర బృందంతో పురంధేశ్వరి భేటీ..
- బీజేపీ అభ్యర్థుల జాబితాపై విజయవాడ నోవాటెల్‌లో నిన్న రాత్రి కీలక సమావేశం.
- కేంద్ర బృందంతో భేటీ అయిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.
- సమావేశంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ , ఎంపీ జై జయంత్ పాండా, సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, మధుకర్ , పురంధేశ్వరి.
- అభ్యర్థుల ఎంపీకపై బీజేపీ తుది కసరత్తు.
- జాబితాను నేటి పార్లమెంటరీ పార్టీ సమీక్షకి పంపే అవకాశం
6:55 AM, Mar 11th, 2024
బీజేపీ పెద్దలతో పవన్ భేటీ..
- బీజేపీ పెద్దలతో భేటీ అయిన జనసేన పవన్ కల్యాణ్
- గంటకుపైగా కేంద్ర మంత్రి శకవత్‌తో పవన్ చర్చలు.
- పోటీ చేసే స్థానాలపై సమాలోచనలు.
- చర్చల అనంతరం మౌనంగా వెళ్లిపోయిన పవన్.
- నేడు మరోసారి శకవత్‌తో పవన్ భేటీ అయ్యే అవకాశం.
6:50 AM, Mar 11th, 2024
రాజకీయ కుంభమేళా!
- సార్వత్రిక ఎన్నికలకు ముందే కనిపిస్తున్న వైఎస్సార్‌సీపీ సునామీ
- మేదరమెట్ల సభకు దక్షిణ కోస్తాలో 44 నియోజకవర్గాల నుంచి పోటెత్తిన జనప్రవాహం
- ఇసుకేస్తే రాలనంతగా కిక్కిరిసిపోయిన వందలాది ఎకరాల సభా ప్రాంగణం
- వాహనాలతో కోల్‌కతా – చెన్నై జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
- మేదరమెట్ల – రేణంగివరం ఆరు వరుసల రహదారిపై 18 కి.మీ. పొడవునా ఆగిన వాహనాలు
- మరో చారిత్రక విజయాన్ని చేకూర్చేందుకు సిద్ధమంటూ నినదించిన లక్షలాది గళాలు
- సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న విశ్వాసానికి అద్దం పట్టిన సభ
- భీమిలి, దెందులూరు, రాప్తాడుకు మించి నాలుగో సభ విజయవంతం కావడంపై శ్రేణుల్లో జోష్
6:40 AM, Mar 11th, 2024
టీడీపీకి పొత్తు పోటు
- రాష్ట్రవ్యాప్తంగా నిరసన సెగ
- అభ్యర్థుల ఖరారుపైనా శ్రేణుల్లో ఆందోళన
- డబ్బులు ఖర్చుచేయించి వెన్నుపోటు పొడిచారంటూ గగ్గోలు
- కాకినాడ రూరల్‌లో శెట్టిబలిజ నేత పెంకే శ్రీనివాసబాబా కన్నీళ్లు
- పోలవరం నియోజకవర్గంలో కార్యకర్త ఆత్మహత్యాయత్నం
- తంబళ్లపల్లెలో బైక్ ర్యాలీకి నేతల డుమ్మా
- యలమంచిలిలోనూ కార్యకర్తల నిరసన
- గుంతకల్లులో గుమ్మనూరు గోబ్యాక్ అంటూ ర్యాలీ
6:30 AM, Mar 11th, 2024
టీడీపీ పొత్తుపై ఏపీ బీజేపీ నేతల తీవ్ర అసంతృప్తి
- టీడీపీ కోసం రాష్ట్ర బీజేపీ నేతలను తాకట్టు పెట్టారని రగిలిపోతున్న ఆ పార్టీ ఏపీ నేతలు
- తన సామాజిక వర్గం కోసం ఏపీ బీజేపీని పురందేశ్వరి తాకట్టు పెట్టారని ఆగ్రహం
- ఏపీ బీజేపీకి సీట్ల తగ్గింపులో చక్రం తిప్పిన సుజనా చౌదరి, సీఎం రమేష్
- అధికారంలో లేనప్పుడే 14 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నామని అంటున్న బీజేపీ నేతలు
- ఇప్పుడు ముష్టి 8 అసెంబ్లీ సీట్లకు లొంగిపోవడం పైన రగులుతున్న ఏపీ బీజేపీ నేతలు
- పురందేశ్వరి ఏపీ బీజేపీ నేతల భవిష్యత్తు కాపాడలేకపోయారని తీవ్ర ఆగ్రహం
- ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా పురందేశ్వరి ఫెయిలయ్యారని అగ్గిమీద గుగ్గిలం
- పురందేశ్వరి చెబితే వినే వారెవరు పార్టీలో లేరని వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment