March 12th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On March 12th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates Mar 12th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Tue, Mar 12 2024 6:56 AM | Last Updated on Tue, Mar 12 2024 7:22 PM

Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 12th Updates - Sakshi

AP Elections Political Latest Updates Telugu

07:14 PM, Mar 12th, 2024

ప.గో.జిల్లా: 

భీమవరంలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద టీడీపీ ఫ్లెక్సీలు తొలగింపు

  • టీడీపీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ శివరామరాజు
  • సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం
  • టీడీపీ పార్టీ తనను గుర్తించలేదని ఆవేధన వ్యక్తం చేసిన శివరామరాజు.
  • శివరామరాజు కార్యాలయం వద్ద ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు తొలగించిన అనుచరులు

06:42 PM, Mar 12th, 2024

గీతాంజలి చావు వెనక ఉన్నది లోకేష్: ఎంపీ నందిగాం సురేష్‌

  • లోకేష్.. చంద్రబాబు డైరెక్షన్‌లో ఉన్నారు
  • నా చిన్నప్పుడు మా చెల్లి చనిపోయింది
  • ఇప్పటికి ఆ వయస్సు. వాళ్ళు ఎవరు కనిపించినా చెల్లి అని పిలుస్తాను
  • ఒళ్ళు కొవ్వెక్కి, మదంతో వాగుతున్నారో  అందరిని 24 ఎన్నికల లోపు మేము ఏంటో చూపిస్తాం
  • కొంత మందికి గుర్తించాం.. మరికొంత మందిని గుర్తిస్తున్నాం.. అందరిని శిక్షిస్తాం
  • గీతాంజలి చనిపోయి మంటల్లో కాలుతుంటే ఆ మంటల్లో చలి కాచుకొంటున్నరు
  • మీరు నిజంగా మగాళ్ళు అయితే ఒరిజినల్ అకౌంట్‌లతో రండి
  • మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు వున్నారు.. వాళ్ళు చనిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది
  • గీతాంజలి ఆత్మ శాంతించాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం
  • జై జగన్ అని ఒక్క కామెంట్ పెడితే.. వల్గర్ కామెంట్స్ పెడుతున్నారు
  • లోకేష్ మీ నాన్నకి 75 ఏళ్ళు.. తర్వాత నిన్ను ఎవరు కాపాడలేరు..
  • ఐ టీడీపీ కుక్కలు పెదవాళ్ళ పై పడి హింసిస్తున్నరు
  • ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు వాళ్ళ అమ్మ చనిపోయిన విషయం కూడా తెలీదు
  • రానున్న రోజుల్లో అందరిపై చర్యలు ఉంటాయి
  • లోకేష్‌ని ఎఫ్‌ఐఆర్‌లో పెడతాం

06:32 PM, Mar 12th, 2024

ఐ టీడీపీ వాళ్ళే ఇలాంటివి చేస్తున్నారు: ఎమ్మెల్సీ పోతుల సునీతా

  • రాష్ట్రములో టీడీపీకి పుట్టగతులు ఉండవు..
  • మహిళలు మానసికంగా స్ట్రాంగ్ గా ఉండాలి..
  • గీతాంజలి చావుకు కారణమైనవారు సభ్య సమాజంలో తలదించాల్సిందే
  • గీతాంజలి కుటుంబానికి మనం అందరం అండగా నిలవాలి
  • మహిళల రక్షణకు పెద్దపీటవేసే జగన్మోహన్ రెడ్డి ప్రతి సచివాలయంలో ఒక మహిళ పోలీస్‌ని ఏర్పాటు చేశాం

05:15 PM, Mar 12th, 2024

విజయవాడ
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై సీపీఐ నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

  • పచ్చగా ఉండే టీడీపీ కొంప కూల్చడానికే బీజేపీ పొత్తు
  • రెండో మూడో ఎంపీ సీట్లు ఇస్తా అన్న చంద్రబాబు ను ఎక్కువ సిట్లకు ఒప్పించారు
  • తెలుగు ప్రజల మొట్టమొదటి ద్రోహి బీజేపీ
  • అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న రీతిగా చంద్రబాబు బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు
  • తెలుగు ప్రజలను ఖూనీ చేసిన బద్మాష్‌లు ఆ ముగ్గురు

04:30 PM, Mar 12th, 2024

జగన్ ప్రభుత్వంలో 14వేల కోట్లతో విద్యా వ్యవస్థలో సమూల మార్పు తెచ్చారు: ఎంపీ కేశినేని నాని

  • నాడు నేడు ద్వారా పాఠశాల రూపు రేఖలు మార్చారు
  • ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్. మీడియం ప్రవేశ పెట్టిన  ఘనత జగన్ కే దక్కుతుంది
  • విద్య, వైద్యం కోసం ఎన్నో సంస్కరణలను జగన్ ప్రభుత్వంలో  తీసుకువచ్చారు
  • ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ట్రెండ్ నడుస్తోంది:
  • విద్యార్థుల దశ నుంచే స్టార్ట్ ఆప్ కంపెనీ లకు నాంది పలకాలి

04:20 PM, Mar 12th, 2024

నిండు ప్రాణాన్ని టీడీపీ, జనసేన మూకలు బలి తీసుకున్నాయి: ఎమ్మెల్సీ పోతుల సునీత

  • తన కుటుంబానికి నాలుగు పథకాలు వచ్చాయని సంతోషంగా చెపితే.. టార్గెట్ చేసి చంపేశారు..
  • సమాజంలో టీడీపీ, జనసేన వారిని మృగాలుగా చూడాలి.
  • వారు సోషల్ మీడియాని నడిపేది అమాయకులని బలి తీసుకోవటానికా?
  • దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం.

04:00 PM, Mar 12th, 2024

టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై మండలి బుద్ధప్రసాద్ ఆవేదన

  • అవనిగడ్డ టికెట్ తనకే వస్తుందని ఆశపడ్డ బుద్ధప్రసాద్.
  • పొత్తులో సీటు జనసేనకు కేటాయించే అవకాశం.
  • అవనిగడ్డ సీటు తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న టీడీపీ.
  • ఇప్పటికే చంద్రబాబుకు తీర్మానం చేసి పంపించిన అవనిగడ్డ టీడీపీ నాయకులు.
  • బుద్ధప్రసాద్,టీడీపీ నాయకుల తీర్మానాన్ని పక్కన పెట్టేసిన చంద్రబాబు. 
  • అధిష్టానం తీరుపై బుద్ధప్రసాద్ అసహనం .

03:40 PM, Mar 12th, 2024

విజయవాడ

చంద్రబాబు పై ఒరిజినల్ బీజేపీ నేతల అసంతృప్తి

  • చంద్రబాబు, పురంధేశ్వరి కలిసి ఒరిజినల్ బీజేపీ నేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపాటు
  • పొత్తుల పంచాయితీలో రెండుగా విడిపోయిన ఏపి బీజేపీ
  • పొత్తులపై మరోసారి పునర్ సమీక్షించాలంటూ జాతీయ నాయకత్వం అపాయింట్మెంట్  కోరిన ఏపి బీజేపీ సీనియర్లు
  • బీజేపీ కి వెన్నుపోటు పొడిచేలా సీట్ల పంపకాలు జరిగాయి అంటున్న జాతీయ ,రాష్ట్ర నేతలు
  • కేంద్ర పెద్దలను కలిసే యోచనలో సత్య కుమార్,విష్ణు వర్ధన్ రెడ్డి, జివియల్ , సోము వీర్రాజు తొ పాటు 30  మంది బీజేపి అగ్ర నేతలు
  • వలస నేతలకు టికెట్లు ఇచ్చి పార్టీ నేతలకు అన్యాయం చేయోద్దని  కోరుతున్న బీజేపీ నేతలు
  • ఓడిపోయిన నేతలకు మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వొద్దని కోరుతున్న బీజేపీలో ఒక వర్గం నేతలు
  • సీట్ల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక లో బీజేపీ ఒరిజినల్ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని కోరనున్న నేతలు

03:39 PM, Mar 12th, 2024

విశాఖ: 

పవన్ తీరుపై జనసేన నేతలు అసంతృప్తి

  • 24 నుంచి 21 సీట్లుకు తగ్గడంపై ఆగ్రహం
  • పవన్  స్వార్థం కోసం ఇంకా ఎంతమంది బలి కావాలని ఆవేదన
  • నాయకుడు అనే వాడు సీట్లు ఆదనంగా అడగాలి
  • ఉన్న సీట్లును వదులుకునే వాడిని నాయకుడు అనరు.
  • పవన్ తీరుతో 25 మంది సీట్లను కోల్పోవలసి వచ్చింది
  • చంద్రబాబును నాలుగైదు సీట్లు అదనంగా ఎందుకు అడగలేకపోతున్నారు
  • మొదట టీడీపీ, ఇప్పుడు బీజేపీ కోసం జనసేన సీట్లు కోత పెడతారా
  • పవన్ కళ్యాణ్ తీరుతో పార్టీ నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతుంది

తాడేపల్లి :

03:09 PM, Mar 12th, 2024

ప్రభుత్వం సొంత ఇంటి కల నెరవేరింది అని గీతాంజలి చెప్పడం శాపంగా మారింది:  ఎమ్మెల్సీ  వరుదు కల్యాణి

  • మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం జగన్ ప్రభుత్వం
  • గీతాంజలి మరణంతో ఆమె కుటుంబం రోడ్డున పడింది
  • టీడీపీ,జనసేన సోషల్ మీడియా వేధింపులు కారణంగానే గీతాంజలి ఆత్మహత్య చెసుకుంది..
  • పవన్,లోకేష్, బాలకృష్ణ కు మహిళలంటే లోకువ
  • టీడీపీ అంటేనే దుశ్శాసన పార్టీ, తెలుగు డెకాయిట్ పార్టీ..
  • పేదలకు సొంత ఇల్లు ఇస్తుంటే దాన్ని శ్మశానం తో పోల్చింది టీడీపీ పార్టీనే. 
  • 79 లక్షల మహిళలకు జగన్ లబ్ది చేకూర్చారు..
  • టీడీపీ, జనసేన సోషల్ మీడియా సైకోలుగా మారాయి
  • మహిళలు ఎవరూ భయపడవద్దు
  • జగన్ అన్న తోడుగా ఉన్నాడు
  • దిశ యాప్‌ను మహిళలంతా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి
  • ఎలాంటి ఇబ్బంది ఉన్నా దిశ యాప్‌ను వాడండి
  • మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న టీడీపీ, జనసేన వాళ్ళని తరిమి కొట్టండి
  • ఆ పార్టీలకు రాజకీయ మనుగడ లేకుండా చేయండి

02:35 PM, Mar 12th, 2024

తెనాలి: 

గీతాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల వెంకటలక్ష్మి..

  • మేమున్నామంటూ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన వెంకటలక్ష్మి
  • పిల్లల భవిష్యత్తు కోసం అన్ని విధాలా చర్యలు తీసుకునే విధంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడతామని హామీ
  • మహిళ మీద ఎటువంటి ట్రోలింగ్‌లు అత్యంత హేయమైనవి
  • ఎవరైతే ట్రోలింగ్స్ పాల్పడ్డారు వారిపై చర్యలు తీసుకోవాలని డిజిపిని కోరాం - వెంకటలక్ష్మి
  • ఏ ఒక్కరు గీతాంజలి లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు
  • ఏ సమస్యలున్న కుటుంబ సభ్యుల తోటి లేదా పోలీస్ స్టేషన్‌లో లేదా మహిళా కమిషన్ దృష్టికి తీసుకుని రండి
  • మహిళలపై ట్రోలింగ్ చేయడం సర్వసాధారణంగా మారిపోయింది
  • మహిళలపై ట్రోల్లింగ్స్ చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాం
  • ప్రభుత్వం వద్ద లబ్ధిపొందాం అని చెప్పడం ఐ టీడీపీ వాళ్ళు సహించలేకపోయారు

02:32 PM, Mar 12th, 2024

తాడేపల్లి :

గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణం: హోంమంత్రి తానేటి వనిత

  • ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించాం
  • కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అక్కౌంట్స్ పై నిఘా పెట్టాం
  • గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదు
  • జగన్ అన్న వలన తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడింది
  • అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు
  • ఇందుకు కారణమైన ఎవరినీ వదిలేదు
  • ఇప్పటికే కేసు నమోదు చేశాం
  • దోషుల సంగతి తేల్చుతాం
  • మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతాం
  • గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటిస్తున్నాం

01:51 PM, Mar 12th, 2024
చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్ 

  • నన్ను నమ్మి ఓటేయండని చెప్పిన పవన్.. చంద్రబాబును వదిలేసి మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు
  • మోదీని నానా బూతులు తిట్టింది చంద్రబాబు కాదా?
  • ఈ దేశాన్ని దోచుకున్నది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా? 
  • పాచిపోయిన లడ్డూలిచ్చారన్నది పవన్ కాదా? 
  • నా తల్లిని దూషించారు.. టీడీపీ అంతం చూస్తానని పవన్ ప్రగల్భాలు పలికాడు
  • రాష్ట్రం ఏం విధ్వంసం అయిపోయింది మీరంతా కలిశారు
  • ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనమైపోయిందా?
  • పోర్టులు, జెట్టీలు, మెడికల్ కాలేజీలు నిర్మించినందుకు రాష్ట్రం నాశనమైపోయిందా? 
  • రైతులకు, మహిళలకు రుణమాఫీ ఇస్తానని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు
  • ఒకరిని ఒకరు తిట్టుకుని సిగ్గులేకుండా ఇప్పుడు అంతా కలిసి వస్తున్నారు
  • సీఎం జగన్‌ను ఓడించడమే అన్ని పార్టీల ఆశయం
  • పవన్ సిగ్గులేకుండా 21 సీట్లకు వచ్చాడు 
  • పార్టీని పెట్టింది దేనికి అడుక్కోవడానికా 
  • ఈయన్ని నమ్ముకున్నవాళ్లందరికీ పవన్ ఏం చెప్తాడు 
  • జనసేన ఓట్లు చంద్రబాబుకు బదిలీ అయ్యే పరిస్థితి లేదు
  • బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అట్టర్ ప్లాప్ 
  • చంద్రబాబుకు ఈ సారి 23 సీట్లు కూడా రావు
  • షర్మిల ఎవరికోసం ప్రచారం చేస్తారు
  • ఎవరు గెలవాలని షర్మిల కోరుకుంటున్నారు
  • కాంగ్రెస్‌లో ఉండి బీజేపీలో ఉన్న చంద్రబాబును గెలిపించడానికి షర్మిల ప్రయత్నిస్తోంది
  • మణిపూర్ ఊచకోతకు ఏపీలో ఉన్న సీఎం జగన్‌కు ఏం సంబంధం 
  • తెలంగాణలో తిరిగినప్పుడు షర్మిలకు మణిపూర్ గుర్తుకురాలేదా? 
  • పాస్టర్ అని చెప్పుకునే బ్రదర్ అనీల్ మణిపూర్ వెళ్లాడా? 
  • రాహుల్, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ మణిపూర్ వెళ్లారా? 
  • బీజేపీ క్రైస్తవులను ఊచకోత కోశారని మీరు చెబుతున్నారు
  • నరేంద్రమోదీని ఏపీలో కాలు పెట్టనివ్వనన్నది చంద్రబాబు కాదా? 
  • బీజేపీతో కలిసి తప్పుచేశానన్న చంద్రబాబు సిగ్గులేకుండా మోదీతో ఎలా కలిశాడు? 
  • తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఎన్టీఆర్ టీడీపీని పెట్టాడు
  • చంద్రబాబు తెలుగువాళ్ల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టాడు 
  • ఏపీలో కాంగ్రెస్ జెండా పట్టుకునేవాడు కూడా లేడు 
  • ముఖ్యమంత్రి అవ్వాలని తెలంగాణలో పార్టీ పెట్టింది
  • ఆ పార్టీని హుస్సేన్ సాగర్‌లో కలిపేసి ఏపీకి వచ్చి సీఎం జగన్‌ని సాధించాలని చూస్తోంది
  • కాంగ్రెస్ చెల్లెమ్మ, బీజేపీ వదినమ్మ, 420 చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ జగన్ మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు
  • ఏపీలో కాంగ్రెస్ పార్టీ డిస్పోజబుల్ పార్టీ 
  • డిపాజిట్లు కూడా రానోళ్లు 5 వేలు మహిళలకు ఇస్తారంటే నమ్మడానికి జనం పిచ్చోళ్లా..

01:34 PM, Mar 12th, 2024
పవన్ తన అన్న నాగబాబు కూడా సీటు ఇచ్చుకోలేకపోయారు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

  • పవన్ కల్యాణ్‌ను అమాయకుడిని చేసి సీట్లు తగ్గించారు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్
  • కేఏ పాల్‌తో తప్ప అందరితో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు
  • రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయమని సీఎం జగన్‌ కోరుతున్నారు
  • పొత్తులను చూసి ఓటేయమని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి
  • ప్రజలే ఆలోచించాలి
  • గతసారి కంటే ఈసారి ఇంకా అధికంగా సీట్లతో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయం
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ-టీడీపీ- జనసేన పార్టీలు ఏమి సమాధానం చెప్తాయి

01:32 PM, Mar 12th, 2024
గీతాంజలి మృతి చాలా దురదృష్టకరం: వాసిరెడ్డి పద్మ

  • గీతాంజలి ఘటనను సీఎం దృష్టికి తీసుకెళ్లా 
  • సోషల్ మీడియా సైకోలను విడిచిపెట్టకూడదు 
  • టీడీపీ, జనసేన కార్యకర్తల వేధింపులను ప్రభుత్వం, మహిళాలోకం సీరియస్‌గా తీసుకుంటుంది 
  • బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
  • ప్రభుత్వం నుంచి పొందిన మేలును చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా 
  • గీతాంజలి మృతి పై చంద్రబాబు, పవన్‌లు స్పందించాలి
  • గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

11:47 AM, Mar 12th, 2024
గీతాంజలి కేసు: అజయ్‌పై చర్యలు తీసుకోవాల్సిందే

  • ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్లో నారా లోకేష్ ప్రధాన అనుచరుడు సజ్జా అజయ్ దిష్టిబొమ్మ దహనం
  • గీతాంజలిపై సోషల్ మీడియాలో అసభ్య పోస్టింగ్ పెట్టిన అజయ్
  • తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణ ప్రయత్నం చేసిన గీతాంజలి
  • గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో కన్నుమూత
  • అజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగం

11:23 AM, Mar 12th, 2024
ఇంకా 73 రోజుల్లో మళ్లీ సీఎంగా జగన్‌: YSRCP

  • తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు
  • 'జగన్ అనే నేను..' పేరుతో ఏర్పాటు చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం
  • ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణస్వీకారం చేసే రోజును తెలియచేస్తూ కౌంట్ డౌన్
  • మరో 73 రోజుల్లో సీఎంగా రెండోసారి జగన్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ డిజిటల్ బోర్డు ఏర్పాటు

11:00 AM, Mar 12th, 2024
నిడదవోలులో జనసేనకు సహకరించం: టీడీపీ కార్యకర్తలు

  • నిడదవోలు నియోజకవర్గంలో జనసేన టీడీపీ మధ్య  రాజుకున్న చిచ్చు
  • పొత్తులో భాగంగా జనసేన కందుల దుర్గేష్‌కు టికెట్‌ కేటాయింపు
  • సోమవారం ప్రకటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
  • దుర్గేష్ నిడదవోలు టికెట్ కేటాయించడంపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే శేషా రావు వర్గం ఆగ్రహం
  • టికెట్‌ శేషారావుకే ఇవ్వాలని టీడీపీ కార్యకర్తల డిమాండ్‌ 
  • జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ కు సహకరించేది లేదని ప్రకటనలు 
  • ఉమ్మడి అభ్యర్థిగా నేడు నిడదవోలు వెళ్తున్న కందుల దుర్గేష్
  • ఎలాంటి పరిణామాలు ఉంటాయో అనే రాజకీయ వర్గాల చర్చ

10:48 AM, Mar 12th, 2024
గీతాంజలి ఘటనపై మంత్రి రోజా ఆవేదన

  • రాష్ట్రంలో నిన్న విషాద ఘటన చోటు చేసుకొంది
  • ప్రభుత్వం ఇచ్చిన ఇంటి పట్టాని చూపించి మీడియా ముందు సంతోషంగా మాట్లాడటమే ఆవిడ చేసిన తప్పా?
  • టీడీపీ, జనసేన వాళ్లు ఆ మహిళపై దారణంగా మాట్లాడారు
  • ఎవరైతే గీతాంజలి మరణానికి కారణం అయ్యారో వారిని కఠినంగా శిక్షించాలి.
  • అమె పిల్లలు తల్లి లేని చిన్నారులుగా మారారు
  • ఐ టీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుంది, 
  • మహిళలను చులకనగా మాట్లాడటం.. వల్గర్ గా మాట్లాడటం మంచిది కాదు
  • ఈ ఎన్నికలలో మహిళలపై అమానుషంగా మాట్లాడిన వాళ్లను శిక్షించాలి.. పచ్చపార్టీలను తరిమికొట్టాలి
  • నారా లోకేష్ వార్డు మెంబర్ గా కూడా మాట్లాడలేరు..
  • నారా లొకేష్ మాటలు పట్టించుకోం
  • గెలవలేమన్న స్థాయికి వచ్చారు కావునే అందరితో పొత్తుకు తహతహలాడుతున్నారు.

మంత్రి ఆర్కే రోజా కామెంట్లు

10:02 AM, Mar 12th, 2024
జగన్‌కు అండగా జనం.. వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో నేతలు

ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మండలి చిఫ్ విప్ మాట్లాడుతూ..

  • చంద్రబాబుకు అధికారం మీద మాత్రమే ప్రేమ
  • అంతేతప్ప ప్రజలు, వారి అవసరాల మీద ఏమాత్రం ప్రేమ లేదు
  • ఈ ఐదేళ్లలో నేను మంచి చేశాననిపిస్తేనే ఓటెయ్యమని జగన్ అంటున్నారు
  • నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ ఇలాంటి నాయకుడ్ని చూడలేదు
  • తన పాదయాత్రలో జనం చెప్పినవన్నీ జగన్ నోట్ చేసుకున్నారు
  • ప్రజా అవసరాల మీదనే జగన్ పాదయాత్ర చేశారు 
  • జగన్ సృష్టించిన చరిత్రని చెరిపేయటం ఎవరి తరం కాదు
  • ప్రజల అవసరాలే తన ఎజెండా అని చెప్పిన ఏకైక నాయకుడు జగన్ 
  • ఇలాంటి నాయకుడికి ప్రజలందరి ఆశీస్సులు ఇవ్వాలి

లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామెంట్స్..

  • జగన్ అంటేనే విశ్వసనీయత
  • చెప్పిన మాట ప్రకారం మ్యానిఫెస్టో అమలు చేదిన ఘనత జగన్ ది

మంత్రి జోగి రమేష్ కామెంట్స్..

  • జగన్ లాంటి సీఎం మాక్కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకున్నారు 
  • చరిత్ర సృష్టించటం జగన్ కే సాధ్యం
  • కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్ ని ఓడించి తీరుతాం
  • గుంటనక్కలు, తోడుదొంగలు చేసే నీచ రాజకీయాలను వైసీపి కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
  • ఈ ఐదేళ్లలో ఎన్నో మేళ్లు చేసినందునే ధైర్యంగా ఓటు అడగుతున్నాం 
  • అన్ని వర్గాల ప్రజలు మన వెంట నడుస్తున్నారు
  • వారికి అండగా నిలవాలంటే మళ్ళీ జగన్ని సీఎం చేసుకోవాలి 
  • వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షరాలు కామెంట్స్..
  • గత 13 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిన వ్యక్తి జగన్
  • రైతులు, కార్మికులు, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాలకు జగన్ అండగా నిలిచారు 

హఫీజ్ ఖాన్, ఎమ్మెల్యే కామెంట్స్

  • జగన్ ఉంటేనే అందరికీ మేలు జరుగుతాయి
  • ఆయన్ని అణచివేయాలని ఎంతోమంది చూశారు
  • ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొని జగన్ విజేతగా నిలిచారు 

ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. 

  • పార్టీ పెట్టినప్పటి నుండి జగన్ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు
  • అన్నిటినీ ఎదుర్కొని అధికారం సాధించారు
  • ఈ ఐదేళ్లూ చెప్పిన అన్ని హామీలూ నెరవేర్చారు 
  • జగన్ కు ఉన్న ప్రజా బలం ముందు ప్రతిపక్షాలు కిందామీద పడుతున్నాయి 
  • అర్ధరాత్రి కూడా చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ నేతల ఇళ్ల ముందు పడిగాపులు కాశారు
  • ఇలాంటి వారు ప్రజలకు ఏం చేస్తారు? 
  • మోసాలలో పుట్టి మోసాలు చేసే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసు

08:49 AM, Mar 12th, 2024
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెలీలపై వేటు

  • ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సి రామచంద్రయ్యపై వేటు
  • జనసేనలో చేరిన వంశీకృష్ణ, టీడీపీలో చేరిన సి.రామచంద్రయ్యపై వేటు
  • వైఎస్సార్‌సీపీ తరఫున ఎన్నికై.. ఆ రెండు పార్టీలోకి ఫిరాయించిన ఈ ఇద్దరు
  • మండలి కార్యదర్శికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు
  • వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చి.. విచారించిన శాసనమండలి చైర్మన్‌  మోషేన్ రాజు
  • సమగ్ర విచారణ అనంతరం వేటు వేసిన మండలి చైర్మన్ మోషేన్ రాజు

08:06 AM, Mar 12th, 2024
చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు: కొడాలి నాని

  • చంద్రబాబు తనపై ఉన్న 57 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లకుండా ఉండేందుకే బీజేపీతో పొత్తు
  • రానున్న ఎన్నికల్లో ఎలాగూ అధికారంలోకి రానని తెలుసుకున్న బాబు తనపై ఉన్న కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకునేందుకే..
  • ముందుగానే బీజేపీతో పొత్తు పెట్టుకుని కొత్త డ్రామాలకు తేరలేపారు
  • సిగ్గు, శరం లేకుండా ఈ వయసులో కూడా చంద్రబాబు మూడు రోజులు ఢిల్లీలో పడిగాపులు
  • ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అందుబాటులో లేకపోయినా వారి పీఏలతో పొత్తు కుదుర్చుకున్నారు
  • అధికారం కోసం చంద్రబాబు ఎన్ని మోసాలైనా చేస్తారు
  • ఎవరి బూట్లు అయినా నాకేందుకు వెనుకాడరు
  • అధికారంలో ఉన్నప్పుడు నల్లచొక్కా వేసుకుని రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసిందని పోరాటాలు చేసిన వ్యక్తి చంద్రబాబు కాదా..
  • భార్య, పిల్లలు లేని మోదీ దేశాన్ని ఏం ఉద్దరిస్తాడని, బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌తో కలసి పోటీ చేస్తున్నానని 2019 ఎన్నికల్లో చెప్పింది నిజం కాదా?
  • మళ్లీ ఇప్పుడు మోదీ గొప్పవాడు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని బాబు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు
  • వెయ్యిమంది మోదీలు, లక్షమంది బాబులు, కోటి మంది పవన్‌కళ్యాణ్‌లు కలిసి వచ్చిన  ఉపయోగం ఉండదు
  • దేవుడి ఆశీస్సులు, ప్రజాబలంతో సీఎం వైఎస్‌ జగన్‌ రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేసి మరోసారి సీఎం కావడం తథ్యం

07:37 AM, Mar 12th, 2024
నేడు వైఎస్సార్‌సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం

  • పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జెండావిష్కరించనున్న పార్టీ నేతలు
  • అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహణ
  • రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

07:33 AM, Mar 12th, 2024
ఈ ఎన్నికలు.. టీడీపీకి చావుబతుకుల సమస్య:  వసంత కృష్ణప్రసాద్

  • మైలవరం టీడీపీ సీటు పై వీడని సందిగ్ధత
  • కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేసిన వసంత కృష్ణప్రసాద్
  • ఉమా సైలెంట్ అయినా.. టిక్కెట్ కోసం ట్రై చేస్తున్న బొమ్మసాని సుబ్బారావు
  • తాజాగా చర్చనీయాంశంగా మారిన కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు 
  • నేనే మైలవరం అభ్యర్ధి అనుకోవద్దు: వసంత కృష్ణప్రసాద్
  • నాకు మద్దతివ్వండి...నాకు టిక్కెట్ ఇస్తేనే సహకరించండని నేను అనడం లేదు : వసంత కృష్ణప్రసాద్
  • నేను,దేవినేని ఉమా కాకుండా మూడో వ్యక్తి వచ్చినా అంతా కలిసి పనిచేద్దాం : వసంత కృష్ణప్రసాద్
  • అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనం పై అంతే ధీటుగా పని చేస్తా: వసంత కృష్ణప్రసాద్
  • నేను తెలుగుదేశం పార్టీ లో చేరి మీలో ఒకడిగా మీతో కలిసి నడవడానికి మీ దగ్గరకు వచ్చాను: వసంత కృష్ణప్రసాద్
  • నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుండి రాజకీయ విభేదాలు ఉన్నాయి: వసంత కృష్ణప్రసాద్
  • 2024 ఎన్నికలు చాలా కీలకం, తెలుగుదేశం పార్టీకి చావు బ్రతుకుల సమస్య: వసంత కృష్ణప్రసాద్

07:24 AM, Mar 12th, 2024
వీరమహిళపై టీడీపీ నేతల దాడి.. పవన్‌ స్పందన నిల్‌

  • జనసేన మహిళా నేతపై దాడి
  • జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణపై దాడికి పాల్పడ్డ పచ్చ తమ్ముళ్లు
  • ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం దాసరివారిపాలెం కనపర్తిల వద్ద ఘటన
  • దాడికి పాల్పడింది ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్‌ అనుచరులే
  • కులంపేరుతో దూషించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు అరుణ
  • ఛాతీ మీద చెయ్యేసి గుండెల మీద బలంగా గుద్దినట్లు చెబుతున్న బాధితురాలు
  • దాడిని అడ్డుకోబోయిన మరో జనసేన నేతపైనా తల పగిలేలా దాడి 
  • పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఫిర్యాదు చేసినా స్పందన నిల్‌
  • ఎన్నికలయ్యాక చూద్దాంలే పార్టీ నేతలతో కబురు పంపినట్లు సమాచారం!

07:24 AM, Mar 12th, 2024
మరోసారి చంద్రబాబుకి పవన్ దాసోహం

  • 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ
  • బీజేపీకి సీట్ల సర్దుబాటుకు జనసేన అసెంబ్లీ స్థానాల్లో 3 తగ్గించిన బాబు 
  • బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు  
  • టీడీపీకి 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లు  


07:03 AM, Mar 12th, 2024
‘సిద్ధం’ సభలతో విపక్షాల్లో వణుకు 

  • మేదరమెట్ల సభ జనసంద్రాన్ని ముందే ఊహించి చీప్‌ట్రిక్స్‌కు బరితెగించిన పచ్చ ముఠా 
  • ఉదయం ఫొటోలు తీసుకుని జనం మొహం చాటేశారంటూ పైశాచికానందం 
  • అందుకే 45 నిముషాల ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారాలు ఇస్తున్నారంటూ విచిత్ర విమర్శలు 
  • వాటిని అందిపుచ్చుకుని ఊగిపోయిన ఎల్లో మీడియా 
  • ఈ సభను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించిన 1.50 కోట్ల మంది  
  • ఘోర పరాజయం భయంతోనే చౌకబారు ఆరోపణలంటూ ఏకిపారేస్తున్న రాజకీయ విశ్లేషకులు  

6:59 AM, Mar 12th, 2024
టీడీపీ, జనసేన ఆన్‌లైన్‌ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మ బలి

  • జగనన్న ఇంటి పట్టా ఇచ్చారని సంతోషంతో చెప్పటమే ఆమె నేరం
  • అమ్మ ఒడి, చేయూత, పింఛన్‌తో కుటుంబం బాగుపడిందనటమే తప్పయ్యింది
  • ఓ యూట్యూబ్‌ చానల్‌కు సంతోషంగా చెప్పిన తెనాలికి చెందిన గీతాంజలి
  • సోషల్‌ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ, జనసేన మూకలు
  • ఆమెను దూషిస్తూ... వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్‌
  • మనస్థాపంతో రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం.. ఆనక ఆస్పత్రిలో మృతి
  • సీఎం సూచనతో ఆ కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే
  • బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి ఇద్దరు కుమార్తెలను ఆదుకుంటామని భరోసా  
  • సోషల్‌ మీడియాలో జస్టిస్‌ ఫర్‌ గీతాంజలి ట్రెండింగ్‌

6:42 AM, Mar 12th, 2024
చంద్రబాబు ట్వీట్‌.. రగిలిపోతున్న జనసేన

  • బీజేపీ-టీడీపీ-జేఎస్‌పీ(జనసేన) పొత్తుపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ట్వీట్‌
  • టీడీపీకి 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌, జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌, బీజేపీకి 10 అసెంబ్లీ 2 పార్లమెంట్‌ 
  • సీట్లను ఆయా పార్టీలే ప్రకటిస్తాయన్న బాబు
  • జనసేనకు 24 సీట్లు అని ఇంతకు ముందు సంయుక్తంగా ప్రకటించిన చంద్రబాబు-పవన్‌
  • పవన్‌ను మళ్లీ మోసం చేసిన బాబు!
  • రగిలిపోతున్న జనసేన శ్రేణులు
  • జనసేనలో అసంతృప్తి బయటపడే అవకాశం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement