
AP Elections Political Latest Updates Telugu..
9:30PM, Mar 14th, 2024
తిరుపతి:
తిరుపతి అసెంబ్లీ సీటు కేటాయింపు పై ముదురుతున్న వివాదం
- తిరుపతి టీడీపీ జనసేన నేతలు సమిష్టి నిర్ణయం
- తిరుపతి స్థానికుల ఆత్మగౌరవ సభ కు ఏర్పాట్లు
- రామతులసి కల్యాణ మండపం రేపు ఉదయం 10 గంటలకు సమావేశం కానున్న టీడీపీ జనసేన నేతలు భవిష్యత్ కార్యాచరణ
- ఆరణి వద్దు - పవన్ ముద్దు అంటూ పిలుపు
- నాన్ లోకల్ వద్దు ,లోకల్ ముద్దు అంటున్న తిరుపతి జనసేన - టీడీపీ నేతలు
9:10PM, Mar 14th, 2024
అమరావతి:
పెండింగ్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ఎంపికపై చంద్రబాబు కసరత్తు
- రేపు 7 లేదా 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే యోచనలో టీడీపీ అధినేత
- మొదటి విడతలో 94, రెండో విడతలో 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
- రేపు, ఎల్లుండిలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే యోచనలో చంద్రబాబు
8:10PM, Mar 14th, 2024
విశాఖ
విశాఖ ఎంపీ స్థానం కోసం పోటీ పడుతున్న టీడీపీ - బీజేపీ
- సీటు తనదేనని ధీమాగా ఉన్న బీజేపీ ఎంపీ జీవీఎల్
- టీడీపీ నుంచి భరత్‌కు ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకున్న బాబు, పురంధేశ్వరి
- టీమ్ జీవీఎల్ అధ్వర్యంలో విశాఖ లో బైక్ ర్యాలీ
- ఢిల్లీ నుంచి వచ్చిన జీవీఎల్‌కు ఘన స్వాగతం పలికి ర్యాలీగా తీసుకెళ్లిన పార్టీ శ్రేణులు
- విశాఖ లోక్ సభ కోసం ప్రయత్నిస్తున్న జీవీఎల్ తాజా ర్యాలీ పై ఆసక్తికర చర్చ
6:45PM, Mar 14th, 2024
తాడేపల్లిగూడెంలో టీడీపీకి భారీ షాక్
- టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఈలి నాని వైఎస్సార్‌సీపీలో చేరిక
- సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఈలి నాని
- పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగ
6:40PM, Mar 14th, 2024
కర్నూలు :
కోసిగి మండల కేంద్రంలో ఉద్రిక్తత
- పెట్రోలు పోసుకొని బలవన్మరణానికి టీడీపీ కార్యకర్తల యత్నం
- పెట్రోలు పోసుకున్న వీరయ్య, కోసిగయ్య, హనుమంతు
- తన తలను పగలగొట్టుకున్న ఓ టీడీపీ కార్యకర్త
- కష్టకాలంలో కార్యకర్తలను కాపాడుకున్న వ్యక్తి తిక్కారెడ్డి అంటున్న కార్యకర్తలు
- పాలకుర్తి తిక్కారెడ్డికి టికెట్ ఇవ్వకుండా మూడు పార్టీలు మారిన రాఘవేంద్రరెడ్డికి ఇస్తారా అంటూ టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
- చంద్రబాబు డౌన్.. డౌన్ అంటూ నినాదాలు
- మంత్రాలయం టీడీపీలోనూ కొనసాగుతున్న హైటెన్షన్
- అభ్యర్ధిగా ప్రకటించకపోవడంతో అనుచరుల అసంతృప్తి
- 10 రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన రాఘవేంద్రరెడ్డికి టికెట్ ఇవ్వడంపై టీడీపీ కార్యకర్తల ఆగ్రహం
6:30PM, Mar 14th, 2024
ఎన్నికలకు ఈసీ రెడీ...రేపు షెడ్యూల్ వచ్చే అవకాశం
- ఒకవేళ రేపు కుదరకపోతే ఎల్లుండి షెడ్యూల్ ప్రకటన
- ఖాళీగా ఉన్న ఇద్దరు కమిషనర్ల నియామకం ఇవాళ పూర్తి
- జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమావేశాలు పూర్తి చేసిన ఈసీదేశంలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన ఈసీ
- ఏడు విడతల్లో ఎన్నికలు జరిగే అవకాశం - మొదటి విడతలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశం
- లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు
6:25PM, Mar 14th, 2024
తూ.గో.జిల్లా:
టీడీపీ రెండో జాబితా విడుదలతో రగులుతున్న అసంతృప్తి సెగలు
- కొవ్వూరు టీడీపీ సీటు జవహర్‌కు దక్కకపోవడంతో.. జవహర్ వర్గీయులు ఆగ్రహం
- జవహర్ ఇంటి ముందు ఆందోళన జవహర్ చేపట్టిన వర్గీయులు .
- టీడీపీ ఫ్లెక్సీలు చింపి నిరసన
- కొవ్వూరు నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తాను తప్పుకునేది లేదని చెన జవహర్
- రెండో జాబితాలో ముప్పిడికి సీటు కేటాయించడంతో జవహర్ ఇంటి ముందు టైర్లు అంటించి నిరసన తెలిపిన జవహర్ వర్గం
6:13PM, Mar 14th, 2024
ఎన్టీఆర్ జిల్లా:
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీల జీవితాలు బాగుడాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉండాలి: ఎంపీ ,కేశినేని నాని
- శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను కొత్తగా నిర్మించారు
- ప్రపంచ స్థాయి చదువులతో రాష్ట్ర విద్యార్ధులను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు ఎంతో ఖర్చు చేస్తున్నారు
- ప్రజారోగ్యం కోసం గ్రామాల్లో హెల్త్ సెంటర్లు నిర్మించి వైద్యం అందిస్తున్నారు
- ఆరోగ్యశ్రీ ద్వారా ఎంత పెద్ద జబ్బు అయినా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం జగన్‌దే
- ప్రపంచంలో పేద వర్గాలకు అండగా నిలబెడుతున్న ఏకైక నాయకుడు సీఎం జగన్
- కోటి 35 లక్షల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తూ వారి గుండెల్లో చిరస్థాయిగా జగన్ నిలిచిపోయారు
- విజయవాడ వైఎస్సార్‌సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను , జగ్గయ్యపేట ఎమ్మెల్యేగా ఉదయభానును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నాం
6:11PM, Mar 14th, 2024
రేపు వైఎస్సార్‌సీపీలో చేరనున్న ముద్రగడ
- ఉదయం గం. 10:30ని.లకు వైఎస్సార్‌సీపీలో చేరనున్న ముద్రగడ
- సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న ముద్రగడ
6:01PM, Mar 14th, 2024
కృష్ణాజిల్లా:
టిక్కెట్ దక్కక పోవడంపై టీడీపీ నేత , మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆవేదన
- చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బోడే
- పెనమలూరులో టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామని ఫోన్ చేయించారు
- ఈ నాలుగున్నరేళ్లలో నేనేం తప్పుచేశాను
- పెనమలూరులో సర్వేలు నాకేమైనా వ్యతిరేకంగా ఉన్నాయా ?
- అవకాశం లేనప్పుడు నా పేరుతో ఐవీఆర్ఎస్ సర్వేలు ఎందుకు చేయించారు?
- ఐవీఆర్ఎస్ సర్వేల్లో కూడా 86 శాతం నాకే మద్దతు వచ్చింది
- నేను ఓడిపోయినప్పుడు కూడా బాధపడలేదు
- పెనమలూరులో అవకాశం కల్పించలేకపోతున్నామంటే నా గుండె కలచివేసింది
- ఈ పదేళ్లలో భార్యా,పిల్లలను వదిలేసి పార్టీ కోసమే నా సమయాన్నంతా వెచ్చించా
- పార్టీ కోసం కోట్లు ఖర్చుచేశా
- చంద్రబాబు కుటుంబం నుంచి ఎవరిని తెచ్చినా నెత్తిమీద పెట్టుకుని గెలిపిస్తాం
- వేరే వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడితే సహకరించేది లేదు
5:45PM, Mar 14th, 2024
తూర్పుగోదావరి జిల్లా:
టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో రామచంద్రపురం లో అలజడి
- తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న జనసేన కార్యకర్తలు
- వాసంశెట్టి సుభాష్ రౌడీ షీటర్‌ని తమ వద్దకు రానివ్వమని గతంలో ఆందోళన చేసిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు
- రామచంద్రపురం అసెంబ్లీ ఇంచార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యానికి మొండి చేయి చూపిన చంద్రబాబు
- ఏజెన్సీ రంపచోడవరం టికెట్ మిరియాల శిరీష కు కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ నాయకులు
- రంపచోడవరం టికెట్ పై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
5:35PM, Mar 14th, 2024
తాడేపల్లి :
బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు
- బీసీలకు భారీగా సీట్ల తగ్గింపు
- రెండు లిస్టులలో కలిపి ఇప్పటికి బీసీలకు కేటాయించినది కేవలం 24 సీట్లే
- గత ఎన్నికల్లో 43 ఇచ్చి ఇప్పుడు సగానికి సగం తగ్గింపు
- తన సొంత సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యత
- కమ్మలకు ఏకంగా 28 సీట్లను కేటాయించుకున్న చంద్రబాబు
- బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్న టీడీపీ అధినేత
- కాపులకు 8, మైనారిటీలు 3 సీట్లకే పరిమితం
- చంద్రబాబు వ్యవహారశైలిపై ఫైర్ అవుతున్న కమ్మేతర వర్గాలు
05:25PM, Mar 14th, 2024
పిఠాపురంలో టీడీపీలో అసమ్మతి సెగ
- పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ పోటీ చేస్తారన్న ప్రకటనతో భగ్గుమన్న అసమ్మతి
- టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్‌వీఎస్‌ఎన్ వర్మ అనుచరులు దహనం
- వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు
- వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన
- వర్మకి సీటు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం
- మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్న టీడీపీ కార్యకర్తలు
05:05PM, Mar 14th, 2024
కృష్ణాజిల్లా:
పెనమలూరులోని బోడె ప్రసాద్ కార్యాలయంలో ఉద్రిక్తత
- బోడేకు టిక్కెట్ రాకపోవడం పై కార్యకర్తల్లో తీవ్ర అసహనం
- పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన టీడీపీ కార్యకర్త
- అడ్డుకున్న తోటి కార్యకర్తలు
04:59PM, Mar 14th, 2024
కాకినాడ:
నాపై పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు అవాస్తం అని తేలింది: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
- మళ్ళీ నా గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఊరుకోను
- నా మీద పోటీ చేయ్యమని అడిగితే తోక ముడుచుకుని పక్క నియోజకవర్గానికి వెళ్ళిపోయాడు
- ఇప్పటీకీ పవన్ పై పోటీకి రెడీగా ఉన్నాను
- నేనేమిటో కాకినాడ ప్రజలకు తెలుసు
- ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా చిత్తశుద్దిగా ప్రజలకు సేవలందించాను
03:50PM, Mar 14th, 2024
కృష్ణా: పెనమలూరు టీడీపీ శ్రేణుల్లో తీవ్ర అసహనం
- బోడే ప్రసాద్‌కు టికెట్ దక్కకపోవడంపై మండిపాటు
- మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటన
- చంద్రబాబు తీరుపై బోడే ప్రసాద్ వర్గం ఆగ్రహం
- పార్టీ కోసం వాడుకుని టికెట్ ఇవ్వకుండా వదిలేశారని ఆవేదన
- టీడీపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తామంటున్న బోడే వర్గం
- చంద్రబాబు సీఎం ఎలా అవుతారో చూస్తామంటున్న బోడె వర్గం
03:36PM, Mar 14th, 2024
నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నా: ఆర్జీవీ
- ఈ విషయాన్ని తెలపడానికి చాలా సంతోషంగా ఉంది
- ఇది ఆకస్మిక నిర్ణయం
SUDDEN DECISION..Am HAPPY to inform that I am CONTESTING from PITHAPURAM 💪💐
— Ram Gopal Varma (@RGVzoomin) March 14, 2024
03:18PM, Mar 14th, 2024
విజయవాడ
కాపులను సీఎం జగన్ మోసంచేస్తున్నారంటూ టీడీపీ, పవన్‌లు చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్ట్రాంగ్ కౌంటర్
- సెంట్రల్ నియోజకవర్గంలో కోటి 25 లక్షలతో కాపు కళ్యాణ మండపం నిర్మించాం
- టీడీపీ సమయంలో చేయలేని పనిని మేం చేసి చూపించాం
- వైఎస్సార్‌సీపీ వచ్చిన తర్వాత ఏపీలో 77 లక్షల మంది కాపులకు రూ. 39,311 కోట్లు ఖాతాల్లో వేశాం
- అరకొరగా మిగిలిపోయిన కాపు భవనాలను పూర్తిచేశాం
- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2583 కుటుంబాలకు 12 కోట్ల 74 లక్షలు కాపునేస్తం అందించాం
- టీడీపీ ఐదేళ్లలో ఏనాడైనా ఈ 2583 కుటుంబాలను పట్టించుకున్నారా
- ఏ మొహం పెట్టుకుని మీ పత్రికల్లో రాసుకుంటున్నారు
- పవన్ పార్టీ తాకట్టు పెట్టిన త్యాగరాజు
- తాకట్టు త్యాగరాజు పవన్ తన ప్రగల్భాలు మానుకోవాలి
- ఓట్లు చీలకుండా చేయడం మీ మూడు పార్టీలకే తెలుసా
- సీఎం జగన్‌ను ఢీకొట్టలేకే టీడీపీ , జనసేన , బీజేపీ కలిసివస్తున్నాయి
- 2024లో వైఎస్సార్‌సీపీ మరోమారు ప్రభంజనం సృష్టించబోతుంది
- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం
- 2014లో తిరుపతిలో మాట్లాడిన మాటలు చంద్రబాబు, పవన్‌కు గుర్తులేవా
- టీడీపీ , జనసే, బీజేపీ ప్రజలను మోసం చేయడానికే వచ్చాయి?
- మోదీని నువ్వెన్ని బూతులు తిట్టావో మర్చిపోయావా చంద్రబాబు
- వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించి నాశనం చేసింది చంద్రబాబే
03:15PM, Mar 14th, 2024
పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ
- కార్యకర్తల సమావేశంలో ప్రకటించిన పవన్
- గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన పవన్
- ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్ ప్రకటన
02:41PM, Mar 14th, 2024
విశాఖ:
మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశం
- రుషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్‌లో గంటా రహస్య సమావేశం
- టీడీపీలో కొనసాగాలా లేదా అనే అంశంపై అనుచరులతో మంతనాలు
- టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయిన గంటా
- టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాస్ కు టికెట్ కేటాయించని టీడీపీ
- మొదటి నుంచీ భీమిలి టికెట్ కోసం పట్టుబట్టిన గంటా
- భీమిలి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన చంద్రబాబు
02:28 PM, Mar 14th, 2024
విజయవాడ:
చంద్రబాబు, పవన్ పై కాపు కార్పొరేషన్ అడపా శేషు ఫైర్
- చంద్రబాబు చేతిలో పవన్ జోకర్
- జనసేన పార్టీని పెట్టించింది చంద్రబాబే
- కాపులను ఎదగకుండా చేసింది చంద్రబాబే
- 21 సీట్లు తీసుకుని కాపులను యాచించే స్థాయికి పవన్ దిగజార్చేశాడు
- తనను నమ్ముకున్న జనసేన కార్యకర్తలు , వీరమహిళలకు పవన్ ఏం సమాధానం చెబుతాడు
- పవన్ పేరుకే పవర్ స్టార్
- పవన్ ముఖ్యమంత్రి అవుతాడని కాపులంతా నమ్మారు
- కాపులకు నమ్మకద్రోహం చేసిన వ్యక్తి పవన్
- పవన్ ఈ రాష్ట్రానికి చుట్టం చూపుగా వచ్చి వెళ్తాడు
- పవన్‌ను కాపు సోదరులు ఎవరూ నమ్మొద్దు
- టీడీపీ,జనసేన ,బీజేపీకి ఏపీతో సంబంధం లేదు
- ఈ రాష్ట్ర ప్రజలను తన కుటుంబంగా భావిస్తున్న జగన్ కు కాపులంతా అండగా నిలవాలి
02:15 PM, Mar 14th, 2024
టీడీపీకి రాజీనామాకు రెడీగా ఉన్నాం: ప్రగడ నాగేశ్వరరావు
- అనకాపల్లి ఎలమంచిలి:
- టీడీపీలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి.
- ఎలమంచిలి సీటు జనసేనకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం.
- పార్టీ నాయకులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు.
- చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
- అనకాపల్లి జిల్లాలో టీడీపీ తరఫున ఒక్క సీటు కాపులకు ఇవ్వకపోవడం దారుణం.
- కాపులు అవసరం మీకు లేదా?.
- చంద్రబాబు నిర్ణయాలతో సైకిల్ గుర్తు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
- టీడీపీ నాయకులు పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
01:49 PM, Mar 14th, 2024
విశాఖలో టీడీపీకి షాక్
- టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ రాజీనామా
- దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తగా వ్యవహరించిన గండి బాజ్జీ
- దక్షిణ లేదా మాడుగుల టికెట్ ఆశించి.. రెండో జాబితాలో భంగపడ్డ బాజ్జీ
01:32 PM, Mar 14th, 2024
బాబు అండ్ కోపై బనగానపల్లె బహిరంగ సభలో సీఎం జగన్
- పేదరికానికి కులం ఉండదు
- పేదవాళ్లను ఆదుకునే గుణం ప్రభుత్వానికి ఉండాలి
- పేదలను ఆదుకునేందుకు పాలకులకు గొప్ప మనసు ఉండాలి
- వైఎస్సార్ ఈబీసీ అనేది.. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కార్యక్రమం కాదు ఇది
- పేదరికం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదనే మన ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది
- వైఎస్సార్ ఈబీసీ పేద మహిళలకు ఎంతో మేలు జరిగింది
- 4, 19, 583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇవాళ రూ. 629.37 కోట్లు జమ చేస్తున్నాం
- మొత్తంగా మూడు దఫాల్లో.. 4 లక్షల 95 వేల మందికి మంచి జరిగింది
- రూ.1877 కోట్ల రూపాయలు వైఎస్సార్ ఈబీసీ పథకం ద్వారా మాత్రమే మంచి చేయగలిగాం
- కొత్తగా 65 వేల మంది ఈ సాయం అందుకుంటున్నారు
- మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం
- గత ప్రభుత్వానికి మన ప్రభుత్వాని తేడా గమనించండి
- గతంలో ఏ పథకం ఉందో తెలియదు.. ఏ పథకం ఇస్తారో తెలియదు
- మహిళల ఖాతాల్లో చంద్రబాబు ఒక్క రూపాయి కూడా వేయలేదు
- లబ్ధిదారులు ఏ పార్టీకి ఓటేశారో అని కూడా మేం చూడలేదు
- అర్హులైన అన్ని వర్గాల వారికి పథకాలు అందజేస్తున్నాం
- ఆర్థికంగా వెనుకబడిన ఓబీసీలను ఆదుకున్నాం
- చంద్రబాబు పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు ఆయన చేసిన వంచన గుర్తొస్తుంది
- పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు చేసిన దగా గుర్తొస్తుంది
- చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క మంచి గుర్తుకు రాదు
- ఒక్క పథకం కూడా గుర్తుకు రాదు
- దత్తపుత్రుడి పేరు చెబితే.. అక్కాచెల్లెమ్మలకు వివాహ వ్యవస్థను భ్రష్టుపట్టించిన మోసగాడు గుర్తొస్తాడు
- ఐదేళ్లకొకసారి కార్లను మార్చేసినట్లు భార్యలను మార్చే ఓ మ్యారేజ్ స్టార్ గుర్తొస్తాడు
- ఒకరికి విశ్వసనీయత.. మరొకరికి విలువలు లేవు
- ఇలాంటి వీళ్లు మూడు పార్టీలుగా.. కూటమిగా మీ బిడ్డ మీదకు యుద్ధానికి వస్తున్నారు
- కాదు కాదు.. మీ బిడ్డ మీదకు కాదు.. పేదల వాడి భవిష్యత్తు మీదకు యుద్ధంగా వస్తున్నారు
- 2014లో ఇదే ముగ్గురు ఒక కూటమిగా మన ముందుకు వచ్చారు
- ఇదే పవన్, దత్తపుత్రుడు బీజేపీతో కలిసి ఇప్పుడు చెబుతున్నట్లే.. అప్పుడు మోసపూరిత హామీలు ఇచ్చారు
- వాగ్దానాలపై చంద్రబాబు సంతకం పెట్టి మరీ మోసం చేశారు
- చంద్రబాబు.. గత ఎన్నికల్లో ఒక్క మేనిఫెస్టో హామీ అయినా అమలు చేశారా?
- 2014లో మోసపూరిత హామీలు ఇచ్చారు
- మళ్లీ ఇప్పుడు పవన్, చంద్రబాబు, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి
- మళ్లీ మోసం చేసందుకు ప్రతీ ఇంటికి కేజీ బంగారం, బెంజికార్ ఇస్తామంటారు
- రాబోయే రోజుల్లో మరిన్ని మోసాలతో ముందుకు వస్తారు
- ఈ యుద్ధంలో నాకు మోసం చేయడం చేతకాదు
- రాబోయే రోజుల్లో మోసాలు అబద్ధాలు మరిన్ని చెబుతారు
- వాళ్లకు గుణపాఠం చెప్పేందుకు ఓటు అనే దివ్యాస్త్రం ప్రయోగించండి
- ఎన్నికల కోడ్ మరో మూడు నాలుగు రోజుల్లో రాబోతోంది
- బటన్ నొక్కే కార్యక్రమం పూర్తి చేసేశాం
- డబ్బు జమ కావడం కొంచెం ఆలస్యం కావొచ్చు
- వారం అటు ఇటుగా జరుగుతుంది
- ప్రతీ ఒక్కరికీ డబ్బులు చేరతాయి
- ఈ రెండువారాల పాటు ఓ ఈనాడు చదవొద్దు.. ఆంధ్రజ్యోతి చూడొద్దు.. టీవీ5 చూడొద్దు
- ఆటోమేటిక్‌గా డబ్బులు పడతాయి
- ఈ యుద్ధం చెడిపోయిన మీడియ వ్యవస్థతో కూడా
- మంచి జరిగినా కూడా కుళ్లిపోయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తో కూడా యుద్ధం చేస్తున్నాం
- దేవుడి దయతో.. ప్రజలకు మరింత మంచి చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నా
- ఒక జగనన్న సీఎంగా ముఖ్యమంత్రిగా ఉంటే మంచి జరుగుతుందని గుర్తు పెట్టుకోండి
- ఇక్కడి టీడీపీ అభ్యర్థి ధనికుడు.. రామిరెడ్డికి అంతస్తోమత లేదు
- వాళ్లు డబ్బులు ఇస్తే తీసుకోండి.. కానీ, ఓటు బటన్ నొక్కేటప్పుడు రామిరెడ్డి అన్నకు ఓటేయండి
- రామిరెడ్డికి ఓటేస్తే.. జగనన్న ముఖ్యమంత్రి అవుతాడని గుర్తుపెట్టుకోండి
- కాబట్టి జగన్‌ను సీఎం చేయాలంటే రామిరెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది
- పేదల భవిష్యత్తు మారాలన్నా..
- అవ్వాతాతల పెన్షన్ ఇంటికే చేరాలన్నా..
- అక్కచెల్లెమ్మల పిల్ల చదువులు గొప్పగా సాగాలన్నా..
- రైతన్నల ముఖంలో ఆనందం చూడాలన్నా..
- వ్యవసాయం ఒక పద్ధతిగా జరగాలన్నా.. బటన్‌నొక్కడం నేరుగా ఖాతాల్లో డబ్బు పడాలన్నా.. ఒక వలంటీర్ వ్యవస్థ ఉండాలన్నా..
- కేవలం ఒక్క మీ బిడ్డ పాలనలో జరుగుతాయని మరిచిపోవద్దు
- పొరపాటు జరిగితే.. అన్నింటికి తెరపడుతుంది
- గ్రామాల్లో లంచాలు వివక్ష వస్తాయి
- పేదల బతుకులు, చదువులు కూడా ఆవిరైపోతాయి.. అంధకారం అయిపోతాయి.. అన్యాయం అయిపోయే పరిస్థితి వస్తుందని గుర్తు ఎరగమని సెలవు తీసుకుంటున్నా..
- ఇదే బనగానపల్లెలో ఇళ్లు స్థలాలు ఇస్తే.. ఇదే జనార్థన్‌రెడ్డి కోర్టుకు పోయారు
- ఇంటి స్థలాలు ఇస్తే సీఎం జగన్‌కు, రామిరెడ్డికి మంచి పేరు వస్తుందనే ఇదంతా
- ప్రస్తుతం ఈ వ్యవహారంలో మన ప్రభుత్వం కోర్టుల్లో యుద్ధం చేయాల్సి వస్తోంది
- 3,200 కుటుంబాలకు త్వరలో శుభవార్త వింటామని కోరుకుంటున్నా
- మీ బిడ్డ మీకు ఎప్పుడూ మంచి చేసేందుకు అండగా ఉంటాడు
01:04 PM, Mar 14th, 2024
గాజువాకలో జనసేనకు నిరాశ
- గాజువాకలో జనసేనకు నిరాశ
- సీటు ఆశించి భంగపడ్డ కోన తాతారావు
- గాజువాక స్థానం పల్లా శ్రీనివాస్ కు కేటాయింపు
- రెండో జాబితాలో కనిపించని ఉమ్మడి విశాఖ జిల్లా సీనియర్ నేతల పేర్లు
- రెండో జాబితాలో గంటా శ్రీనివాసరావుకు బండారు సత్యనారాయణమూర్తికి దక్కని చోటు
- చోడవరంలో బత్తుల తాతయ్య బాబుకు మొండి చేయి
- మాడుగులలో గవిరెడ్డి రామానాయుడుకు, పివిజి కుమార్ కు నిరాశ
- మాడుగుల ఎన్నారై పైల ప్రసాద్ కు అవకాశం
12:50 PM, Mar 14th, 2024
టీడీపీ రెండో జాబితా విడుదల
- అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ రెండో జాబితాను చంద్రబాబు విడుదల చేశారు.
- రెండో జాబితాలో 34 మంది అభ్యర్థుల ప్రకటన
- ఇప్పటి వరకు టీడీపీ నుంచి 94+34 మంది అభ్యర్థుల ప్రకటన
- ఇంకా మిగిలిన 16 స్థానాలు
12:40 PM, Mar 14th, 2024
టీడీపీకి దేవినేని అవినాష్ కౌంటర్
- అభివృధి సంక్షేమం అంటే జగన్ ప్రభుత్వంమే ప్రజలకు గుర్తుకు వస్తుంది.
- కృష్ణలంక ప్రాంతం అంటే వైఎస్సార్సీపీ కంచుకోటగా మారింది
- కృష్ణలంక ప్రాంత వాసుల ఇళ్ళ పట్టాల సమస్య తీర్చిన జగన్
- జగన్ ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతికి విష ప్రచారం చేయటం అలవాటుగా మారింది
- స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఓటమి భయంతోనే దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారు.
- వ్యక్తిగత విమర్శలతో గద్దె రామ్మోహన్ నిజస్వరూపం బయటపడుతోంది
- తూర్పులో ఓడిపోవడానికి సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్యే రామ్మోహన్
- కాల్ మనీ, సెక్స్ రాకెట్, పేకాట రాయుడులా మారినా టీడీపీ ఎమ్మెల్యే రామ్మోహన్
- 650కోట్లతో నియోజకవర్గం అభివృద్ధి చేశానని దమ్ముగా చెప్పుకొగలం
- సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి గద్దెకు లేదు
- గత ఐదేళ్లలో అబద్ధపు ప్రచారాలతో కాలం గడిపారు
- విజయవాడ తూర్పులో టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పని అయిపోయింది
- నీచ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్లు టీడీపీ నేతలు
- ఒక మహిళ తాను పొందిన లబ్ధిపై సంతోషం వ్యక్తం చేస్తే చూసి తట్టుకోలేని టీడీపీ నేతలు
- గీతాంజలి మృతి చెందేలా ట్రోలింగులు పోస్టింగులు చేసిన టీడీపీ నేతలు
- పసి పిల్లలకు తల్లిని లేకుండా చేసింది టీడీపీ నేతలు కాదా?.
- తలకిందులుగా తపస్సు చేసిన నారా లోకేష్ జీవితంలో ఎమ్మెల్యే కాలేడు
- చంద్రబాబుకు గద్దె రామ్మోహన్‌కు వయసు పెరిగినా బుద్ధి లేని వ్యక్తులు
- మహిళ చనిపోతే ఇలా రాద్ధాంతం చేస్తారా? అని నీచపు మాటలు మాట్లాడారు
- చంద్రబాబును సీఎం చేయడానికే పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించారు
- పవన్ కల్యాణ్ ఎంపీగా పోటీ చేస్తున్నానని చెప్పడంతో రాష్ట్రంలోని జనసైనికులు రాజకీయ అనాథలుగా మారారు
- తమ రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని వాపోతున్నారు
- రాష్ట్రంలోని కాపు నేతలు సైతం పవన్‌ను చీదరించుకుంటున్నారు
12:25 PM, Mar 14th, 2024
టీడీపీలో రెండో లిస్ట్ టెన్షన్..
- టీడీపీ రెండో విడత జాబితాపై సీనియర్ల లో టెన్షన్.
- మొదటి విడతలో సీనియర్లకు మొండి చేయి చూపిన బాబు.
- కనీసం సెకండ్ లిస్టులోనైనా తమ పేరు ఉందా లేదా అనే టెన్షన్‌లో సీనియర్లు.
- ఎచ్చెర్ల టిక్కెట్ కోసం కళా వెంకట్రావు
- పెందుర్తి కోసం బండారు సత్యనారాయణమూర్తి.
- రాజమండ్రి రూరల్ కోసం బుచ్చయ్య చౌదరి.
- మైలవరం లేదా పెనమలూరు కోసం దేవినేని ఉమా.
- దెందులూరు టిక్కెట్ కోసం చింతమనేని ప్రభాకర్.
- గురజాల కోసం ఎరపతినేని.
- సర్వేపల్లి స్థానం కోసం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
- ఎమ్మిగనూరు స్థానం కోసం జయ నాగేశ్వరరెడ్డి ఆశలు.
- వీరిలో ఇప్పటికే కొంతమందిని పిలిచి బుజ్జగింపులకు దిగిన బాబు.
- టికెట్ కావాలని పట్టుబడుతున్న సీనియర్లు.
- కొంతమందిని ఎంపీలుగా పంపుతామని అంటున్న బాబు.. ఎమ్మెల్యేగానే పోటీలో ఉంటామని చెప్పిన సీనియర్ నేతలు.
12:10 PM, Mar 14th, 2024
విశాఖ నుంచి పోటీ చేస్తున్నా.. జేడీ లక్ష్మీనారాయణ
- జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటన
- వచ్చే ఎన్నికల్లో విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన
11:50 AM, Mar 14th, 2024
టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ
- టీడీపీలో చేరిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్
- ఉండవల్లిలో సంజీవ్‌కు పసుపు కండువా కప్పిన చంద్రబాబు
- ఇటీవల వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసిన సంజీవ్
11:30 AM, Mar 14th, 2024
బాబు ఇంటికి ఆశావహుల క్యూ
- నేడు టీడీపీ రెండో జాబితా ప్రకటన
- తొలి జాబితాలో 94 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన చంద్రబాబు
- రెండో జాబితాలో 20కిపైగా పేర్లు ప్రకటించే ఛాన్స్
- సీటు దక్కదనే ఆందోళనలో పలువురు
- ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి క్యూ
- ఒకే నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురి మధ్య పోటీ
- ఎవరికి దక్కుతుందో అనే ఆందోళనలో ఆ నేతల అనుచరులు
11:10 AM, Mar 14th, 2024
టీడీపీ నేతల్లో భగ్గుమన్న అసంతృప్తి..
- చంద్రబాబు తీరుపై ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నేతలు గుర్రు.
- టికెట్లు కేటాయించకపోవడంపై అసంతృప్తి.
- కాసేపట్లో అనుచరులతో సమావేశం కానున్న గంటా.
- భీమిలి నియోజకవర్గాన్ని ఆశిస్తున్న గంటా.
- భీమిలి కుదరదు అంటున్న చంద్రబాబు
- బండారుకు పెందుర్తి సీటు నిరాకరణ.
- బండారు ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్న అనుచరులు.
- చంద్రబాబు తీరుపై అయ్యన్న కినుక.
- తన కుమారునికి ఎంపీ సీటు ఇవ్వకపోవడంపై అసంతృప్తి.
10:50 AM, Mar 14th, 2024
పయ్యావుల కేశవ్‌కు విశ్వేశ్వరరెడ్డి కౌంటర్..
- పయ్యావుల కేశవ్‌కు వైఎస్సార్‌సీపీ ఉరవకొండ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కౌంటర్
- టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ఓటమి భయం పట్టుకుంది
- అందుకే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఓటర్లకు చీరలు పంచుతున్నారు
- పయ్యావుల కేశవ్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాను.
- ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెండు కోట్ల రూపాయల విలువైన చీరలు పంచారు
- పయ్యావుల కేశవ్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు
- ఓటమి భయంతో మహిళలకు చీరల పంపిణీ చేస్తున్నారు
- కూటమి ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీదే విజయం
10:15 AM, Mar 14th, 2024
గీతాంజలి కేసులో తొలి అరెస్ట్..
- గీతాంజలి ఆత్మహత్య కేసులో బోండా ఉమా అనుచరుడు పసుమర్తి రాంబాబు అరెస్ట్
- గీతాంజలిపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టిన పసుమర్తి రాంబాబు
- పసుమర్తి రాంబాబును అరెస్ట్ చేసిన తెనాలి పోలీసులు
- రాంబాబును తెనాలికి తీసుకెళ్లిన పోలీసులు
9:30 AM, Mar 14th, 2024
కూటమిపై ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శలు..
- టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై ఎంపీ మిథున్ రెడ్డి విమర్శలు
- జనసేనకు ఇచ్చిన 21 సీట్లలో 11 మంది టీడీపీ అభ్యర్థులే
- బీజేపీ నుంచి పోటీ చేసేవారు కూడా టీడీపీ అభ్యర్థులే
- కాంగ్రెస్ కూడా టీడీపీకి కోవర్ట్‌గా పనిచేస్తోంది.
- చంద్రబాబు మనుషులే అన్ని పార్టీల నుంచి పోటీ చేస్తారు
9:00 AM, Mar 14th, 2024
నేడు జనసేన రెండో విడత జాబితా..
- ఇవాళ రెండో జాబితా విడుదల చేయనున్న జనసేన
- 9 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన జనసేన
- భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, రాజోలు, విశాఖ సౌత్, పెందుర్తి, యలమంచిలి సీట్లకు అభ్యర్థులు ఖరారు
- మొత్తం 21 స్థానాల్లో 15 సీట్లపై క్లారిటీ ఇచ్చిన పవన్ -
- పవన్ పోటీ చేసే స్థానంపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
- మెజార్టీ సీట్లలో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారని జన సైనికుల ఆగ్రహం
- టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇస్తే పొత్తుకు అర్థం ఏముంటుందన్న పార్టీ వర్గాలు
8:20 AM, Mar 14th, 2024
టీడీపీ నేత పయ్యావులకు షాక్..
- టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు చేదు అనుభవం
- ఉరవకొండ నియోజకవర్గంలో ఓటర్లకు చీరల పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
- టీడీపీ నేతల చీరలను తిప్పికొట్టిన మహిళలు
- బెలుగుప్ప, ఉదిరిపికొండ గ్రామాల్లో టీడీపీ చీరలను దగ్ధం చేసిన మహిళలు
- టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చీరలు మాకొద్దంటూ నినాదాలు చేసిన మహిళలు
8:00 AM, Mar 14th, 2024
కాకినాడ
పిఠాపురంలో కొనసాగుతున్న ఫ్లెక్సీల వార్
- పిలిస్తే పలికేవాడు స్థానికుడికే నా ఓటు అంటూ నిన్న పిఠాపురం నియోజకవర్గంలో ఫ్లెక్సీలు
- ఫ్లెక్సీలు టీడీపీ కోఆర్డినేటర్ వర్మ ఏర్పాటు చేయించారని జనసేన అనుమానం
- సోషల్ మీడియాలో ఫ్లెక్సీలకు కౌంటర్ ఇస్తున్న జనసైనికులు
- పవన్ రాకకోసం పిఠాపురం ఎదురు చూస్తుందంటూ పోస్టులు
- పవన్‌కే నా ఓటు అంటూ కౌంటర్ పోస్టులు పెడుతున్న జనసేన
7:30 AM, Mar 14th, 2024
పవన్ నిర్ణయాలపై జనసైనికుల్లో ఆగ్రహం..
- టికెట్ల కేటాయింపుపై జనసేన నాయకుల్లో ఆగ్రహం.
- విశాఖ సౌత్, పెందుర్తి సీట్లు వంశీ, పంచకర్ల రమేష్ బాబుకు కేటాయింపు.
- కొత్తగా వచ్చిన నాయకులకు టికెట్ల ఎలా కేటాయిస్తారు అంటూ అసంతృప్తి.
- వారు పార్టీ కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్.
- పదేళ్లు రాజకీయాలకు దూరంగా వున్న కొణతాలకు సీటు ఇవ్వడంపై మండిపాటు
- తీవ్ర నిరాశలో ఉషా కిరణ్, పంచకర్ల సందీప్ కోన తాతారావు, తమ్మిరెడ్డి శివశంకర్, పీవీఎస్ఎన్ రాజు.
- పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన.
7:10 AM, Mar 14th, 2024
గంటాకు షాకిచ్చిన చంద్రబాబు..
- మాజీమంత్రి గంటా శ్రీనివాస్‌కు షాక్ ఇచ్చిన చంద్రబాబు
- చేస్తే చీపురుపల్లి చెయ్.. లేదంటే పార్టీకి పని చెయ్
- గంటాకు తెగేసి చెప్పిన చంద్రబాబు
- సాయంత్రం చంద్రబాబును కలిసిన మాజీ మంత్రులు గంటా, నారాయణ
- వియ్యంకుడు నారాయణ ద్వారా ఒత్తిడి తెచ్చిన మాజీమంత్రి గంటా
- తనకు విశాఖపట్నం జిల్లాలో సీటు ఇవ్వాలని కోరిన మాజీ మంత్రి.
- చీపురుపల్లి నుండే పోటీ చెయ్యాలని చెప్పిన చంద్రబాబు
- చంద్రబాబు వార్నింగ్‌తో మాజీమంత్రి గంట అసంతృప్తి
- రేపు విశాఖలో తన సన్నిహితులు అనుచరులతో గంటా సమావేశం
- సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
7:00 AM, Mar 14th, 2024
టీడీపీ, జనసేన మధ్య వింత డ్రామా
- జనసేన సీట్లు కూడా టీడీపీ నేతలకే
- టీడీపీ నుండి నేతలను పంపిస్తున్న చంద్రబాబు
- వారినే పార్టీలో చేర్చుకుని సీట్లు ఇస్తున్న పవన్ కల్యాణ్
- నిన్న భీమవరం, నేడు తిరుపతి
- జనసేనలో చేరిన మాజీ ఎమ్మెల్యే అంజిబాబు
- అంజిబాబుకి భీమవరం ఎమ్మెల్యే సీటు ఖరారు చేసిన పవన్ కల్యాణ్
- ఈ రోజు జనసేనలో చేరిన టీడీపీ నేత గంటా నరహరి
- తిరుపతి అసెంబ్లీ సీటు గంట నరహరి కి ఖరారు చేసిన పవన్ కల్యాణ్
- నరసాపురంలోనూ ఇదే పంథా
- టీడీపీ నుంచి జనసేనలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడికి సీటు ఖరారు
- ఇదేం పొత్తు అంటూ పవన్‌పై జనసేన నాయకుల ఆగ్రహం
6:50 AM, Mar 14th, 2024
ఈ నెల 18 నుంచి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం
- ఉత్తరాంధ్ర నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశం
- తొలిరోజు ఇచ్చాపురం, విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్‌లో సీఎం జగన్ ప్రచారం
- రోడ్ షో కూడా ఉండే అవకాశం
- రోజూ రెండు మూడు బహిరంగ సభలు, రోడ్ షోలు ఉండేలా ప్లాన్
- ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలను కవర్ చేసేలా రూట్ మ్యాప్
6:45 AM, Mar 14th, 2024
ఏపీ బీజేపీలో ముసలం
- పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యతపై బీజేపీ సీనియర్లలో అసంతృప్తి
- అనకాపల్లి, ఏలూరు ఎంపీ రేసులో టీడీపీ నుంచి వచ్చిన సీఎం రమేష్, సుజనా చౌదరి పేర్లపై ఆగ్రహం
- నరసాపురం ఎంపీ అభ్యర్ధిగా రఘురామకృష్ణంరాజుని ప్రచారం చేస్తుండటంపైనా తీవ్ర అసంతృప్తి
- అరకుకి కొత్తపల్లి గీత,రాజమండ్రికి పురందేశ్వరి అంటూ ఎల్లో మీడియా లీకులు
- ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై విజయవాడ రాష్ట్ర కార్యాలయంలో సీనియర్ నేతల రహస్య సమావేశం
- కేంద్రంలో అధికారంలో ఉండి తక్కువ సీట్లు తీసుకోవడం సీనియర్లు మండిపాటు
- జీవీఎల్, సోము వీర్రాజు లాంటి సీనియర్ల పేర్లు లేకుండా టీడీపీ కుట్రలపై చర్చిస్తున్న సీనియర్లు
- చంద్రబాబు కోసం పనిచేసే నేతలకి సీట్ల ప్రాధాన్యతపై చర్చ
- పార్టీలో మొదటి నుంచి పనిచేసేవారికి ప్రాధాన్యతనివ్వాలంటున్న సీనియర్లు
6:30 AM, Mar 14th, 2024
పవన్‌కు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్
- పవన్ రాజకీయ అజ్ఞాని
- పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రిని అవుతానన్నాడు
- పొత్తన్నాడు 60 సీట్ల మనవే అన్నాడు
- 60 నుంచి 24 సీట్లకు వచ్చాడు
- ఇప్పుడు 24 నుంచి 21 సీట్లకు వచ్చాడు
- ఆ 21 సీట్లలోనైనా పోటీచేయడానికి అభ్యర్ధులున్నారా?.
- రేపు జరిగే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి జరిగే యుద్ధం
- మంచితనానికి దుర్మార్గులైన చంద్రబాబు, పవన్, బీజేపీకి మధ్య జరిగే యుద్ధం
- ఎన్నికల తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీలను ప్రజలు కృష్ణానదిలో కలిపేయడం ఖాయం
- 2014లో ముగ్గురూ కలిసొచ్చారు.. విడిపోయారు
- మళ్లీ ఇప్పుడు ముగ్గురూ కలిసి వస్తున్నారు
- చంద్రబాబు, పవన్, బీజేపీలకు విలువలు, విశ్వసనీయత లేవు
- లెక్కాలేదు .. తిక్కా లేదు
- చంద్రబాబు కుప్పంలో, లోకేష్ మంగళగిరిలో ఓడిపోతారు
- ఎక్కడ పోటీచేస్తాడో తెలియని పవన్ అసెంబ్లీ గేటు కూడా దాటలేడు
- చంద్రబాబు, పవన్ పనికిరాని వ్యక్తులు.
- యుద్ధంలో పోటీచేయమంటే అస్త్ర సన్యాసం చేసిన వ్యక్తి పవన్
- 175 చోట్లా పోటీచేయమంటే చంద్రబాబు పారిపోయాడు
- కనీసం 50 చోట్లైనా అభ్యర్థులను పెట్టమంటే పవన్ పారిపోయాడు
- టీడీపీ, జనసేన, బీజేపీలకు అడ్రస్ లేకుండా చేస్తాం ఇది రాసిపెట్టుకోండి
- 175 స్థానాల్లో 175 వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తాం
- చంద్రబాబు, పవన్ హైదరాబాద్ పారిపోతారు
- బీజేపీ ఢిల్లీ పారిపోతుంది
- ఏపీలో ఉండే ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ.. ఏకైక నాయకుడు సీఎం జగన్.
Comments
Please login to add a commentAdd a comment