March 16th : ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్ | AP Elections Today Political News Updates And Headlines On March 16th In Telugu - Sakshi
Sakshi News home page

AP Political Updates Mar 16th: ఏపీ పొలిటికల్ అప్‌డేట్స్

Published Sat, Mar 16 2024 7:02 AM | Last Updated on Sat, Mar 16 2024 7:43 PM

Andhra Pradesh Political News Headlines In Telugu On Mar 16th Updates - Sakshi

AP Elections Political Latest Updates Telugu..

7:16 PM, Mar 16th, 2024
కృష్ణాజిల్లా: 

పెనమలూరు టీడీపీలో బోడే ప్రసాద్ తిరుగుబాటు 

  • టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చేసిన చంద్రబాబు
  • రెబల్ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని బోడే ఆలోచన
  • యనమలకుదురులో రెండవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించిన బోడే
  • తనకు ఓటేసి గెలిపించాలంటూ కుటుంబంతో సహా ఇంటింటికీ వెళ్లి అభ్యర్ధిస్తున్న బోడే
  • చంద్రబాబు అన్యాయం చేశాడు..మీరే న్యాయం చేయాలంటూ ప్రజలను ఓట్లడుగుతున్న బోడే
  • ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచి సత్తా చూపిస్తానంటున్న బోడే ప్రసాద్

6:10 PM, Mar 16th, 2024

విజయవాడ

 చంద్రబాబు నివాసంలో రెండో రోజు కొనసాగిన బుజ్జగింపులు

  • తాను కచ్చితం పిఠాపురం నుండి  పోటీ చేసి తీరతానని చెప్పిన వర్మ
  • పొత్తు ధర్మం పాటించాలని చెప్పిన బాబు
  • స్థానికుడీకే టికెట్ ఇవ్వాలని , ఎక్కడినుండో వొచ్చిన వ్యక్తి కి సహరీంచేది లేదని చెప్పిన వర్మ అనుచరులు
  • ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు, కేబినెట్ హోదా ఇస్తామని కార్యకర్తల సమక్షంలో ప్రకటించిన బాబు
  • బాబు హామీతో మెత్తబడ్డ వర్మ

6:06 PM, Mar 16th, 2024
‘మే 13 మేము సిద్ధం’.. సీఎం జగన్‌ ట్వీట్‌

  • ఏపీ ఎన్నికల షెడ్యూల్‌
  • ఏపీలో మే 13వ తేదీన పోలింగ్‌
  • జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌
  • నాల్గో విడతలో ఏపీలో ఎన్నికలు
     

5:15 PM, Mar 16th, 2024

విశాఖ 

మజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి నివాసం వెన్నల పాలెం లో సీట్లు దక్కని టీడీపీ నేతల సమావేశం 

  • పాల్గొన్న చోడవరం  ఇంచార్జ్ బత్తుల తాతయ్య బాబు మాడుగుల  ఇన్చార్జ్ పి వి జి  కుమార్ ఎలమంచిలి ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు అనకాపల్లి టీడీపీ ఇంచార్జ్‌ పీలా గోవింద సత్యనారాయణ.
  • టీడీపీలో కొనసాగాలా ? పార్టీని వీడి వెళ్లాలా అన్న అంశంపై చర్చించినట్లు సమాచారం
  • మరొకసారి చంద్రబాబు నాయుడు డబ్బు ఉన్న వర్గాలకే టికెట్లు ఇవ్వడం పై అసమ్మతినేతల ఆగ్రహం
     

4:27 PM, Mar 16th, 2024
టీడీపీ కంచుకోటలు బద్దలు కొడతాం: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పీవీఎల్ నరసింహారాజు

  • ఉండి నియోజకవర్గంలో ఈసారి ఎగిరేది వైఎస్సార్‌సీపీ జెండానే
  • సంక్షేమం, అభివృద్ధితో మళ్లీ జగన్‌ రావాలని ప్రజలు కోరుకుంటున్నాను
  • సీఎం జగన్‌ ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేశాం
  • సీఎం జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు నూటికి నూరు చేస్తాం అమలయ్యాయి
  • నేను చేసిన కృషికి ఉండి అభ్యర్థిగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కి రుణపడి ఉంటాను
  • సీఎం జగన్‌ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని ఉండి టీడీపీ కంచుకోటలు బద్దలు కొడతాం
  • భారీ మెజారిటీతో ఉండి సీటు కైవసం.. చేసుకుంటాం
  • కులం, మతం ప్రాంతం చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చిన నాయకుడు సీఎం జగన్‌
  • టీడీపీ ఎమ్మెల్యే రామరాజు ఎక్కడా ప్రజల్లోకి వచ్చింది లేదు
  • టీడీపీ వారు సైతం మేము గెలవాలని కోరుకుంటున్నారు

4:11 PM, Mar 16th, 2024
ఏపీ ఎన్నికల షెడ్యూల్‌

  • ఏపీలో మే 13వ తేదీన పోలింగ్‌
  • జూన్‌ 4వ తేదీన కౌంటింగ్‌
  • నాల్గో విడతలో ఏపీలో ఎన్నికలు
  • దేశ వ్యాప్తంగా మోగిన సార్వత్రిక ఎన్నికల నగారా
  • లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • ఏపీ, ఒడిశా, అరుణాచల్‌, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల
  •  దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు
  • ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు  ఒకే విడతలో ఎన్నికలు నిర్వహణ
  • ఈ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహణ
  • షెడ్యూల్‌ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి

4:00 PM, Mar 16th, 2024
రాజకీయంగా నాకు సీఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు: జగ్గంపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్ధి తోట నరసింహం

  • దేశ చరిత్రలో 175 అసెంబ్లీ స్ధానాలు, 25 పార్లమెంటు స్ధానాలకు ఒకేసారి ప్రకటించడం సామాన్య విషయం కాదు
  • జగన్ నాయకత్వంలో మాత్రమే జరిగింది
  • చాలా దమ్ము ధైర్యం ఉంటేనే ఇలా ప్రకటన చేయగలరు
  • 100 శాతం సీట్లు ప్రకటించడం.. అందులో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వడం సామాన్య విషయం కాదు
  • నాకు సీటు ప్రకటించిన సీఎం జగన్‌కు నా కుటుంబం అంతా రుణపడి ఉంటుంది
  • రాజకీయంగా నాకు సిఎం జగన్ పునర్జన్మ ఇచ్చారు.

3:49 PM, Mar 16th, 2024
కర్నూలు జిల్లా: ఎమ్మిగనూరు టీడీపీలో భగ్గుమన్న విభేదాలు

  • ఎమ్మిగనూరు సోమప్ప సర్కిల్‌లో టీడీపీ రెబెల్ అభ్యర్థి మాచాని సోమనాథ్ ధర్నా
  • టీడీపీ టికెట్ బీసీలకు ఇవ్వాలి.. బీసీలకు ఇవ్వని పక్షంలో టీడీపీని ఓడిస్తాం

3:40 PM, Mar 16th, 2024
మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

  • బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు
  • గతం కంటే ఎక్కువ మంది  బీసీ, మైనార్టీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు
  • సీఎం జగన్ నమ్ముకున్న సామాజిక న్యాయమే మళ్లీ ఆయన్ను గెలిపించి సీఎం చేస్తుంది
  • విశ్వసనీయతే ప్రామాణికంగా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి
  • ఇచ్చిన మాట నిలబెట్టుకొలేని చంద్రబాబుకి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న జగన్‌కు మధ్య ఎన్నికల యుద్ధం జరగబోతుంది
  • మాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు
  • మాకు ఢిల్లీ నుంచి ఎవరో వచ్చి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు
  • సినిమా హీరో అసలు అవసరం లేదు
  • నాకు గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్‌కి ధన్యవాదాలు

3:35 PM, Mar 16th, 2024
సీఎం జగన్ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు: మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

  • సీట్ల ప్రకటనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్
  • కాపులను మోసం చేసిన వ్యక్తి పవన్
  • మోదీని, ఆయన కుటుంబాన్ని తిట్టిన వ్యక్తితో పొత్తు ఎలా పెట్టుకున్నారు?
  • రాజకీయల్లో సీఎం జగన్ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు
  • రాజకీయాలు ఎన్నికల సమయంలోనే అని నమ్మే వ్యక్తి జగన్
  • టీడీపీ, జనసేన, బీజేపీ ఏ పార్టీయినా అందరికి సంక్షేమ పథకాలు అందించిన వ్యక్తి జగన్
  • కరోనా కాలంలో చంద్రబాబు, పవన్ హైదరాబాద్ పారిపోతే.. జగన్ ప్రజలను ఆదుకున్నారు
  • సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోండా స్వాతంత్ర్య సమర యోధుల స్థలాలు అక్రమించాడు
  • మళ్లీ గెలిచి లండన్‌లో ఎంజాయ్ చేయలనుకుంటున్నాడు
  • సెంట్రల్‌లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీ సాధిస్తుంది..

3:30 PM, Mar 16th, 2024
పెనమలూరులో మరోసారి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం: మంత్రి జోగి రమేష్

  • పెనమలూరు నుంచి పోటీ చేయడానికి అవకాశమిచ్చిన సీఎం జగన్‌కి ప్రత్యేక కృతజ్ణతలు
  • ఎన్నో రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు పనిచేశారు కానీ ఈ స్ధాయిలో ఎస్సీ, ఎస్టీ, బిసీలకి అవకాశలివ్వలేకపోయారు
  • 77 ఏళ్ల స్చాతంత్ర్య చరిత్రలో తొలిసారిగా ఎస్సీ,ఎస్టీ, బిసీ, మైనార్టీలకి 50 శాతం సీట్లు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దే
  • మా బలహీనవర్గాలన్నీ సిఎం జగన్‌కి ఓటు వేసి రుణం తీర్చుకుంటాం
  • వచ్చే ఎన్నికలలో 25 పార్లమెంట్,  175 అసెంబ్లీ స్ధానాలు గెలవబోతున్నాం
  • సంక్షేమ‌ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు
  • మళ్లీ ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌ని గెలిపించుకోవాలని ప్రజలు డిసైడ్ అయ్యారు
     

2:10 PM, Mar 16th, 2024
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటించిన వైఎస్సార్‌సీపీ

  • శనివారం ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వేదికగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రకటన 
  • 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాల్ని చదివి వినిపించిన ధర్మాన ప్రసాదరావు
  • సామాజిక సమీకరణాలు.. సర్వేల ఆధారంగా సేకరించిన అభ్యర్థుల గెలుపోటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసినట్లు ప్రకటించిన పార్టీ అధిష్టానం.

    YSRCP సిద్ధం : 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా

    YSRCP సిద్ధం : ఎంపీ అభ్యర్థులు వీరే

కూటమికి అభ్యర్థులు దొరకడం లేదు: వరుదు కల్యాణి

  • టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అభ్యర్థులు దొరకడం లేదు.
  • టీడీపీ రెండు జాబితాల్లో చంద్రబాబు బీసీలకు అన్యాయం చేశాడు.
  • తన కులానికి పెద్దపీట వేసుకున్నాడు.
  • వచ్చే ఎన్నికల్లో బీసీలు అంతా చంద్రబాబుకు బుద్ధి చెబుతారు.
  • సీఎం జగన్ చేసిన అభివృద్ధి, ఇచ్చిన సంక్షేమంతో ప్రజలు మరోసారి ఆయనకు పట్టం కడతారు.
  • ఎంతమంది కలిసిన వచ్చినా విజయం మాత్రం వైఎస్సార్‌సీపీదే.

10: 45AM, Mar 16th, 2024
జనసేనలో పీక్‌ స్టేజ్‌కు అసమ్మతి.. 

  • విజయవాడ జనసేనలో అసమ్మతి సెగ.
  • పశ్చిమ నియోజకవర్గం జనసేనకు ఇవ్వాలంటూ నిరసనకు దిగిన వెస్ట్ ఇన్‌ఛార్జ్‌ పోతిన మహేష్, కార్యకర్తలు. 
  • కొద్ది రోజులుగా పొత్తులో బీజేపీకి సిట్ వెళ్ళినట్లు జరుగుతున్న ప్రచారంతో ఆందోళన.
  • పవన్ హామీ ఇచ్చారు సిట్ తనకే ఇవ్వాలి అంటున్న పోతిన మహేష్.
  • పార్టీ నుండి ఎలాంటి స్పష్టత లేకపోవటంతో ఆందోళన బాట పట్టిన నేతలు.
  • పవన్‌ని నమ్మి మోసపోయామని అంటున్న జనసైనికులు.
  • టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని చెపుతున్న జనసైనికులు
     

10:30 AM, Mar 16th, 2024
బీజేపీలో ముదురుతున్న ముసలం.. 

  • ఏలూరు జిల్లా బీజేపీలో ముదురుతున్న ముసలం.
  • రెబల్ అభ్యర్థిగా మారుతున్న బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి.
  • కూటమి పొత్తుకు ఏలూరు జిల్లా పెద్ద దెబ్బ.
  • ఏలూరు ఎంపీ సీటుపై కన్నేసిన టీడీపీ, బీజేపీలోని టీడీపీ నేతలు. 
  • ఆత్మీయ సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి
  • రాజకీయాలంటే కొన్ని కుటుంబాలకేనా.. ఇతరుల పల్లకి మోయటమెనా అన్న గారపాటి చౌదరి
  •  కొల్లేరుకు వలస పక్షులు వస్తున్నట్లు డబ్బు సంచులతో ఏలూరు వస్తున్నారు
  • డబ్బు సంచులతో వచ్చేవారు గెలిస్తే ఢిల్లీలో ఉంటారు.. ఓడితే సర్దుకునిపోతారంటూ వ్యాఖ్యలు
  • ఏలూరు పార్లమెంట్ ఎన్నికల బరిలో తాను ఉంటాను ఉంటాను అంటూ తేల్చి చెప్పిన గారపాటి చౌదరి

10:07 AM, Mar 16th, 2024
మీడియాతో వైఎస్సార్‌సీపీ నేత ముద్రగడ

  • బేషరతుగానే వైఎస్సార్‌సీపీలో చేరా
  • ప్రజలకు సేవ చేయాలనే ఈ నిర్ణయం తీసుకున్నా
  • జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రి చేయాలనే పార్టీలో చేరా
  • దళితుల భిక్షతోనే ఈ స్థాయికి వచ్చా
  • పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో హీరో కావొచ్చు.. 
  • నేను రాజకీయాల్లో హీరోను. 
  • వైఎస్సార్‌సీపీ పార్టీ స్ధాపనలో నేను కూడ ఒక వ్యక్తిని. 
  • దురష్టవశాత్తూ కొన్ని శక్తులు నన్ను దూరం చేశాయి.
  • మళ్ళీ ఇన్నాళ్ళకు పార్టీలో చేరడం ఆనందంగా ఉంది.
  • ఎలాంటి‌ కోరికలు లేకుండా సీఎం జగన్‌కు సేవ చేయాలని ఉంది.
  • మేము సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు.. ఇప్పుడు ఉన్న నటులు పుట్టలేదు.
  • బీసీలు, దళితులు మా కుటుంబానికి మద్దతుగా నిలిచారు
  • ప్రత్తిపాడుకు ఉన్న మర్యాద దేశంలో ఎక్కడా ఉండదు.
  • నేను రాజకీయాల్లో రావడానికి కాపులు కారణం కాదు.
  • రాజకీయాల్లో మొలతాడు లేని వాడు కూడా నాకు చెబుతున్నాడు.
  • కాపులు, దళితుల కోసం ఉద్యమం చేశాను.
  • కిర్లంపూడి స్పరంచ్ పదవులు వస్తే బీసీని గెలిపించాను.
  • నా వర్గాన్ని.. నా మనుషులను కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాను.
  • వాళ్లు సినిమాల్లో హీరో కావచ్చు.. నేను రాజకీయాల్లో హీరోని.
  • సీఎం‌ జగన్ కుటుంబానికి ఓ చరిత్ర ఉంది.
  • ముఖ్యమంత్రి జగన్ దగ్గరకు ఎందుకు వెళ్ళావు.. 
  • మా నాయకుడు దగ్గరకు ఎందుకు వెళ్ళ లేదని పోస్టులు పెడుతున్నారు.
  • నా మీద తప్పుడు పోస్టులు పెడుతున్నారు.
  • మీరా నాకు పాఠాలు నేర్పేది.
  • కాపు ఉద్యమం కోసం సానుభూతిగా ఒక ఉత్తరం రాశారా?
  • మా కుటుబాన్ని చంద్రబాబు అవమానిస్తే.. ఈ ఐదేళ్ళు ఎక్కడ ఉన్నారు.
  • మా మడుగులో దాక్కుని మాట్లాడడం బాగోలేదు.
  • సినిమా వాళ్ళకు ఓటు వేస్తే ఆరు నెలలకు ఒకసారి వస్తారు.
  • ఆరు నెలలకు.. సంవత్సరానికి వచ్చి రాజకీయాలు చేసేద్దాం అంటే ఏలా?
  • జనసేన పార్టీ క్లోజ్ అయిపోతుంది.
  • వేరే పార్టీలో కలవడం కాదు.
  • సినిమా వాళ్ళు రాజకీయ నాయకులను గౌరవించరు.
  • మీ ఇంటికి వస్తే ఏమీ ఇస్తారు.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా వాళ్ళ వ్యవహరం ఉంటుంది
  • గ్రహణం వీడింది కనుకే చంద్రబాబు 2019 ఎన్నికల తరువాత ఇంటికి వెళ్ళి పోయాడు.
  • చంద్రబాబు చేసిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను
  • చంద్రబాబు పతనం చూద్దువు గాని అని భగవంతుడు చెప్పాడు.
  • మరో 30 ఏళ్ళు వైఎస్ జగనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి.
  • పేదల పెన్నిదిగా ఉన్న జగన్‌ను ప్రజలు దీవిస్తారు.
  • పార్టీ ఆదేశాలను శిరసావహిస్తాను. ఏదైనా చేయడానికి సిద్దం
  • 70-80 సీట్లు నుండి పోటీ చేయండి. ముఖ్యమంత్రి పదవి తీసుకోండి అని జనసేన నేతలకు చెప్పాను.
  • మీరు తీసుకునే 20 సీట్ల కోసం నన్ను లాక్కండి అని చెప్పాను.
  • చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత టీడీపీ గ్రాఫ్ పడిపోయింది.
  • బీజేపీ నేతలు కూడా నన్ను ఫోన్ ద్వారా సంప్రదించారు.
  • 175 స్ధానాలు పోటీ చేయండి అని అడిగాను. 
  • స్టీల్ ప్లాంట్, పోలవరం కోసం అడిగాను
  • నేనెప్పుడూ పవన్‌కు సలహ ఇవ్వలేదు.
  • నా‌ ముఖం ఆయన.. ఆయన ముఖం నేను ఎప్పుడు చూడలేదు.

7:45 AM, Mar 16th, 2024
టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి..

  • ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు
  • బండారు సత్యనారాయణ, గండి బాబ్జికి  టికెట్ దక్కక పోవడంతో పార్టీ శ్రేణుల్లో నిరాశ
  • ఇద్దరు నేతలను బుజ్జిగించే యత్నంలో విఫలమైన భరత్ వెలగపూడి, గణబాబు
  • కుటుంబమంతా పార్టీ కోసం శ్రమ పడితే పొత్తు పేరిట మోసం చేశారని బండారు కుటుంబ సభ్యుల ఆగ్రహం
  • పాడేరులో గిడ్డి ఈశ్వరికి టికెట్ దక్కకపోవడంతో నిరసనలు
  • పార్టీ వీడాలని కార్యకర్తల సూచన
  • నేడు రేపో కార్యకర్తలతో సమావేశం కానున్న గిడ్డి ఈశ్వరి

7:10 AM, Mar 16th, 2024
నేడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన..

  • 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలను వెల్లడించనున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
  • ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ప్రకటన 
  • మరోవైపు తుది దశకు చేరుకున్న ఎన్నికల మేనిఫెస్టో  
  • 18 నుంచి ప్రచారం ప్రారంభించే చాన్స్‌
  • వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు రెండు లేదా మూడు బహిరంగ సభలు, రోడ్‌ షోలు 

7:00 AM, Mar 16th, 2024
ఎన్నికల తర్వాత టీడీపీ.. బీజేపీలో విలీనం కాబోతోంది: విజయసాయిరెడ్డి

  • మూడు పార్టీలు కలిసిన తర్వాత వైఎస్సార్‌సీపీ గ్రాఫ్‌ మరింత పెరిగింది
  • వైఎస్సార్‌సీపీ ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు మూడు పార్టీలతో కలిసి వస్తున్నాడు
  • ప్రజలందరికీ నచ్చేలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో ఉండబోతోంది
  • సీఎం జగన్‌ మేనిఫెస్టో ఇస్తే.. తప్పకుండా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది
  • ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా.. మేనిఫోస్టో ఉంటుంది
  • 175కి 175 స్థానాల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం

6:50 AM, Mar 16th, 2024
ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం

  • బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి రాసిన లేఖని వ్యూహాత్మకంగా లీక్ చేసిన సీనియర్లు
  • ఓడే సీట్లనే బీజేపీకి  టీడీపీ కేటాయిస్తోందని లేఖలో పేర్కొన్న సీనియర్లు
  • ఆ సీట్లలో టీడీపీ గతంలో గెలవలేదని లేఖలో పేర్కొన్న సీనియర్లు
  • టీడీపీ నేతలని బీజేపీలోకి పంపి టిక్కెట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సీనియర్లు
  • బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారని ఆరోపణ
  • పార్టీ కోసం పనిచేసిన వారికే టిక్కెట్లు కేటాయించాలన్న సీనియర్లు
  • ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోతే పార్టీకి నష్టమన్న సీనియర్లు

6:40 AM, Mar 16th, 2024
హింసలేని, రీపోలింగ్‌కు ఆస్కారం లేని ఎన్నికలే లక్ష్యంగా ఈసారి ఎన్నికలు నిర్వహణ
ముఖేష్ కుమార్ మీనా,  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి

  • ఎక్కడ హింసాత్మక ఘటనలు జరిగినా ఎస్పీలదే బాధ్యత
  • ఘటనపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఎస్పీలపై చర్యలు తీసుకుంటాం
  • ఎన్నికల కోడ్ అమలు నుంచి పెయిడ్ న్యూస్ పై ప్రత్యేక దృష్టి పెడతాం
  • పార్టీ అనుబంధ ఛానళ్లలో అనుకూల వార్తలు వస్తే ఆ వ్యయాన్ని సదరు పార్టీ, అభ్యర్ధుల ఖాతాల నుంచే చేసిన వ్యయంగా భావిస్తాం
  • ఎంసీఎంసీ కమిటీలు ఈ తరహా వార్తలను, ప్రచారాలను నిశితంగా పరిశీలన చేస్తున్నాయి
  • ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నుంచి 155 ప్రకటనల కోసం ఈసీకి దరఖాస్తుులు వచ్చాయి
  • ఎమ్మెల్యేకు 40 లక్షలు, ఎంపీ అభ్యర్ధికి 95 లక్షల వ్యయాన్ని మాత్రమే ఈసీ ఎన్నికల వ్యయంగా అనుమతించింది
  • నామినేషన్ల చివరి తేదీ నుంచి  అభ్యర్ధుల ఎన్నికల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటాం
  • ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీ ప్రచారంలో పాల్గోనకూడదని సర్వీసు నిబంధనల్లోనే ఉంది
  • అలాంటి ఉదంతాలు వస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం

6:30 AM, Mar 16th, 2024
పెనమలూరు టిక్కెట్ పై చంద్రబాబు నుంచి బోడే ప్రసాద్‌కు దక్కని హామీ

  • సీటిచ్చినా ఇవ్వకపోయినా పోటీచేస్తానని ప్రకటించిన బోడే ప్రసాద్
  • యనమలకుదురు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన బోడే 
  • నేను చంద్రబాబును దేవుడిలా భావించా
  • పెనమలూరులో నాకే అవకాశం కల్పించండని కోరుతున్నా
  • అవకాశం కల్పించకపోతే చంద్రబాబు ఫోటోతో రోడ్డెక్కుతా
  • నా కుటుంబంతో సహా వీధుల్లోనే ఉంటా
  • నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తా
  • పార్టీని నమ్ముకుని నేను అన్ని రకాలుగా దెబ్బతిన్నా
  • నా అవసరం పార్టీకి ఏ రకంగా లేదో సమాధానం చెప్పాలి
  • నేను కచ్చితంగా పెనమలూరు నుంచే పోటీ చేస్తా 
  • చంద్రబాబు నుంచి నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు
  • పార్టీ టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా పోటీచేస్తా 
  • నేను ఏ సింబల్ పై పోటీచేసినా గెలిపించాలని ప్రజలను కోరుతున్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement