
AP Elections Political Latest Updates Telugu..
9:59 PM, Feb 16th, 2024
రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్‌ల ప్రకటన
- పర్చూరు- ఎడం బాలాజీ
- కందుకూరు-కటారి అరవిందా యాదవ్
9:44 PM, Feb 16th, 2024
ఏపీ ఫైబర్‌నెట్ స్కామ్ కేసులో సీఐడీ చార్జ్‌షీట్
- ఏసీబీ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసిన సీఐడీ
- ఏ-1గా చంద్రబాబు, ఏ-2గా వేమూరి హరికృష్ణ పేర్లు చేర్చిన సీఐడీ
7:34 PM, Feb 16th, 2024
విజయవాడ:
ఆత్మస్తుతి పరనిందలా టీడీపీ తీరు : ఎమ్మెల్యే మల్లాది విష్ణు
- ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రభుత్వం పై పనిగట్టుకుని బురద జల్లుతున్నారు
- విధ్యంసం పుస్తకం పేరుతో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు
- చంద్రబాబు,పవన్ దిగజారిపోయి వ్యవహరిస్తున్నారు
- చంద్రబాబు తన గురించి తాను రాసుకున్న మనసులో మాట పుస్తకాన్ని బయటపెట్టాలి
- చంద్రబాబుకు ఇదే నా సవాల్
- చంద్రబాబు ఐదేళ్ల పాలనకు.. వైసీపీ ఐదేళ్లపాలనకు బహిరంగ చర్చకు మేం సిద్ధం
- ఎక్కడ చర్చకు రమ్మన్నా వచ్చేందుకు సిద్ధం
- పథకాలిస్తుంటే ఏపీ శ్రీలంక అయిపోతుందన్నావ్
- ఏ ముఖం పెట్టుకుని ఇప్పుడు ఆరు గ్యారంటీలిస్తానంటున్నావ్
- ప్రజలు నిన్ను నమ్మం బాబు అంటున్నారు
- నీ గురించి గొప్పగా...జగన్ మోహన్ రెడ్డి పై తప్పుగా ప్రచారం చేయిస్తున్నావ్
- బాబు జమానా అవినీతి ఖజానా అని పుస్తకం వేసింది సీపీఐ కాదా
- జగన్ మోహన్ రెడ్డి పై బురద జల్లడానికే విధ్వంసం పుస్తకాన్ని తెచ్చారు
- జగన్ మోహన్ రెడ్డిని ఢీకొట్టే సత్తాలేక బాబు ఇతర పార్టీలను కలుపుకుంటున్నాడు
- కుర్చీకోసం పాకులాడటం తప్ప...ప్రజలకు మేలు జరగాలనే ఆలోచన మీకులేదు
- ఐదేళ్లలో విజయవాడ నగరానికి ఒక్క మంచి పనైనా చేశావా
- విజయవాడ అభివృద్ధి పై చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి
- పరిపాలనకు మీరు పనికిరారని ప్రజలు 2019లో మిమ్మల్ని విధ్వంసం చేశారు
- తప్పుడు సంకేతాలివ్వాలనే టీడీపీ నేతలు ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు
- విధ్వంసం పుస్తకం వెనుక చంద్రబాబు, పవన్, సీపీఐ రామకృష్ణ ఉన్నారు
- మూడు రాజధానులే మాపార్టీ విధానం
- ఏపీలో పొత్తులు తేలాక ఎవరి పై ఎవరు రాళ్లు విసురుతారో...ఎవరి కుర్చీ ఎవరు మడతపెడతారో తేలిపోతుంది
- పొత్తులు ప్రకటించాక మంచి వినోదం మొదలవుతుంది
- ఏపీని మోసం చేసిన పార్టీలే మళ్లీ కలిసి పోటీచేయాలనుకుంటున్నాయి
- చంద్రబాబు,పవన్ ది రెండు నాల్కల ధోరణి
- వాలంటీర్ల పై చంద్రబాబు,పవన్ ఏంమాట్లాడారో.. ఇప్పుడేం మాట్లాడుతున్నారో అంతా గమనిస్తున్నారు
6:56 PM, Feb 16th, 2024
ప్రకాశం
గతం లో సేవ పేరుతో జన్మ భూమి కమిటీలు దోచుకొని తింటే.. ఈ ప్రభుత్వం లో స్వచ్ఛందంగా సేవ చేసిన ఘనత వలంటీర్లది:
మంత్రి ఆదిమూలపు సురేష్
- ఎప్పుడంటే అప్పుడు డోర్ కొడతారు... సంచులు మోసే వాళ్లు అని టిడిపి అంటే వాళ్లే సిగ్గుతో తలదించుకొనేలా ప్రతి రాష్ట్రం వలంటీర్ల వ్యవస్థని పెట్టుకొనే లా చేసిన ఘనత మన రాష్ట్ర వలంటీర్లది
- రాబోయో ఎన్నికలలో మా గెలుపులో మీదే సగం వాట
- మా ప్రభుత్వానికి శత్రువులు లేరు... జష్ట్ రాజకియ ప్రత్యర్దులు మాత్రమే... అందుకే రాజకియాలు చూడకుండా సంక్షేమాలు అందించాం
- గతం లో పచ్చ చొక్కాలేకే సంక్షేమ పథకాలు
6:30PM, Feb 16th, 2024
ఎవరినో సీఎం చేసేందుకు మేం ఎందుకు పని చేయాలి?: విష్ణువర్థన్‌రెడ్డి
- ఏపీలో బీజేపీ అభ్యర్థే సీఎం కావాలి:
- పొత్తుల కోసం మేం వెంపర్లాడటం లేదు
- వేరే పార్టీ వాళ్లను భుజాలపై ఎక్కించుకునే అవసరం మాకు లేదు
- ఎవరినో సీఎం చేసేందుకు మేం ఎందుకు పని చేయాలి?
- బీజేపీకి బలం లేకపోతే మాతో ఎందుకు పొత్తు కోరుకుంటున్నారు?
- డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యం
5:40PM, Feb 16th, 2024
టీడీపీలో టికెట్ల పంచాయతీ
- గుంటూరు జిల్లా పెదకూరపాడు టీడీపీ లో ముసలం
- పెదకూరపాడు టికెట్ పై రచ్చ రచ్చ
- రోడెక్కిన కొమ్మాలపాటి శ్రీధర్ వర్గీయులు
- పెదకూరపాడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశం
5:35PM, Feb 16th, 2024
రఘువీరారెడ్డి పొలిటికల్ బ్రోకర్ : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- అనంతపురం : నాపై ఎలాంటి కేసులు లేవు
- రఘువీరారెడ్డి ఆరోపణలు అర్ధరహితం
- నాపై కేసులు ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
5:28PM, Feb 16th, 2024
విభజించిన వారు ప్రచారానికి వస్తున్నారు..!
- ఈ నెల 26న అనంతపురానికి ప్రియాంక
- అనంతపురం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఈ నెల 26న మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ,
- తెలంగాణ సీఎం రేవంత్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య
- త్వరలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో : రఘువీరారెడ్డి
5:06 PM, Feb 16th, 2024
పొత్తు పొడవండి ప్లీజ్
- మేం పొత్తుకు రెడీ.. మీరు ఓకే అంటే వచ్చేస్తాం
- ఈ నెల 20 తర్వాత ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు, పవన్ రెడీ
- ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఏపీ బీజేపీ ముఖ్యనేతలు
- ఎన్డీయేలో టీడీపీ చేరాలా లేదా అన్నదానిపై పార్టీ పెద్దల సమాలోచనలు
- వచ్చే నెల మొదటి వారం వరకు వేచి చూద్దామన్న యోచనలో బీజేపీ
- టిడిపి, జనసేన నుంచి పెరుగుతున్న ఒత్తిడి
- సీట్ల సర్దుబాటు పై క్లారిటీ ఇవ్వాలంటూ విజ్ఞప్తులు
- ముందు ఎన్డీయేలో చేరండి, తర్వాత సీట్ల సంగతి చూద్దామంటున్న బీజేపీ
4:06 PM, Feb 16th, 2024
పార్లమెంటులో టీడీపీ అసలుందా?
- రాజ్యసభలో సున్నాకు పడిపోనున్న టీడీపీ సంఖ్యాబలం
- లోక్‌సభలో టీడీపీకి మిగిలింది ఒక్కరే
- 2019లో టీడీపీ తరపున గెలిచింది ముగ్గురు
- రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన గల్లా జయదేవ్
- టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నాని
- ప్రస్తుతం టీడీపీకి పార్లమెంటులో మిగిలిన ఏకైక సభ్యుడు రామ్మెహన్
- తెలంగాణలో పోటీకి దిగని తెలుగుదేశం జాతీయ పార్టీ అని ఎలా చెప్పుకోగలదు?
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా వ్యూహం పని చేసింది, రాజ్యసభకు పోటీ చేస్తామని ఎందుకు చెప్పింది?
- ఫలానా వాళ్లు అభ్యర్థులు అంటూ పార్టీలో చర్చ ఎందుకు లేవనెత్తింది?
- ఇంత చేసీ అసలు పోటీకి దిగకుండానే తోక ఎందుకు ముడిచింది?
- 40 ఏళ్లలో తెలుగుదేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అత్యంత అధమస్థాయికి చేరడం ఇప్పుడే కనిష్టం
3:58 PM, Feb 16th, 2024
మొదలయింది జనసేనకు చుక్కల పర్వం
బుచ్చయ్య సిట్టింగ్ ఫిట్టింగ్
- టీడీపీలో సిట్టింగ్ లందరికీ మళ్లీసీట్లు : బుచ్చయ్య చౌదరి
- రెండేళ్ల క్రితమే నిర్ణయం జరిగిపోయింది
- జనసేనకు ఇచ్చే సీట్లలో వాళ్ల సర్దుబాటు వాళ్లిష్టం
- టికెట్లు ఆశించి చాలామంది చేరుతున్నారు
- కానీ, ఒరిజినల్ టీడీపీ లీడర్లకు అన్యాయం జరగదు
- నేను మాత్రం రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేస్తున్నా
3:54 PM, Feb 16th, 2024
అధిష్టానానికి 20 అసెంబ్లీ స్థానాల లిస్టు పంపిన ఏపీ బీజేపీ
- 20 చోట్ల బీజేపీకి క్యాడర్ ఉంది : రాష్ట్ర నాయకత్వం
- ఉమ్మడి కర్నూలు మినహా మిగతా జిల్లాల్లో పోటీకి బీజేపీ ఆసక్తి
- నియోజకవర్గాల పేర్లు సూచిస్తూ హైకమాండ్ కు ఏపీ బీజేపీ రిపోర్ట్
- తూర్పుగోదావరిలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 4 సీట్లు కోరుతోన్న బీజేపీ
- నెల్లూరులో 2, కడపలో 1, చిత్తూరులో 2, పశ్చిమగోదావరిలో 2 సీట్లు
- శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్కటి చొప్పున డిమాండ్
3:38 PM, Feb 16th, 2024
ఎన్టీఆర్ జిల్లా:
తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ చీప్ పాలిటిక్స్‌పై వైఎస్సార్‌సీపీ నేతలు ఫైర్
- కృష్ణాజలాల పేరుతో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు రాజకీయం చేస్తున్నాడు
- ప్రభుత్వం ఏ.కొండూరు మండలంలో కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో కృష్ణాజలాలు నిత్యం సరఫరా చేస్తున్నాం
- 49 కోట్లతో కుదప నుండి ప్రతి గ్రామానికి పైపులైన్ నిర్మాణ పనులు చేపట్టాం
- టెక్నికల్ గా మాత్రమే నీటి సరఫరా ఆగింది..టీడీపీ ఆరోపణల్లో వాస్తవం లేదు
- మండల కేంద్రంలో మినీ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం
- 52 లక్షలతో ల్యాబ్ నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి
- కిడ్నీ బాధితులకు ఉచిత మందులు,10 వేలు పింఛన్లు,సంక్షేమ పథకాలు ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం అండగా ఉంది
-భూక్యా గనియా , జడ్పీటీసీ - తిరువూరు నియోజకవర్గంలో వలస వాదులు ఇబ్బడి ముబ్బడిగా వచ్చారు...పోయారు
- కొలికపూడి కూడా ఒక వలస నాయకుడే
- అమరావతి జేఏసీ కన్వీనర్ గా మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లో అక్కడ పోరాడండి ...తిరువూరులో కాదు
- కొలికపూడి శ్రీనివాసరావుకు స్థానిక స్థితిగతుల పై అవగాహన లేక మాట్లాడుతున్నాడు
-నరెడ్డ వీరారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు
3:07 PM, Feb 16th, 2024
కర్నూలు.
పక్క రాష్ట్రాల్లో తరిమేసిన వారిని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా చేశారు:
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి
- రాయలసీమకు నీరు ఇవ్వకూడదని తెలంగాణ అసెంబ్లీ లో చెప్పిన సీఎంని తెచ్చి తిరుపతిలో మేనిఫెస్టో విడుదల చేస్తారట
- రాష్ట్రంలో షర్మిలని అద్దెకు తెచ్చి పీసీపీ అధ్యక్షురాలిని చేశారు
- ఆంధ్ర ద్రోహులను తెచ్చి ఏపీపై దండెత్తుతారా.. ఏపీలో పీసీపీ అధ్యక్ష పదవికి అర్హులు లేరా?
- రాయలసీమ, ఆంధ్ర ప్రాజెక్టులపై వేసిన కేసులు ఉపసంహరించుకోవాలని ఏపీ పీసీసీ.. తెలంగాణ కాంగ్రెస్‌ని కోరాలి.
3:04 PM, Feb 16th, 2024
విశాఖ జనసేన నేత వంశీకృష్ణపై ఎంపీ ఎంవీవీ ధ్వజం
- వంశీ వైఎస్సార్‌సీపీకి వెన్నుపోటు పొడిచారు
- విశాఖలో వంశీపై చెక్ బౌన్స్ కేసులున్నాయి
- సీటు లేక వంశీ ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు
- వంశీలా నేను చిల్లర వ్యక్తిని కాదు
3:00 PM, Feb 16th, 2024
పవన్ కళ్యాణ్‌పై అడపా శేషు ఫైర్
- పవన్‌కు సిద్ధాంతాలు.. విలువలు లేవు
- ఐవీ కృష్ణారావు రాజధాని భూముల పై పుస్తకం రాసినప్పుడు పవన్ ఏం మాట్లాడాడో గుర్తుచేసుకోవాలి
- రాజధాని పేరుతో ఒక సామాజికవర్గం భూములు దోపిడీ చేస్తుందని మాట్లాడిన మాటలు మర్చిపోయావా పవన్
- దోపిడీని అరికడతానని చెప్పి చంద్రబాబు పంచన చేరావా పవన్
- చంద్రబాబు చేసిన దుర్మార్గాల పై నువ్వు ఏం మాట్లాడావో మర్చిపోయావా పవన్
- చంద్రబాబు , లోకేష్‌పై నువ్వెంత నీచంగా మాట్లాడావో మర్చిపోయావా పవన్
- చంద్రబాబు దోపిడీ దొంగల ముఠాకు నాయకుడివి అన్నావ్ గుర్తులేదా పవన్
- పవన్‌కు తన మాట మీద నిలకడ లేదు
- కాపులను చంద్రబాబుకు తాకట్టుపెట్టడానికి తప్ప నువ్వు దేనికీ పనికిరావు పవన్
- ఏం సాధిద్ధామని చంద్రబాబు పంచన చేరావ్ పవన్
- కాపులను ఎలా బేరం పెట్టావో అందరూ చూస్తున్నారు
- అడుక్కోవద్దు...శాసించు అని హరిరామ జోగయ్య చెప్పింది వినిపించలేదా పవన్
- చంద్రబాబు నీకెన్ని సీట్లిస్తాడు..అందులో నువ్వెన్ని కాపులకు ఇస్తున్నావో చెప్పు పవన్
- నీకు దమ్ము ధైర్యం ఉంటే హరిరామజోగయ్య లేఖలో చెప్పిన పేర్లన్నీ ప్రకటించు
- పవన్ నువ్వు క్లాస్ గా కమ్మగా ఉన్నావని ప్రజలందరీకీ తెలుసు
- పేద, బడుగు, బలహీన వర్గాల మాస్ లీడర్ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
2:40 PM, Feb 16th, 2024
ఇలాంటి పనులు చేస్తే ప్రజలు కూడా చీదరించుకుంటారు: బాలినేని శ్రీనివాసరెడ్డి
- జగనన్న హౌసింగ్ కాలనీ కోసం గతంలో చూసిన భూములు టీడీపీ కోర్టు కేసులు వేయటం వల్ల ఆగిపోయాయి
- పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకూడదనే దురుద్దేశ్యంతో టీడీపీ నేతలు కావాలనే మళ్లీ మళ్లీ కోర్టుకు వేయించారు
- సీఎం జగన్ ఆదేశాల ప్రకారం ఒంగోలులో భూములు తీసుకున్నాం
- ఒంగోలులో పట్టాలు ఇవ్వకుంటే పోటీ కూడా చేయనని చెప్పా
- సీఎం జగన్ రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు వున్నా నగదు విడుదల చేశారు
- నగదు విడుదల చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు
- ఈరోజు మళ్లీ పట్టాల పంపిణీ ఆపాలని మరోసారి కోర్టులో పిల్ వేశారు
- అర్హులైన పేదలకు అధికారులే పారదర్శకంగా ఎంపిక చేశారు
- భూముల ఎంపికలో కూడా అధికారులే కీలక పాత్ర పోషించారు
- అర్హులైన టీడీపీ వాళ్లకు కూడా పట్టాలు ఇస్తాం
- పట్టాలు ఇవ్వకూడదనే ఉద్దేశ్యంతో ఇలాంటి పనులు చేస్తే ప్రజలు కూడా చీదరించుకుంటారు
- భూముల కొనుగోలులో నాకు ఎకరాకు 8 లక్షలు ఇచ్చారని ఆరోపిస్తున్నారు
- నా మీద ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
- ఎన్ని ప్రయత్నాలు చేసినా చెప్పిన మాట ప్రకారం పట్టాలు ఇస్తాం
- మీకు అంత ఇబ్బందిగా ఉంటే చెప్పండి.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా
- పేద ప్రజలను అన్యాయం చేయాలని చూస్తే సహించం
- ఇలాంటి పనులు చేయటానికి సిగ్గుండాలి
- ఇంటా, బయటా ఇలాంటి వారి వల్ల ఇబ్బందులు పడుతున్నాం
1:50 PM, Feb 16th, 2024
వెలగపూడిపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఫైర్
- నేను భూకబ్జాలు చేశారని అంటున్నారు
- నేను భూకబ్జాలు చేస్తే రుజువులు చూపాలి:
- నేను కల్తీసారా అమ్ముకుని ఈస్థాయికి రాలేదు
- వంగవీటి రంగాను నరికి చంపిన వ్యక్తి వెలగపూడి
- రంగాను వెలగపూడి ఎలా చంపారో ఆధారాలు బయటపెడతాను
1:00 PM, Feb 16th, 2024
AP: రాజ్యసభ సభ్యుల నామినేషన్లు పరిశీలన పూర్తి
- ముగ్గురు వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు ఆమోదం
- వై వి సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి నామినేషన్లు ఆమోదం
- ఎమ్మెల్యేలు సంతకాలు లేకుండా వేసిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్ తిరస్కరణ
12:45 PM, Feb 16th, 2024
ఎమ్మెల్సీ వంశీపై మండిపడ్డ వైఎస్సార్‌సీపీ నేతలు
- వంశీకి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాం.
- వంశీ ఒక అవకాశవాది.
- పార్టీలో యాదవులకు సముచిత స్థానం.
12:15 PM, Feb 16th, 2024
విశాఖపై వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
- విశాఖ పరిపాలన రాజధాని అంశంపై కట్టుబడి ఉన్నాం.
- విభజన హామీలు, ప్రత్యేక హోదాపైనే మా పోరాటం.
- రాజధాని గురించి ఇంతకుముందే మాట్లాడాను.. మళ్లీ మాట్లాడటం అనవసరం
- విశాఖ రాజధానిని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం
11:45 AM, Feb 16th, 2024
బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి పవన్: వెల్లంపల్లి శ్రీనివాస్
- పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని.. ఏమాత్రం జ్ఞానం లేదు.
- ఉమెన్ ట్రాఫిక్ జరుగుతుందన్న దుర్మార్గుడు పవన్
- ఈరోజు వలంటీర్లపై దుర్మార్గంగా మాట్లాడటం అజ్ఞానితనమే
- పవన్ రోజుకు ఒక రాజకీయం చేసే వారాల అబ్బాయి
- డేటా చోరీ జరుగుతుందని పవన్ మళ్లీ కొత్త రాగం
- చంద్రబాబు కార్యకర్తలు కండువాలు వేసుకొని ప్రజల వద్దకు వెళ్లి డేటా అడుగుతుంటే నీకు కనపడలేదా?.
- పథకాలు అందించేందుకు సమాచారం తీసుకుంటే దానిని పవన్ తప్పుగా వక్రీకరిస్తున్నాడు.
- టీడీపీ కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి OTP అడుగుతుంటే అది తప్పు కాదా?.
- బుద్ధి జ్ఞానం లేని వ్యక్తి పవన్.
- పవన్ వలంటరీ వ్యవస్థపై బురద చల్లడం ఆయన దుర్మార్గానికి నిదర్శనం.
- వలంటరీ వ్యవస్థపై నీకెందుకు అంత దురుసుతత్వం.
- రాష్ట్రంలో మంచి జరగటం పవన్‌కు ఇష్టం లేదు.
- పవన్.. చంద్రబాబుకు తొత్తు.
- మాటమీద నిలకడలేని వ్యక్తి, రాజకీయాలకు పనికివ్యక్తి పవన్.
- పవన్ రాజకీయంగా పదేళ్ల ప్రస్థానంలో ఏం మాట్లాడారో ఆలోచించుకోవాలి.
- రాజధాని రైతుల దగ్గర కూర్చొని పెరుగు అన్నాం తింటాడు.
- హైదరాబాద్ వెళ్లి చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుంటాడు.
- పవన్ ఆయన పార్టీ చాలా దుర్మార్గంగా ఉంది.
11:15 AM, Feb 16th, 2024
టీడీపీ నేత సోమిరెడ్డిపై మంత్రి కాకాణి సీరియస్
- కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ తరలిపోతుందంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి దుష్ప్రచారం.
- వేగంగా అభివృద్ధి చెందుతున్న పోర్టుపై అఖిలపక్షంతో కలిసి అసత్య ఆరోపణలు చేశారు.
- టెర్మినల్ తరలిపోవడం లేదని పూర్తి యాజమాన్యం చెప్పినా.. ఉద్యోగుల్లో అయోమయాన్ని సృష్టించారు.
- కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
- నాలుగువేల కంటైనర్లతో అతి పెద్ద వెజల్ ఇవాళ కృష్ణ పట్నం పోర్టుకు వచ్చింది.
- పోర్టు యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు కంటైనర్ వెస్సెల్‌ను చూశాను.
- పోర్టు మూసేస్తారని మంత్రి సోమిరెడ్డి అభాండాలు వేశారు.
- కృష్ణ పట్నం పోర్టుపై వస్తున్న ఆరోపణలను ప్రజలు నమ్మవద్దు.
10:45 AM, Feb 16th, 2024
జనసేన నేత వంశీపై విశాఖ పీఎస్‌లో ఫిర్యాదు..
- జనసేన నేత ఎమ్మెల్సీ వంశీ వర్సెస్ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
- నిన్న(గురువారం) ఎంవీవీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వంశీ
- ఎంపీపై దాడి చేస్తానని హెచ్చరించిన వంశీ.
- తనను ముఖ్యమంత్రి కూడా కాపాడలేడంటూ ఓవరాక్షన్.
- ఇక, వంశీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఎంపీ సత్యనారాయణ
- పోలీసు స్టేషన్‌లో వంశీపై ఫిర్యాదు చేసిన ఎంవీవీ
10:00 AM, Feb 16th, 2024
సిగ్గులేని పవన్..
- చంద్రబాబు హయాంలో నారా లోకేష్ అడ్డగోలుగా అవినీతి చేశాడని నాడు పవన్ ఆరోపణలు.
- నేడు ప్యాకేజీ తీసుకుని సిగ్గులేకుండా టీడీపీ పల్లకీ మోస్తున్న పవన్.
- బాబు, పవన్ మధ్య లోపాయికారీ ఒప్పందాలు.
- వారి అవసరాల కోసం రాజకీయం చేస్తారు తప్పా.. ప్రజల కోసం కాదు.
9:30 AM, Feb 16th, 2024
నేడు ఏసీబీ కోర్టులో స్కిల్ స్కామ్ కేసు విచారణ..
- లక్ష్మీనారాయణ పిటిషన్‌పై నేడు ఏసీబీ కోర్టులో విచారణ.
- స్కిల్ స్కామ్ కేసులో ఏ2గా మాజీ ఐఏఎస్ లక్ష్మీనారాయణ.
- చంద్రబాబు హయాంలో స్కిల్ కార్పొరేషన్ సలహాదారుగా లక్ష్మీనారాయణ.
- తనను అప్రూవర్‌గా అనుమతించాలని ఇప్పటికే ఏసీఐ ఎండీ పిటిషన్.
- బోగస్ ఇన్వాయిస్‌లతో నిధులు కాజేశారని చంద్రకాంత్ షా పిటిషన్.
- చంద్రకాంత్ పిటిషన్‌లోని రికార్డులను ఇవ్వాలని లక్ష్మీనారాయణ పిల్.
- చంద్రకాంత్ షా స్టేట్‌మెంట్ రికార్డు చేయకుండా ఆధారాలను ఇవ్వాల్సిన అవసరం లేదంటూ సీఐడీ వాదనలు.
8:05 AM, Feb 16th, 2024
ఢిల్లీకి పురంధేశ్వరి..
- నేడు ఢిల్లీకి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి
- బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలలో పాల్గొననున్న పురంధేశ్వరి
- బీజేపీ జాతీయ నాయకులతో భేటీకి ఛాన్స్
- జాతీయ నేతలతో పొత్తులపై చర్చించే అవకాశం
7:45 AM, Feb 16th, 2024
ఏపీ కాంగ్రెస్ మేనిఫెస్టో!
- ఏపీలో ఎన్నికలకు రెడీ అవుతున్న కాంగ్రెస్
- ఈనెల 25న మేనిఫెస్టో విడుదలకు ప్లాన్!
7:20 AM, Feb 16th, 2024
రఘురామ కృష్ణంరాజుకు హైకోర్టు చురకలు
- కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసు
- కోర్టు ప్రొసీడింగ్స్‌పై వ్యాఖ్యలు చేయడం కూడా తెలుసు
- అన్నీ తెలిసే వాస్తవాలను తొక్కిపెట్టి పిల్ వేశారు
- తనపై కేసుల గురించి చెప్పలేదు.. స్పీకర్‌కు ఫిర్యాదు ప్రస్తావనా లేదు.. పైగా తనపై కేసులే లేవని డిక్లరేషన్ ఇచ్చారు
- అన్నీ దాచిపెట్టి దురుద్దేశంతో దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదు
- సీఎం గురించి ఏం మాట్లాడారో వీడియోలను చూడండి
- హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్
- అంగీకరించిన జస్టిస్ దుర్గాప్రసాదరావు ధర్మాసనం
- తదుపరి విచారణ మార్చి 4కు వాయిదా
7:00 AM, Feb 16th, 2024
ఆక్‌పాక్ కరివేపాక్.. అదిరిందయ్య చంద్రం.!
- తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలో గుంభనంగా టీడీపీ, జనసేన
- టీడీపీ క్యాండిడేట్లు వీరేనంటూ ఎల్లో మీడియాలో ఓ జాబితా
- 10 సీట్లకు టీడీపీ, 3 సీట్లలో జనసేన అంటోన్న ఎల్లో మీడియా
- మొత్తం 19 సీట్లకు గాను 13 పేర్లు చెబుతోన్న ఎల్లో మీడియా
- ఈ లెక్కన పవన్ కళ్యాణ్‌ను కరివేపాక్ చేశారంటోన్న జనసేన నాయకులు
- జనసేనకు అంతో ఇంతో బలమున్న ఉభయగోదావరి జిల్లాల్లో ఉన్న సీట్లు 34
- జనసేనను 7 లేదా 8 సీట్లకు పరిమితం చేయాలన్న యోచనలో బాబు
- జనసేనకు ఇచ్చే 25 సీట్లలోనూ మెలిక పెడతారని ప్రచారం
- 10 చోట్ల టీడీపీ నేతలను ముందే జనసేనలోకి పంపి.. గ్లాసు గుర్తుపై పోటీ చేయించడం
- నా మాట వినడం లేదని చెప్పి ఒక 5 నుండి 6 చోట్ల టీడీపీ రెబల్స్‌ను పోటీకి దింపడం
- ఏతావాతా సెప్పొచ్చేదేటంటే... పవన్ వలన కాపు ఓట్లు టీడీపీకి పడి లబ్దిపోందాలి.. కానీ జనసేన బలపడకూడదు
6:45 AM, Feb 16th, 2024
గోదావరి జిల్లాల టూర్ క్యాన్సల్.. అసలు కారణమేంటంటే.?
- పవన్ కళ్యాణ్ ఉమ్మడి గోదావరి జిల్లాల పర్యటన వాయిదా
- మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలోనే ఉన్న పవన్
- పేరుకు హెలిప్యాడ్ అంటూ సాకులు
- 3 గంటల ప్రయాణానికి కారులో ఎందుకు రావడం లేదంటున్న పార్టీ నేతలు
- వారం రోజుల నుంచి తెలుగుదేశం క్యాంపు నుంచి అందని సంకేతాలు
- ఢిల్లీ పర్యటన తర్వాత చంద్రబాబు అయోమయం
- పవన్‌కు ఏ సీట్లు దక్కుతాయో అన్నదానిపై సందేహాలు
- భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి నేతలను మంగళగిరికి రమ్మన్న పవన్ కళ్యాణ్
- వివిధ జిల్లాల ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ వరుస సమావేశాలు
- మూడు రోజుల పాటు సమావేశాల అనంతరం పవన్ ఎక్కడికి వెళ్లాలో నిర్ణయిద్దామంటున్న నేతలు
- అభ్యర్థుల ఎంపికపై పార్టీలో గందరగోళ పరిస్థితులు
- ఎన్ని టికెట్లు ఇస్తారో తెలియని పరిస్థితుల్లో ఎవరికి హామీ ఇస్తామంటోన్న పార్టీ పెద్దలు
6:30 AM, Feb 16th, 2024
వెన్నుపోటు అనేది చంద్రబాబు బ్రాండ్ : గుడివాడ అమర్నాథ్
- విశాఖలో మాట్లాడిన మంత్రి గుడివాడ అమర్నాథ్
- నాకు చంద్రబాబు లాగా కుర్చీ లాక్కునే లక్షణం లేదు
- చంద్రబాబు ఎన్టీఆర్ పదవిని, ఎన్టీఆర్ ట్రస్టును లాక్కున్నారు.
- సీఎం సమీక్షలు నిర్వహించే రూమ్ లో కూర్చున్నాను.
- సీఎం జగన్ మోహన్ రెడ్డి కుర్చీలో నేను కూర్చోలేదు.
- తెలివితక్కువ దద్దమ్ములు టిడీపి నేతలు.
- అసెంబ్లీలో బాలకృష్ణ చంద్రబాబు కుర్చీలో కుర్చున్నారు.
- బాలకృష్ణను ధూళిపాలి నరేంద్ర ప్రశ్నించాలి.
- జగన్ మోహన్ రెడ్డి వద్ద మేము సైనికులం.
- జగన్ అనుకుంటే ఎవ్వరిని ఎక్కడైనా కూర్చోబెడతారు