
AP Elections & Political March 23rd Latest News Telugu..
6:20 PM, March 23rd, 2024
ఢిల్లీ:
బద్వేల్‌లో బయటపడ్డ చంద్రబాబు వెన్నుపోటు రాజకీయం
- బద్వేలు టికెట్టు బీజేపీకి బలవంతంగా అంటగట్టిన బాబు
- అక్కడ తన పార్టీ నాయకుడు రోషన్నను పంపేందుకు గేమ్ ప్లాన్
- నెలరోజులు బీజేపీ కండువా వేసుకుందామని క్యాడర్‌కు నచ్చ చెపుతున్న బద్వేల్ టీడీపీ నేతలు
- ఎన్నికల తర్వాత మళ్లీ టీడీపీ జెండానే పట్టుకోవాలంటున్న బద్వేల్ నేతలు
- గత ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి 20 వేల ఓట్లు తెచ్చుకున్న యువ మోర్చా జాతీయ కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి సురేష్
- ఒరిజినల్ బీజేపీ నాయకులకు అన్యాయం చేస్తున్నారని పురందేశ్వరిపై ఆగ్రహం
- సీఎం రమేష్ ద్వారా టీడీపీ అభ్యర్థులను బీజేపీలోకి పంపి రాజకీయం నడుపుతున్న చంద్రబాబు
- సీఎం రమేష్ చెప్పినట్లుగా హై కమాండ్‌కు పేర్లు పంపుతున్న పురందేశ్వరి
6:17 PM, March 23rd, 2024
విజయవాడ
మహాసేన రాజేష్‌కి చంద్రబాబు వెన్నుపోటు
- పి.గన్నవరం టిక్కెట్ ఇచ్చినట్లే ఇచ్చి వ్యతిరేకత పేరుతో జనసేనకి సీటు కేటాయింపు
- పి.గన్నవరం నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ..
- విజయవాడలో పి.గన్నవరం సీటు ప్రకటించిన పవన్ కళ్యాణ్
- మొదట పి.గన్నవరం సీటు టీడీపీకి కేటాయింపు
- పి.గన్నవరంలో మహాసేన రాజేష్‌ని ప్రకటించిన చంద్రబాబు
- మహాసేన రాజేష్ అభ్యర్దిత్వాన్ని వ్యతిరేకించిన స్ధానిక జనసేన నేతలు
- మహాసేన రాజేష్‌ని పి.గన్నవరంలో పర్యటించకుండా అడ్డుకున్న జనసేన నేతలు
- మహాసేన రాజేష్‌కి టిక్కెట్ ఇవ్వద్దంటూ రాష్ట్రవ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాలు ఆందోళన
- వ్యతిరేకత, ఆందోళనల నేపధ్యంలో పి.గన్నవరం పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు మహాసేన రాజేష్ ప్రకటన
- కొన్మి రోజుల తర్వాత పి.గన్నవరం నుంచే పోటీకి దిగుతానని మహాసేన రాజేష్ ప్రకటన
- ఇదే సమయంలో మహాసేన రాజేష్ కి వెన్నుపోటు పొడిచి పి.గన్నవరం జనసేనకి ఇచ్చిన చంద్రబాబు
- మహాసేన రాజేష్ మిచ వ్యతిరేకంగా ఆందోళనలు చేయించిన గిడ్డి సత్యనారాయణకే జనసేన నుంచి పి.గన్నవరం టిక్కెట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్
- సత్యనారాయణకి నియామక పత్రాలు అందించిన పవన్ కళ్యాణ్
5:30 PM, March 23rd, 2024
టీడీపీ నుంచి జనసేనకు మారిన పి.గన్నవరం టికెట్
- తొలి జాబితాలో పి.గన్నవరం అభ్యర్థిని ప్రకటించిన టీడీపీ
- సరిపెల్ల రాజేష్ ను వ్యతిరేకించిన స్థానిక నేతలు
- రాజేష్ పై వ్యతిరేకతతో జనసేనకు సీటు - గిడ్డి సత్యనారాయణకు టికెట్ కేటాయించిన పవన్
- హైదరాబాద్ లో పోలీసు అధికారిగా పనిచేసిన గిడ్డి
- రెండు నెలల క్రితం జనసేనలో చేరిన గిడ్డి సత్యనారాయణ
4:48 PM, March 23rd, 2024
నిన్న శ్రీదేవి..ఇవ్వాళ పీతల సుజాత
- మెల్లగా తెలుస్తోన్న చంద్రబాబు వెన్నుపోటు నొప్పి
- ఇన్నాళ్లు ఎవరు చెప్పినా వినలేదు
- అబ్బో బాబు గారు అన్నారు
- 40 ఇయర్స్ ప్రతాపం తెలిసిన తర్వాత అమ్మో బాబు అంటున్నారు
ప్రస్తుత రాజకీయాలు- లాయల్టీ,కమిట్మెంట్, హోనెస్ట్ కి విలువ లేకుండా పోతున్నాయి!
— Peethala Sujatha (@SujathaPeethala) March 22, 2024
4:10 PM, March 23rd, 2024
కాకినాడ:
జనసేన పార్టీకి ఒక సిద్దాంతం, ఆశయం లేదు
మాకినీడి శేషుకుమారి, పిఠాపురం జనసేన మాజీ ఇంచార్జ్
- చంద్రబాబును మోయడమే పవన్ సిద్దాంతం.
- సిద్దాంతాలు,భావ జాలంపై పవన్ మాటలు విని జనసేనకు ఆకర్షితమైయ్యాను.
- రాజకీయం అంటే పవన్ సినిమా డైలాగులు..స్ర్కిప్టు చదవడం అనుకుంటున్నారు.
- ప్రజారాజ్యం, టీడీపీ, జనసేన నమ్ముకుని మోసపోయాను
- నా రాజకీయ జీవితం వృదా అయిపోయింది
- జనసేనలో నియంతృత్వ ధోరణీ ఉంది.నాయకుల మద్య సమన్వయం లేదు
- గోదావరి జిల్లాలో నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీని ఎంజాయి చేసి తన ఇమేజ్ ను పెంచుకున్నారు
- నాదెండ్ల మనోహర్, కందుల దుర్గెష్,పంతం నానాజీ జనసేన పార్టీని నాశనం చేశారు
- జనసేనలో నన్ను మానసికంగా క్షోభకు గురిచేశారు
- నేను పడిన క్షోభ కోసం ఏనాడు పవన్ కళ్యాణ్ నాతో మాట్లాడ లేదు
- పిఠాపురంలో కాపులు ఓట్లు వేస్తే గెలిచేస్తాం అనుకోవడం పొరపాటు
- అన్ని కులాలు..మతాలు ఉన్న నియోజకవర్గం పిఠాపురం
- పిఠాపురంలో కాపులు ఉన్నారని పవన్ అనుకున్నప్పుడు.. ఒక కాపు మహిళనైన నాకు ఏం న్యాయం చేశారు
- సిఎం జగన్ ను చూడగానే భావోద్వేగానికి గురయ్యాను
- నాయకుడంటే వైఎస్ జగన్
- వైఎస్ఆర్ బిడ్డ ఇంటే ఇది అనే భావన కలిగింది
- జగన్‌ను చూశాక సరైనా నాయకున్ని.పార్టిని ఎన్నుకున్నాను అని అనిపించింది
- పిఠాపురం ప్రజలతో ఎంతో అనుబంధం ఉన్న వంగా గీతాకు గెలుపు తధ్యం
- రాజకీయంగా ఓటమి ఎరుగని మహిళ నాయకురాలు వంగా గీతా
4:06 PM, March 23rd, 2024
సంధ్య కంపెనీ తప్పు చేసిందని సీబీఐ చెప్పలేదు: టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు
- అడిషనల్ సీఈవోను కలిసిన టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు
- తన పై సోషల్ మీడియాలో ప్రచారంపై అడిషనల్ సీఈవోకు ఫిర్యాదు చేసిన ఎంపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు
- ట్విట్టర్, సోషల్ మీడియాలో నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు
- సీబీఐ విశాఖ పోర్టులో పట్టుకున్న డ్రై ఈస్ట్ ముసుగులో డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నవాళ్లతో నాకు లింక్ పెడుతూ పోస్టింగ్ లు పెడుతున్నారు
- నేను ఆ కంపెనీలో షేర్ హోల్డర్ ని కాదు, భాగస్వామిని కాదు
- సీబీఐ ఆ కంపెనీ తప్పుచేసిందని ఇంకా చెప్పనేలేదు
- వారితో ఉన్న ఫొటోను నాకు జోడించి పెట్టడం ఎంతవరకూ కరెక్ట్ : కృష్ణదేవరాయలు
3:37 PM, March 23rd, 2024
వాలంటీర్ వ్యవస్థను దెబ్బకొట్టడమే లక్ష్యంగా సాగుతున్న ప్రయత్నం
- సీఈవోకు లేఖ రాసిన మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటనల రూటులోనే నిమ్మగడ్డ
- ప్రజలకు జరుగుతున్న మంచిని చూడని వైనం
- వృద్ధులు, వికలాంగుల పట్ల లేని కనికరం
- డబ్బులు చేతికి ఇవ్వొద్దు, అకౌంట్లలో వేయాలి అంటూ సీఈవోకు లేఖ
- అకౌంట్ ఉన్న వాళ్లు తీసుకుంటారు
- అకౌంట్ లేదంటే.. పెన్షనర్లే వెళ్లి డబ్బులు తెచ్చుకుంటారు
- పెన్షనర్ల దగ్గరకు వెళ్లి వాలంటీర్లు డబ్బులు అందించడం వద్దు
- పింఛను పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలి అంటూ లేఖ
2:15 PM, March 23rd, 2024
సీఎం జగన్‌కు సినిమా హీరో కన్నా క్రేజ్ ఎక్కువ: మంత్రి రోజా
- ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని ఎప్పుడు చేద్దామా అని ప్రజలు చూస్తున్నారు.
- ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రతీ హామీ అమలు చేశారు, తండ్రి తగ్గ తనయుడుగా సీఎం జగన్ పాలన అందించారు
- ఏ సినిమా హీరోకు లేని క్రేజ్ సీఎం జగన్‌కు ఉంది.
- 2014లో చంద్రబాబు అండ్ మూడు పార్టీలు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి, రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టారు
- ప్రజల్ని మళ్ళీ మోసం చేసేందుకు మీ ముందుకు వస్తున్నారు
- మేనిఫెస్టోతో సీఎం జగనన్న త్వరలో ప్రజలు ముందుకు రాబోతున్నారు
- 2014లో ప్రత్యేక హోదా తెస్తాం, బాబు వస్తే జాబు వస్తుంది అని మోసం చేశారు.
- జనసేన కూడా టీడీపీ నేతలకే టికెట్ ఇచ్చింది.
1:50 PM, March 23rd, 2024
27న సీఎం జగన్ బస్సు యాత్రలు ప్రారంభం: మంత్రి పెద్దిరెడ్డి
- ఈనెల 27న మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం.
- మార్చి 30న గుత్తిలో బహిరంగ సభ
- ఏప్రిల్ 2న పీలేరులో బహిరంగ సభ.
- ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వచ్చే నెల 2,3 తేదీల్లో బస్సుయాత్ర.
- మూడో తేదీన సాయంత్రం తిరుపతి పార్లమెంట్ పరిధిలో బస్సుయాత్ర.
- తిరుపతి పార్లమెంట్ పరిధిలో శ్రీకాళహస్తి, నాయుడుపేటలో బహిరంగ సభలు.
- చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వచ్చే నెల 3,4 తేదీల్లో మేము సిద్ధం సభలు.
1:30 PM, March 23rd, 2024
టీడీపీ నేతలకు షాకిచ్చిన చంద్రబాబు, నాదెండ్ల
- వర్క్ షాపులో టీడీపీ నేతలకు షాకిచ్చిన చంద్రబాబు, జనసేన మనోహర్
- టిక్కెట్ దక్కిందని సంబరపడుతున్న అభ్యర్ధులకు షాకిచ్చిన చంద్రబాబు
- 25 రోజుల్లో మీ పనితీరుపై మళ్లీ అంచనాలు వేస్తాను.
- సర్వేల్లో అనుకూలంగా రాకపోతే పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తాయని వార్నింగ్ ఇచ్చారు.
- చంద్రబాబు వ్యాఖ్యలతో అభ్యర్ధుల్లో కలవరం
- జనసేన నాదెండ్ల మనోహర్ కామెంట్స్
- జనసేన కార్యకర్తలతో మీరే సమన్వయం చేసుకోవాలి
- ఇబ్బందులు వస్తే అప్పుడు ఇరు పార్టీల అధినాయకత్వంతో చర్చిస్తాం
- మనోహర్ వ్యాఖ్యలపై మండిపడుతున్న టీడీపీ నేతలు
1:05 PM, March 23rd, 2024
చంద్రబాబుకు నిరసన సెగ..
- విజయవాడ పశ్చిమ టిక్కెట్ జలీల్ ఖాన్‌కు కేటాయించాలంటూ మైనార్టీల నిరసన
- ఏ కన్వెన్షన్ హాల్‌లో టీడీపీ వర్క్ షాపునకు హాజరైన చంద్రబాబు
- చంద్రబాబు కాన్వాయ్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసిన జలీల్ ఖాన్ మద్దతుదారులు
- పొత్తుల్లో వెస్ట్ సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం
- మైనార్టీలకే వెస్ట్ సీటు కేటాయించి జలీల్ ఖాన్‌కు టిక్కెట్ ఇవ్వాలంటున్న ఆయన వర్గం
- తనకు టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానంటూ గతంలో హెచ్చరించిన జలీల్ ఖాన్
- జలీల్ ఖాన్ మద్దతుదారుల నిరసనతో ఖంగుతిన్న చంద్రబాబు
12:50 PM, March 23rd, 2024
సీట్లు రాని వారు త్యాగం చేశారు అంతే: చంద్రబాబు
- తెలుగుదేశం అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలి
- రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు పెట్టుకున్నాం
- ఏకైక అభిప్రాయంతో ముందుకు వచ్చింది జనసేన
- పద్ధతి ప్రకారం రాజకీయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్
- రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పొత్తుకు పవన్ ముందుకు వచ్చారు
- జనసేన కార్యకర్తలు కూడా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారు
- పొత్తులో భాగంగా 31 మందికి సీట్లు ఇవ్వలేకపోయాం
- సీట్లు రానివారు కష్టపడలేదని కాదు.. రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నారు
- మూడు పార్టీల పొత్తు తర్వాత చాలా జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక చేశాం
- రాజకీయాల్లో అభ్యర్థుల ఎంపిక అనేది చాలా కీలకం
- అభ్యర్థుల ఎంపికలో తప్పు చేస్తే కొన్ని సీట్లు పోయే ప్రమాదం ఉంది
- సమర్ధులైన వ్యక్తులను ఎంపిక చేయకపోతే ప్రజల ఆమోదం ఉండదు
- డబ్బు సంపాదన ఒక్కటే కాదు సమాజానికి ఉపయోగపడాలన్న ఆలోచన వస్తున్నందుకు ధన్యవాదాలు
- రాబోయే రోజుల్లో డబ్బుతో కాకుండా సేవాభావంతోనే ముందుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి
- ఇవాళ కొంతమందికి సీట్లు ఇవ్వకపోవచ్చు.. వాళ్లు చేసిన త్యాగం నేనెప్పుడూ మరచిపోను
- నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్లు కష్టపడి పని చేశారు
12:30 PM, March 23rd, 2024
పవన్‌ను నమ్మెద్దు పిఠాపురం ప్రజలకు లేఖ
- పిఠాపురం ప్రజలకు లేఖ రాసిన భీమవరం, గాజువాక ప్రజలు
- పవన్‌ను నమ్మెద్దు అంటూ లేఖలో హెచ్చరిక.
- ప్రజలకు దగ్గరగా ఉంటే వ్యక్తుల్నే ఎన్నుకోవాలని భీమవరంవాసుల వినతి.
- పవన్ ఓడిపోతే తిరిగి పిఠాపురంవైపు కూడా చూడరు.
- నిలకడలేని వ్యక్తి రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి లాభం లేదు.
- పొత్తులు పెట్టుకున పవన్ ఏనాడూ మాట మీద నిలబడలేదు.
- ఎన్నికల వేళ సభలతో హడావుడి చేస్తున్నాడు తప్ప ఏమీ ఉండదు అంటూ లేఖ
12:15 PM, March 23rd, 2024
పవన్‌కు అల్లిమేటం జారీ చేసిన పోతిన మహేష్.
- పవన్ కళ్యాణ్‌కు వెస్ట్ జనసేన నేత పోతిన మహేష్ అల్టిమేటం
- నేను నిరంతరం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ కోసమే పనిచేశా
- సొంత పార్టీ నేతలు ఇబ్బంది పెట్టినా ఏనాడూ నోరుమెదపలేదు
- పార్టీ ఏ పదవిచ్చినా బాధ్యతగా నెరవేర్చాను.
- విజయవాడ నగరంలో జనసేనను బలోపేతం చేశాం.
- జనసేన తరపున ఐదేళ్లలో అనేక పోరాటాలు, కార్యక్రమాలు చేశాను.
- నా సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేశాను.
- పశ్చిమ నియోజకవర్గ సీటు నాకే ఇవ్వాలని కోరుతున్నాను.
- పశ్చిమ నియోజకవర్గంలోనే పుట్టాను.. ఇక్కడే పెరిగాను.. జనసేన జెండా పట్టాను.
- నాది దురాశ కాదు.. నా డిమాండ్‌లో న్యాయం, ధర్మం ఉంది
- కచ్చితంగా జనసేన జెండాతోనే పోటీ చేస్తాను.
- నా సీటు విషయంలో పవన్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.
- పార్టీ కోసం కష్టపడిన నాలాంటి వారికి సీటిస్తేనే న్యాయం జరుగుతుంది.
- నా నమ్మకం, విశ్వాసం పవనే.
- నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.
11:50 AM, March 23rd, 2024
ఎల్లో మీడియాపై ద్వారంపూడి ఫైర్
- ఏటిమొగలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఎన్నికల ప్రచారంపై ఎల్లో మీడియా అసత్య కథనాలు.
- తప్పుడు కథనాలను ఖండించిన ద్వారంపూడి
- ఈనాడు, ఏబీఎన్, టీవీ-5కి ద్వారంపూడి ఛాలెంజ్.
- కాకినాడలో ఏ ప్రాంతానికి రమ్మన్నా వస్తాను.
- ఆ ప్రాంతంలో ప్రజలు ఏ సమస్య గురించి అడిగినా వారితో మాట్లాడేందుకు సిద్దం
- గత ఐదేళ్ళలో ఏటిమొగలో మౌళిక సదుపాయాలు కల్పించడంతో పాటుగా పార్క్‌ను నిర్మించాను
- 1800 మందికి ఇళ్ళ స్ధలాలు మంజూరు చేశాను.
- నా ఎన్నికల ప్రచారానికి ఏటిమొగ మత్స్యకారులు బ్రహ్మరధం పట్టారు.
11:35 AM, March 23rd, 2024
కలకలం రేపుతున్న బీజేపీ నేతల ఆడియో క్లిప్స్
- ఏలూరు పార్లమెంటు సీటు టీడీపీకి కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు
- ఏపీ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణాధికారి మధుకర్ జీ కు ఫోన్లు చేసి ప్రశ్నల వర్షం కురిపిస్తున్న ఏలూరు నేతలు
- సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న మధుకర్ జీ తో కార్యకర్తలు జరిపిన సంభాషణలు
- పార్టీ కోసం కష్టపడిన గారపాటి సీతారామాంజనేయ చౌదరికి టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పార్టీ శ్రేణులు
- ఏలూరు బీజేపీలో కనీసం ఖండవాలకు కూడా గతి లేని పరిస్థితిలో ఉన్న పార్టీని ఆదుకున్న వ్యక్తి తపన చౌదరి అంటూ... వాపోతున్న కార్యకర్తలు..
- టీడీపీకి తామ ఊడిగించేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు
- పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండండి లేకుంటే పార్టీ నుండి వెళ్లిపోండి అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసిన మధుకర్ జి
- చంద్రబాబు లాయల్టీ గా ఉంటారని గ్యారెంటీ ఇవ్వగలరా? అంటూ ప్రశ్నించిన కార్యకర్తలు
- పొత్తే వద్దనుకున్న తమకు పొత్తులు కలిపారని వాపోయిన మధుకర్ జి
- తపన చౌదరికి టిక్కెట్ ఇవ్వకుంటే పార్టీ దిక్కుమొక్కు లేకుండా పోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కార్యకర్తలు
- శరీరం బీజేపీలో.. ఆత్మలు టీడీపీలో ఉన్న వ్యక్తులే సహకరిస్తారని తామ సహకరించేది లేదని పార్టీ కి అల్టిమేటం జారీ చేసిన కార్యకర్తలు
11:20 AM, March 23rd, 2024
ప్రారంభమైన TDP వర్క్‌షాప్
- అమరావతిలో టీడీపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్‌షాప్
- ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ
- హాజరైన జనసేన నేత నాదెండ్ల, బీజేపీ నేత పాతూరి నాగభూషణం
11:00 AM, March 23rd, 2024
టీడీపీ గంటా పేరుతో సర్వే కలకలం..
- భీమిలిలో గంటా శ్రీనివాస్ పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే కలకలం.
- గంటా పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహిస్తున్న టీడీపీ.
- సర్వేపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గంటా వ్యతిరేకవర్గం.
- గంటా పేరుతో జరిగే సర్వేలో నోటా బటన్ నొక్కాలని గంటాకు వ్యతిరేక వర్గం ప్రచారం.
- ఇప్పటికే గంటాకు వ్యతిరేకంగా సమావేశమైన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు.
- స్థానికులకే సీటు ఇవ్వాలని డిమాండ్.
10:30 AM, March 23rd, 2024
చంద్రబాబు, లోకేష్‌పై చలసాని కుమార్తె ఫైర్..
- కృష్ణా జిల్లా..
- పెనమలూరు టీడీపీలో ముసలం
- బోడే ప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడంపై చలసాని పండు కుమార్తె స్మిత తీవ్ర అభ్యంతరం
- చంద్రబాబు, లోకేష్‌పై దేవినేని స్మిత ఆగ్రహం
- చంద్రబాబు, లోకేష్ మా కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారు
- 2009లో మా తండ్రి ఓటమికి పార్టీనే కారణం
- సొంత పార్టీ నేతలే నా తండ్రికి వెన్నుపోటు పొడిచారు
- నాతండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారు
- నా మామగారు చనిపోయిన బాధలో ఉన్నా కూడా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టాం
- 2014, 2019లోనూ టిక్కెట్ మాకు ఇవ్వలేదు
- ఈసారి టిక్కెట్ ఇస్తానని లోకేష్ హామీ ఇచ్చారు
- చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేశాను
- బోడే ప్రసాద్‌కు ఏ రకంగా సీటిస్తారు
- గ్రౌండ్ వర్క్ చేసుకునేది మేము.. టిక్కెట్లు లాబీయిస్టులకా?
- ఈసారి మాకు టిక్కెట్ ఇవ్వండని రెండేళ్లుగా అడుగుతున్నాం
- మా నాన్నను గెలిపించుకుంటామని బాబుని కోరాం
- చంద్రబాబు, లోకేష్‌ను అనేక మార్లు టిక్కెట్ కోసం అడిగాం
- టిక్కెట్ ఎందుకు ఇవ్వలేరపోయారో కనీసం పిలిచి కూడా చంద్రబాబు మాకు చెప్పలేదు
- చంద్రబాబు, లోకేష్ అపాయింట్ మెంట్స్ కోసం వేచిచూస్తున్నాను.
- లోకేష్‌కు వాట్సాప్‌లలో మెసేజ్‌లు పెట్టాం
- మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు.. మా మెసేజ్‌లకు ఆన్సర్ చేయడం లేదు
- చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ మేం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశాం
- టిక్కెట్ లేదంటే బోడే ఏడ్చాడు, బ్లాక్ మెయిల్ చేశాడు
- మేం బోడేలా చేయలేదు కదా.. మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా?.
- బోడే ప్రసాద్ లాగా బ్లాక్ మెయిల్ చేసే వారికే చంద్రబాబు టిక్కెట్లిస్తారా?
- నా వెనుక ఎవరూ లేరనేగా ఆడిపిల్లనైన నన్ను ఏడిపిస్తున్నారు.
- మాకు తీవ్ర అన్యాయం జరిగింది.
- మేం చేసిన తప్పేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలి
- విలువలేని పార్టీకోసం మేం ఎందుకు పనిచేయాలి
- చంద్రబాబు సతీమణిలాగే మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నాం.
- త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
10:00 AM, March 23rd, 2024
చంద్రబాబు పై రగిలిపోతున్న బీసీ నేతలు
- అతి తక్కువ సీట్లు ఇవ్వడంపై మండిపాటు
- సీఎం జగన్ ఇచ్చిన ప్రాధాన్యత చూసి తెలుసుకోవాలన్న నేతలు
- చంద్రబాబు బీసీలను నమ్మయించి గొంతు కోసారని ఆవేదన
- బీసీలకు 41 లోక్ సభ..48 అసెంబ్లీ ఇచ్చిన వైస్సార్సీపీ
- బీసీలకు కేవలం 4 ఎంపి, 31 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన టీడీపీ
- ఏలూరులో రోడ్డు ఎక్కి నిరసన తెలుపుతున్న నేతలు
- బీసీలు అధికంగా విశాఖ, నరసరావుపేట, గుంటూరు సీట్ల ను తన సామాజిక వర్గానికి ఇచ్చుకొన్న చంద్రబాబు
- ఏలూరులో పార్టీ కోసం పని చేసిన వాళ్ళను పక్కన పెట్టి పుట్ట మహేష్ యాదవ్ కి ఇవ్వడం పై మండి పడిగా గోపాల్ యాదవ్
9:40 AM, March 23rd, 2024
బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ..
- అల్లూరి జిల్లా పాడేరులో టీడీపీ నేతల వినూత్న నిరసన
- పాడేరు సీటు గిడ్డి ఈశ్వరికి ఇవ్వాలని డిమాండ్
- చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు
- మోదకొండమ్మ తల్లికి 101 బిందెల పసుపు నీళ్లతో అభిషేకం
- పొత్తులో భాగంగా బీజేపీ సీటు ఇవ్వొద్దంటూ నినాదాలు
- బీజేపీకి సీటు ఇస్తే టీడీపీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరిక
9:33 AM, March 23rd, 2024
టీడీపీలో బీసీ మహిళకు ఘోర అవమానం
- శ్రీకాకుళం జిల్లా గుండ అప్పల సూర్య నారాయణ దంపతులకు ఘోర అవమానం
- సీనియర్ నాయకురాలు గుండ లక్ష్మీదేవికి టికెట్ నిరాకరించడంతో తీవ్ర నిరసన జ్వాలలు
- చంద్రబాబు చిత్రపటం, టీడీపి పోస్టర్ లు దగ్ధం
- బుజ్జగించే ప్రయత్నం చేయని చంద్రబాబు, అచ్చెన్నాయుడు
- బీసీ మహిళను అవమాన పరుస్తున్నారంటూ మండిపడుతున్న కేడర్
- పిఠాపురంలో ఇదే తరహా ఘటనలో వర్మను పిలిచి బుజ్జగించిన చంద్రబాబు
- టిక్కెట్లు అమ్ముకున్నారంటూ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులపై ధ్వజం
- 40 ఏళ్లు పార్టీ కోసం కష్టపడిన కుటుంబానికి అవమానకరంగా పక్కన పెట్టడం పై టీడీపీలో సర్వత్రా చర్చ
9:00 AM, March 23rd, 2024
తెలుగు’దేశ’ ముదుర్లు..
- కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేశ్ రూ.30 కోట్లు..
- చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్‌కు ప్యాకేజీ పంపిన బాబు
- కేసుల కోసం బీజేపీతో... కాపుల కోసం జనసేనతో పొత్తు
- 2019లో ఓడిన వెంటనే సీఎం రమేశ్‌ను బీజేపీలోకి పంపిన బాబు
- ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్‌కు రూ.30 కోట్ల నిధులు
- నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం; ఏపీ పీసీసీకి నియామకం
- ఆది నుంచీ జగన్ టార్గెట్‌గానే విమర్శలు; ఇప్పుడు కడపలో పోటీ కూడా?
- పీకే, షర్మిల, పవన్ సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేశ్‌దే
- కుట్రలలో తన రికార్డులను తానే బద్దలుగొడుతున్న నారా వారు
8:35 AM, March 23rd, 2024
ధనబలం ఉన్న వారికే ఎంపీ సీట్లు
- కేశినేని చిన్ని, ఎన్నారై పెమ్మసానికి బెజవాడ, గుంటూరు స్థానాలు
- పార్టీ ఫిరాయించిన లావు, వేమిరెడ్డిలకు నరసరావుపేట, నెల్లూరు
- విశాఖలో జీవీఎల్‌కు బాబు ఝలక్.. బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌కు టికెట్
- ఏలూరు ఎంపీ సీటు యనమల అల్లుడికి కేటాయింపు
- ఎవరూ దొరక్క తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు
- మైలవరం అసెంబ్లీ సీటు వసంతకే.. దేవినేని ఉమాకు షాక్
- ఎట్టకేలకు పెనమలూరు సీటు బోడెకు ఖరారు
- సర్వేపల్లి మళ్లీ సోమిరెడ్డికే
సంబంధిత వార్త కోసం క్లిక్ చేయండి
8:15 AM, March 23rd, 2024
ఔను.. పుష్ప అంటే ఫ్లవరే!
- కమలం పార్టీలో అసలైన బీజేపీ నేతలకు సీట్లు దక్కకుండా బాబు పావులు
- బీజేపీకి ఇచ్చిన సీట్లలో టీడీపీ నేతలు పోటీకి ఏర్పాట్లు.. దాదాపు అన్ని సీట్లు బీజేపీలోని తన అనుంగులకే దక్కేలా వ్యూహం
- సహకరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి!.. ఎక్కడ కుదిరితే అక్కడ పోటీకి సిద్ధమవుతున్న బాబు మనుషులు
- రాయలసీమ నాయకులకు ఉత్తరాంధ్రలో సీట్లు
- పురందేశ్వరి సహా పలువురు జిల్లాల సరిహద్దులు దాటి పోటీకి యత్నాలు
- బాబు ఆటలో జీవీఎల్, సోము వీర్రాజుకు కూడా దక్కని టికెట్లు
- తీవ్ర ఆవేదనలో అసలైన బీజేపీ నాయకులు
7:45 AM, March 23rd, 2024
నేడు టీడీపీ అభ్యర్థులకు వర్క్‌షాప్..
- టీడీపీ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు టీడీపీ వర్క్ షాప్.
- హాజరుకానున్న చంద్రబాబు, 139 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 13 మంది ఎంపీ అభ్యర్థులు, ఇతర నియోజకవర్గాల ఇంచార్జ్‌లు.
- ఈరోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరగనున్న వర్క్ షాప్.
- ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేయనున్న టీడీపీ ఎలక్షన్ టీం.
- ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న చంద్రబాబు.
- జనసేన, బీజేపీ నుంచి వర్క్ షాప్‌నకు హాజరుకానున్న ఇద్దరు ప్రతినిధులు.
7:25 AM, March 23rd, 2024
కేశినేని బ్రదర్స్.. నువ్వా-నేనా
- ఏపీ రాజకీయాల్లో విజయవాడ లోక్‌సభ స్థానానికి ఎంతో ప్రాధాన్యం
- వడ్డే శోభనాద్రీశ్వరరావు, పర్వతనేని ఉపేంద్ర, లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్లు ఇక్కడి నుంచే లోక్‌సభకు
- ఈ ఎన్నికల్లో కేశినేని బ్రదర్స్ ఢీ
- విజయవాడ లోక్‌సభకు టీడీపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పేరు ప్రకటన
- మరోవైపు సిటింగ్ ఎంపీ కేశినేని నాని వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో
- కుటుంబ తగాదాలు వ్యక్తిగత విభేదాలుగా మారి ఇప్పుడు రాజకీయ వైరంగా..
- ఈసారి నువ్వా-నేనా అన్నట్లు పోరు
- ఇద్దరూ సొంత అన్నదమ్ములు.. రెండు ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం
- తీవ్ర చర్చనీయాంశంగా మారబోతున్న విజయవాడ ఎంపీ సీటు ఎలక్షన్
7:15 AM, March 23rd, 2024
టీడీపీపై ఆలపాటి సీరియస్
- సీటు రాకపోవడంపై ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆవేదన
- నాకు ఈ పార్టీ నుంచి విముక్తిని ప్రసాదించమని అధినాయకత్వాన్ని కోరుకుంటున్నాను
- గుంటూరు వెస్ట్‌తో పాటు పెనమలూరు నియోజకవర్గంలో నాపై పార్టీ సర్వే చేయించింది
- గుంటూరు వెస్ట్‌లో 80 శాతం పెనమలూరులో నాకు అనుకూలంగా సర్వే రిపోర్టులు వచ్చాయి
- అయినా పార్టీ అధిష్టానం నాకు టికెట్ ఇవ్వలేదు
- ఇది అత్యంత బాధాకరమైన విషయం
- నేను కార్యకర్తల్లోకి వెళ్ళలేకపోతున్నాను
- నేను సమర్ధుడిని కాదేమో అని కార్యకర్తలను అనుకుంటున్నారు
- చివరకు భార్య మొహం కూడా చూడలేకపోతున్నాను
- ఇలాంటి సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది
- మీరందరూ నా నాయకత్వాన్ని కోరుకుంటే నాయకత్వం వహిస్తా.. లేదంటే లేదు.
7:10 AM, March 23rd, 2024
తిరగబడిన తెలుగు తమ్ముళ్లు..
- శ్రీకాకుళం టీడీపీలో తిరుగుబాటు
- పార్టీ కోసం కష్టపడిన వారికి సీటు ఇవ్వకపోవడంతో టీడీపీ నేతల ఆగ్రహం
శ్రీకాకుళంలో టీడీపీపై తిరగబడిన తెలుగు తమ్ముళ్లు!
— YSR Congress Party (@YSRCParty) March 22, 2024
పార్టీ కోసం పనిచేసిన వాళ్లని పక్కనపెట్టి రూ.కోట్లకి టికెట్లను @naralokesh అమ్ముకున్నాడని ఆగ్రహం
శ్రీకాకుళం ఎమ్మెల్యే టికెట్‌ను గొండు శంకర్‌కి కేటాయించడంతో మండిపడుతూ గుండ లక్ష్మీ వర్గం తిరుగుబాటు. నియోజకవర్గంలో @JaiTDPని ఓడించి… pic.twitter.com/6K2MdvIO7S
7:05 AM, March 23rd, 2024
టీడీపీ, బీజేపీ మధ్య కొనసాగుతున్న టిక్కెట్ల దోబూచులాట
- నాలుగు ఎంపీ స్ధానాలు పెండింగ్‌లో పెట్టిన చంద్రబాబు
- బీజేపీతో పేచీ తేలకపోవడంతోనే ఆయా స్ధానాలు పెండింగ్
- రాజమండ్రి లేదా ఒంగోలు,రాజంపేట, అనంతపురం, కడప స్ధానాల విషయంలో టీడీపీలో అయోమయం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కోసం ఒంగోలు, రాజమండ్రి స్ధానాలు పెండింగ్
- ఈ రెండింటిలో ఒక స్ధానం నుంచి పోటీ చేయడానికి పురందేశ్వరి ప్రయత్నాలు
- రాజంపేట లేదా అనంతపురం స్దానాల కోసం బీజేపీ నేత సత్యకుమార్ ప్రయత్నాలు
- వెంకయ్యనాయుడు పీఏగా సుధీర్ఘకాలం పనిచేసి.. వెంకయ్య ఆశీస్సులతో బీజేపీ జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న సత్యకుమార్
- బీజేపీలో ఉంటూ చంద్రబాబు వాయిస్ వినిపించే సత్యకుమార్ కోసం రాజంపేట, అనంతపురం పెండింగ్
- కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా షర్మిల పోటీచేస్తారనే ప్రచారం
- షర్మిల కోసం కడప స్ధానాన్ని పెండింగ్‌లో పెట్టిన చంద్రబాబు
7:00 AM, March 23rd, 2024
చంద్రబాబుకు పీతల సుజాత కౌంటర్
- టీడీపీలో రాజకీయంపై ఆవేదన
- ప్రస్తుత రాజకీయాలు లాయల్టీ, కమిట్మెంట్, హోనెస్ట్‌కి విలువ లేకుండా పోతున్నాయని కామెంట్స్
- టికెట్ రాకపోవడంతో చంద్రబాబుపై సీరియస్
ప్రస్తుత రాజకీయాలు- లాయల్టీ,కమిట్మెంట్, హోనెస్ట్ కి విలువ లేకుండా పోతున్నాయి!
— Peethala Sujatha (@SujathaPeethala) March 22, 2024
6:50 AM, March 23rd, 2024
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ-జనసేనల మధ్య గందరగోళ పరిస్థితులు
- టీడీపీ-జనసేన అధినేతల వ్యవహార శైలి , సీట్ల ప్రకటనతో మింగుడు పడని ఇరు పార్టీల కేడర్
- పొత్తుల పేరుతో కత్తులు నూరుకుంటున్న ఇరు పార్టీల నేతలు
- జిల్లాలో రగులుతున్న అసంతృప్తి సెగలు
- నరసాపురంలో జనసేన నేత బొమ్మిడి నాయకర్‌కు సీటు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, కొవ్వలి రామ్మోహన్ నాయుడు
- తనకు సమాచారం ఇవ్వకుండా టికెట్ కేటాయించారంటూ అలకబూనిన కొత్తపల్లి సుబ్బారాయుడు
- భీమవరంలో జనసేన అభ్యర్థిని బరిలో దింపకుండా టీడీపీ నుంచి పులపర్తి రామాంజనేయులు చేర్చుకుని టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు
- ఆచంట నియోజకవర్గంలో కొందరు నేతలకే ప్రాధాన్యతఇస్తున్నారంటూ.. జనసేన నేతల్లో వర్గ పోరు
- తణుకు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ మాట ఇచ్చిన సీటు రాకపోవడంతో నైరస్యంలో ఉన్న విడివాడ రామచంద్రరావు..
- తణుకులో టీడీపీ జెండా ఎగరనివ్వనని శపథం పూనిన విడివాడ
- దశాబ్ద కాలంగా పార్టీకి సేవ చేసిన టికెట్ తనకు కేటాయించకపోవడంతో రెబల్ అభ్యర్థిగా బరిలో దిగనున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు
- పోలవరం సీటుపై తేలని పంచాయతీ... టీడీపీ నుండి బొరగం శ్రీనివాస్,లేదా జనసేన నుండి బాలరాజు కేటాయించుకుంటే.. తాము సహకరించబోమన్న కేడర్
- ఇతరుల పేరుతో కొనసాగుతున్న ఐవీఆర్‌ఎస్ సర్వేలు
6:40 AM, March 23rd, 2024
చంద్రబాబు తీరుపై శ్రీకాకుళం టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం
- బాబు ప్రకటించిన మూడో జాబితాపై టీడీపీ కార్యకర్తలు అసంతృప్తి
- మూడవ జాబితాలోని కనిపించని గుండ లక్ష్మీదేవి పేరు
- బాబు తీరుపై శ్రీకాకుళంలోని గుండ లక్ష్మీదేవి అనుచరులు ఆందోళన
- చంద్రబాబు నాయుడు ఫోటోతో పాటు పార్టీ జెండాలు, మేనిఫెస్టో కాల్చి నిరసన తెలిపిన కార్యకర్తలు
- డబ్బు కోసం శ్రీకాకుళం సీటును చంద్రబాబు అమ్ముకున్నాడు అంటూ నిరసన
- మరోవైపు పాతపట్నంలో కలమట వెంకటరమణ అనుచరులు ఆందోళన
- టీడీపీని నమ్ముకుని ఉన్న వాళ్ళని చంద్రబాబు మోసం చేశాడని ఆవేదన
- మామిడి గోవిందరావుకు సీటు ప్రకటించడాన్ని తప్పుపట్టిన టీడీపీ కార్యకర్తలు
- వెంటనే మార్చి సీటు కలవట వెంకటరమణకు ఇవ్వాలని డిమాండ్
- లేనిపక్షంలో టీడీపీకి రాజీనామా చేస్తామని హెచ్చరించిన నాయకులు
- 3వ జాబితాలో ప్రకటించని మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు
- కళా వెంకట్రావుకు ఎచ్చర్లలో వెంటనే సీటు ప్రకటించాలని ఆయన అనుచరులు డిమాండ్
- తీవ్ర నిరాశలో ఉన్న కళా వెంకట్రావు వర్గం
- టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కళా వెంకట్రావు అభిమానులు
- చంద్రబాబు తీరు తమకు చాలా తమకు బాధ కలిగిస్తుందన్న టీడీపీ నాయకులు
- ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా కళా వెంకట్రావు పేరును ప్రకటించాలని డిమాండ్
6:30 AM, March 23rd, 2024
చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు: పేర్ని నాని
- విశాఖ సంఘటనతో భారతదేశం ఉలిక్కిపడింది
- 25 వేల కిలోల మత్తు పదార్థాలని సీబీఐ పట్టుకుంది
- ఆ డ్రగ్స్ లావాదేవీలు జరిపిన సంస్థలు ఎవరో తెలకుండానే చంద్రబాబు మా పార్టీ పై విషం చిమ్మాడు
- సీబీఐ నోరు విప్పకుండానే చంద్రబాబు బయటకొచ్చాడు
- విదేశాలనుంది డ్రగ్స్ అందుకున్నో లు అంత చంద్రబాబు , కుటుంబ సభ్యుల చుట్టలే
- చంద్రబాబు మరిది, వదినకి చుట్టాలే డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారు
- చంద్రబాబు వదిన చుట్టాలు, పిల్లలే ఈ కంపెనీతో సంబంధాలు ఉన్నవాళ్లే
- చంద్రబాబు ఓటు కోసం డ్రగ్స్ పంచేందుకు తెచ్చారేమో అన్న అనుమానం ఉంది
- దీనిలో చంద్రబాబు, లోకేష్‌లపై విచారణ జరపాలని కోరాం
- గతంలో 5 ఏళ్ల కిందట సింగపూర్ మంత్రిని తెచ్చాడు
- ఆ సింగపుర్ మంత్రి జైల్లో ఉన్నాడు
- చంద్రబాబుకి ఇతర దేశాల్లోని మాఫియాలతో అంటకాగిన చరిత్ర ఉంది
- చంద్రబాబు రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు
- ఆ భయంతో నే దీనిపై విచారణ చెయ్యాలి
- ఓటు కోసం టీడీపీ డ్రగ్స్ పంచకుండా అడ్డుకోవాలని ఈసీ ని కోరాం
- దీనిపై చర్యలు తీసుకుంటామని సీఈఓ చెప్పారు
- చంద్రబాబు ట్వీట్ పై కూడా ఫిర్యాదు చేసాము
- అది ఎన్నికల నియమావలికి విరుద్ధం
- తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఈసీ నిబంధనలు ఉన్నాయి
- చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు
- ప్రలోభ పెట్టేందుకు చెక్కులు పంచిపెట్టారు
- దాని మీద ఏం చర్యలు తీసుకున్నారో కోరాం
- దానిపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని అన్నారు
- ఈనాడు పత్రికలో విషంతో వార్తలు రాశారు
- ఈనాడు నిరాధార ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment