
AP Elections Political Latest Updates Telugu..
9:02PM, Jan 28, 2024
చంద్రబాబు, అమరావతి అవినీతిపై భ్రమరావతి కథలు పేరుతో పుస్తకం
- పుస్తకాన్ని ఆవిష్కరించిన అధికార భాషా సంఘం చైర్మన్ విజయ్ బాబు, ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి
- భ్రమరావతి కథలు పుస్తక రచయిత సీనియర్ జర్నలిస్టు అనిల్ గోపరాజు
- తెలుగులో పూర్తి స్థాయి పొలిటికల్ సెటైరికల్‌గా వచ్చిన తొలి పుస్తకం ఇదే కావడం విశేషం
8:12PM, Jan 28, 2024
చంద్రబాబుకు కేశినేని నాని ఓపెన్ ఛాలెంజ్
- విజయవాడలో అంబేద్కర్ గారు ఉన్నారు, నేను ఉన్నా
- నాని మీద నేను గెలుస్తా అంటూ మీడియా ముందు మాట్లాడుతున్నారు
- నేను 3లక్షల ఓట్లతో గెలుస్తున్నా
- కాల్ మనీ గాళ్లు కాదు బస్తీమే సవాల్ ...దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబే నాపై పోటీచేయాలి
- నారా లోకేష్ ఒక పనికి మాలినోడు
- జనవరి 3వ తేదీ చంద్రబాబు నాయుడికి తిరువూరు నియోజకవర్గం సమాధి కట్టింది
- చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరివి
- దానికి మూల కారణం తిరువూరు సంఘటనే
- ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మూసుకున్నా అవమానాలు పడ్డా
- సీఎం జగన్ మమ్మల్ని ఆలింగనం చేసుకుని మీలాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండాలని ఆహ్వానించారు
- కొడుకు లోకేష్ ను సీఎం చేయాలనే అజెండాతో చంద్రబాబు పని చేస్తున్నాడు
- 33 వేల ఎకరాలు రైతుల వద్ద తీసుకుని మోసగించాడు
- అందుకే సొంతిల్లు కూడా కట్టలేదు
- చంద్రబాబు మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నాడు
- జగన్‌మోహన్‌రెడ్డి నిజమైన అంబేద్కర్ వాది
- కొన్ని మీడియాలు అభివృద్ధి లేదంటూ ఘోషిస్తున్నాయి
- ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే అదే మానవ అభివృద్ధి
- మళ్లీ సీఎం జగన్ గెలిస్తేనే పేద వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు
- చంద్రబాబు గెలిస్తే ధనికులు హ్యాపీగా ఉంటారు
6:30PM, Jan 28, 2024
అన్నమయ్య జిల్లా :
రాయచోటిలో నిన్న టీడీపీ ప్లెక్సీలు చింపిన ఘటనలో సాక్షి టీవీకి చిక్కిన ఎక్స్ క్లూజీవ్ సీసీ ఫుటేజీ
- పీలేరు రా.. కదలిరా సభకు స్వాగతం పలుకుతూ..రాయచోటి నుంచి సంబేపల్లి వరకు ప్లెక్సీలే ఏర్పాటు చేసిన రాజంపేట టీడీపీ ఎంపీ అభ్యర్ధి సుగవాసి బాలసుబ్రమణ్యం
- రాత్రికి రాత్రే ఫ్లెక్సీలు చింపిన టీడీపీ సానుభూతి పరుడు అకుల మల్లికార్జున
- బాలసుబ్రమణ్యం తన వ్యక్తిగత సమస్య పరిష్కారంలో వ్యతిరేకంగా వ్యవహరించాడని మల్లికార్జున మనస్తాపం
- కసితో నిన్న ప్లెక్సీలు చించివేసిన మల్లికార్జున
- ఈ నెపాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులపై వేసిన ఎల్లో మీడియా
- టీడీపీ సానుభూతి పరుడే ఫ్లెక్సీలు చంచినట్లు సాక్షికి చిక్కిన ఎక్స్ క్లూజీవ్ విజువల్స్
5:33PM, Jan 28, 2024
మండపేట టీడీపీలో అసంతృప్తి సెగలు
- ఎమ్మెల్యే జోగేశ్వరరావుపై క్యాడర్ అసంతృప్తి
- అభ్యర్థిని మార్చాలని నెక్కంటి బాలకృష్ణ డిమాండ్
- 500 మంది కార్యకర్తలతో నెక్కంటి రహస్య సమావేశం
5:30PM, Jan 28, 2024
రైతులను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారు: మంత్రి కాకాణి
- ఉచిత పంటల బీమా గురించి చంద్రబాబు ఆలోచన చేశారా ?
- చంద్రబాబు సభలకు ప్రజా స్పందన కరువు
- చంద్రబాబును ప్రజలు ఎవరూ నమ్మడం లేదు
- బాబు పాలనలో రైతులు పండించిన పంటను పూర్తిగా అమ్ముకోలేని పరిస్థితి
- వ్యవసాయంపై బహిరంగ చర్చకు రాకుండా చంద్రబాబు తోక ముడిచారు
- బాబు పాలనలో విత్తనాలు అందక రైతులు గుండెపోటుతో చనిపోయారు
- చంద్రబాబు పాలనలో రైతులు అనేక కష్టాలు పడ్డారు : మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
4:36PM, Jan 28, 2024
టీడీపీ మద్దతుదారుల 36 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక
తూర్పుగోదావరి జిల్లా:
- నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం గ్రామం లో హోంమంత్రి తానేటి వనిత సమక్షంలో టీడీపీ మద్దతుదారుల 36 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక
- పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించిన మంత్రి తానేటి వనిత
4:00PM, Jan 28, 2024
ఎల్లో మీడియా డైరెక్షన్‌లో దుష్టులందరూ ఏకమయ్యారు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
- నిరుపేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్‌లో చదవాలని సీఎం జగన్ విద్యావ్యవస్థను బలోపేతం చేశారు.
- రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుంది.
- ఎల్లో మీడియా డైరెక్షన్‌లో దుష్టులందరూ ఏకమయ్యారు. వారికి షర్మిల తోడైంది.
- చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి మరోసారి మోసం చేసేందుకు ప్రజల్లోకి వస్తున్నారు.
- సంక్షేమ పథకాలు అందాలన్నా.. బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా మరోసారి వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాల్సిందే.
- 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఎలా ఉండబోతుందో నిన్నటి సిద్ధం సభే నిదర్శం.
3:30PM, Jan 28, 2024
చంద్రబాబు మోసగాడు: మంత్రి వేణుగోపాలకృష్ణ
- సీఎం జగన్ అంటే నిజం నిజమంటే జగన్
- హామీలన్నింటినీ నెరవేర్చిన వైఎస్ జగన్‌ను మాత్రమే మరోసారి ముఖ్యమంత్రిని చేయాలి
- ఇచ్చిన హామీలను 100% నెరవేర్చిన నాయకుడు జగన్ ఒక్కరే
- అక్క చెల్లెమ్మలను గతంలో చంద్రబాబు మోసం చేశాడు
- నాలుగు దఫాల్లో ఆసరా మొత్తం చెల్లిస్తానన్న సీఎం జగన్ తన హామీ నెరవేర్చుకున్నారు
- రాజమండ్రి రూరల్‌లో సేవకునిగా నన్ను పంపారు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే
2:30PM, Jan 28, 2024
నాకు ఒంగోలు ప్రజల సంక్షేమమే ముఖ్యం: బాలినేని శ్రీనివాస్
- సీఎం జగన్ ఇచ్చిన ప్రతీ మాటను నిలుపుకున్నారు.
- కరోనా వచ్చినా సంక్షేమ పథకాలు ఆగలేదు.
- ఒంగోలులో పేదలకు ఇచ్చిన 25వేల ఇళ్లపట్టాల విషయంలో టీడీపీ కోర్టుకు వెళ్లి ఆపి వేశారు
- పట్టాలు ఇస్తేనే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని సీఎం జగన్‌కి చెప్పాను
- ఇంటి స్థలాలపై ఇప్పుడు కూడా టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారు.
- ఈ సారి కుట్రలు చేస్తే 25వేల మందితో టీడీపీ నాయకుల ఇళ్లను ముట్టడిస్తాం
- వచ్చేనెల పది నుండి 15వ తేదీలోపు పట్టాలు పంపిణీ చేస్తాం
- నాకు ఒంగోలు ప్రజల సంక్షేమమే ముఖ్యం.
- ఒంగోలులో పూరి గుడిసెలు లేకుండా చేయడమే నా లక్ష్యం
2:14PM, Jan 28, 2024
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం
- నాపై మితిమీరి చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు
- నన్ను పాపాల పెద్దిరెడ్డి అంటావా ?
- నీలాగా మామకు వెన్నుపోటు పొడిచానా ?
- చంద్రబాబు నువ్వు అధికారంలోకి రావు
- కనీసం కుప్పం లో కూడా గెలవలేవు
- కుప్పం కు మేము నీరు ఇస్తున్నాం... 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఏమి చేశావ్
- రాజకీయంగా చూసుకోలేక చౌకబారు విమర్శలకు దిగారు
- ఓటమి భయంతో చంద్రబాబు విమర్శలు
01:39 PM, Jan 28, 2024
జనసేన, టీడీపీ ఫ్లెక్సీ వార్
- నారాకోడూరులో రెండు వర్గాల మధ్య వివాదం
- పై స్థాయిలో పొత్తు అంటూ ఊదరగొడుతున్న చంద్రబాబు, పవన్
- క్షేత్ర స్థాయిలో మాత్రం ఆ రెండు పార్టీల నేతలు, కార్యకర్తలకు అసలు పొసగడం లేదు
- టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల మధ్య ఆధిపత్య పోరు కాస్తా ఘర్షణలకు దారితీస్తున్నాయి.
- గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో శనివారం రాత్రి జనసేన, టీడీపీ నేతల ఫ్లెక్సీల రగడే ఇందుకు నిదర్శనం.
- రా...కదలిరా కార్యక్రమంలో వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వరస్వామి దేవస్థాన ప్రాంగణం వద్ద చంద్రబాబు బహిరంగసభ
- ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తుండగా.. నారాకోడూరు కూడలి సెంటర్‌లో ఫ్లెక్సీల ఏర్పాటుపై టీడీపీ, జనసేన నేతల మధ్య వివాదం
- సెంటర్‌లో పవన్ కళ్యాణ్, ఇతర నేతల ఫ్లెక్సీల ఏర్పాటుకు టీడీపీ శ్రేణులు అభ్యంతరం
- చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారి ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలని ఇతరుల కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సహించేదిలేదని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఘర్షణకు దిగారు
- మాతో పొత్తు అంటూ మా నాయకుల ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జనసేన కార్యకర్తలు నిరసన
12:52 PM, Jan 28, 2024
వెలవెలబోయిన చంద్రబాబు సభలు
- చంద్రబాబు పాల్గొన్న పీలేరు, ఉరవకొండ సభలు ప్రజలు లేక వెలవెలబోయాయి.
- ముఖ్యంగా బహిరంగ సభలో కనిపించని మహిళలు, ముస్లిం మైనారిటీలు
- పీలేరులో సభపై స్థానికులు ఆసక్తి చూపలేదు
- దీంతో రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల నుంచి ఏసీ బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు.
- రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, వీరబల్లి, సుండుపల్లె తదితర ప్రాంతాల నుంచి భవన నిర్మాణకూలీలను తరలించారు.
- ఒక్కొకరికి రూ.400 నగదు, బిర్యానీ ప్యాకెట్ ఇవ్వడం బాహాటంగానే కనిపించింది
- ఇదే తరహాలో డబ్బులు ఇచ్చి కేటాయించిన వాహనాల్లో సభకు తీసుకెళ్లారు.
- ఉరవకొండ సభకు వచ్చి మహిళలకు రూ.300, పురుషులకు రూ.250 నగదు, బిర్యానీ పొట్లాలతో పాటు మద్యం కూడా ఆఫర్ చేశారు
- అయినా రెండు సభలకు జనం పెద్దగా రాలేదు
- వచ్చిన వారు కూడా చంద్రబాబు ప్రసంగిస్తుండగానే తిరిగి వెళ్లిపోయారు
- దీంతో కుర్చీలు ఖాళీ అయిపోయాయి
- ఉరవకొండ సభకు వచ్చిన వారు బైపాస్‌రోడ్డు మధ్యలో ఇష్టానుసారం వాహనాలు నిలిపి, మద్యం మత్తులో నృత్యం చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు
- గంటల తరబడి వాహనాలను అడ్డుకున్నారు.
12:16 PM, Jan 28, 2024
చంద్రబాబు నాటకాల రాయుడు: ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్‌రెడ్డి
- చంద్రబాబుకు ఈశ్వరన్ అనే 420 తోడయ్యాడు
- ఈ ఇద్దరూ కలిసి అమరావతి పేరుతో దోచుకోవడానికి ప్లాన్ వేశారు
- సింగపూర్ పేరుతో అమరావతిని చంద్రబాబు నాశనం చేశాడు
- అమరావతి పేరుతో ప్రజలకు భ్రమలు కల్పించాడు
- ప్రకాశం జిల్లాను ఐరన్ హబ్ చేస్తానన్నాడు చేశాడా
- సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పడగానే ఉద్యోగావకాశాలు కల్పించారు
- వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం జగన్ నమ్మారు
- అభివృద్ధి విషయంలో ఎక్కడైనా మేం చర్చకు సిద్ధం
- చంద్రబాబు ఏం చేశాడో.. మేం ఏం చేశామో లెక్కలతో సహా చెబుతాం
11:19 AM, Jan 28, 2024
నెల్లూరు జిల్లా టీడీపీలో వర్గ పోరు
- ఎన్నికల సమయంలో వలస నేతలకు రెడ్ కార్పెట్
- జెండా మోసిన వారికి పార్టీలో అప్రాధాన్యం
- అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తీరు
- పొమ్మనలేక పొగబెడుతున్నారని సీనియర్ల ఆవేదన
- నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర. పద్నాలుగేళ్ల అధికార అనుభవం. ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ జిల్లాలో నేల విడిచి సాము
- అధినేత చంద్రబాబు నాయకత్వంలో రోజురోజుకు పడిపోతున్న ఆ పార్టీ గ్రాఫ్
- దీంతో ఎన్నికలు వచ్చేసరికి పార్టీకి అభ్యర్థులు కరువై పోవడంతో వలస నేతల కోసం అర్రులు చాస్తున్నారు
- కష్టకాలంలో పార్టీని నమ్ముకుని వెన్నంటి ఉన్న వారికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పొగ
- దీంతో జిల్లా టీడీపీ నేతలలో అంతర్మథనం ప్రారంభం
- కష్టకాలంలో ఉన్న వారిని కాదని వలస నేతలకు రెడ్ కార్పెట్ వేయడంపై భగ్గుమంటున్న టీడీపీ నేతలు
10:57 AM, Jan 28, 2024
హంద్రీనీవా ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమే: ఎమ్మెల్యే శంకర్ నారాయణ
- హంద్రీనీవా ప్రాజెక్టు కోసం చంద్రబాబు 9 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్ 6,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనులు పూర్తి చేశారు
- ఉరవకొండ సభలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు
- సాగు నీటి ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసింది టీడీపీ నేతలే
- చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి నీరిచ్చిన ఘనత సీఎం జగన్‌దే
- చంద్రబాబు-కరవు కవల పిల్లలు
- చంద్రబాబు అధికారంలోకి వేస్తే దుర్భిక్షం వస్తుందన్న నమ్మకం రైతుల్లో ఉంది
- రెయిన్ గన్స్ పేరుతో రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదే
- సీఎం జగన్‌ని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదు
10:55 AM, Jan 28, 2024
ఫ్రస్ట్రేషన్‌లో చంద్రబాబు: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
- మరోసారి మోసం చేసేందుకే చంద్రబాబు సభలు పెడుతున్నారు
- చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం రాయలసీమలో కరవు కాటకాలు
- హంద్రీనీవా ప్రాజెక్టు నేనే తెచ్చానంటూ చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు
- హంద్రీనీవా ప్రాజెక్టును 5 టీఎంసీలకు కుదించిన ద్రోహి చంద్రబాబు
- హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత వైఎస్సార్‌దే
- హంద్రీనీవా ప్రాజెక్టును 40 టీఎంసీలకు పెంచిన ఘనత మహానేత వైఎస్సార్‌దే
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం
- టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఓ మోసగాడు
- ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధి కి అడుగడుగునా అడ్డుకున్నారు
10:13 AM, Jan 28, 2024
పొత్తు పటాపంచలే
- పొత్తు ధర్మానికి టీడీపీ తూట్లు పొడుస్తోంది: మాజీ ఎంపీ హరిరామజోగయ్య
- జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది
- ఇలా అయితే జనసేన కేడర్ పవన్ మాట కూడా వినరు
- టీడీపీ పోటీ చేసే స్థానాల్లో వ్యతిరేకంగా పని చేస్తారు
- పొత్తు ఉన్నప్పటికీ చంద్రబాబు మండపేట, అరకు సీట్లను ప్రకటించడం తప్పే
- బాబుకు వ్యతిరేకంగా పవన్ రాజోలు, రాజానగరం సీట్లు ప్రకటించినప్పటికి, జనసేన కేడర్‌లో సంతృప్తి ఏమాత్రం కనిపించడంలేదు.
- జనసేనకు 25 నుంచి 30 సీట్లు కేటాయించే పరిస్థితి వస్తే జన సైనికులు జీర్ణించుకోలేరు
9:48 AM, Jan 28, 2024
బాపట్లలో బాహాబాహీ
- టీడీపీ కార్యాలయంలోనే డిష్యుమ్ డిష్యుమ్
- ఐ టీడీపీ వర్సెస్ పార్టీ పట్టణ విభాగం
- కమ్మ, యాదవ వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు
- తెలుగుదేశం తీరుపై బీసీ నేతల భగ్గు
- సాక్షాత్తూ జిల్లా కేంద్రం బాపట్లలోని టీడీపీ కార్యాలయంలోనే ఆ పార్టీ ఐ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావు బాహాబా హీకి
- నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దుర్భాష
- రా తేల్చుకుందాం అంటూ తొడలు చరుచుకున్నారు
- మాటల తీవ్రత పెరిగి, దాడికి తెగబడ్డారు
- పార్టీ కార్యకర్తల సమక్షంలోనే కలబడ్డారు
- ఇదే అదునుగా పార్టీకి చెందిన కమ్మ, యాదవ సామాజిక వర్గాలు రెండుగా విడిపోయి చెరో పక్షం చేరి సవాళ్లు విసురుకున్నాయి.
- ఈ ఘటన తెలుగుదేశం పార్టీలోని వర్గ విభేదాలను మరోమారు బట్టబయలు
9:27 AM, Jan 28, 2024
సీఎం జగన్ ట్వీట్
- సిద్దం సభలోని ప్రసంగాన్ని ట్వీట్ చేసిన సీఎం వైఎస్ జగన్
- ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు...
- పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం... మీరంతా సిద్ధమా...?
ఈ దుష్టచతుష్టయం పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు.. అర్జునుడు…
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 27, 2024
పెత్తందారులపై ఈ కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధం…
మీరంతా సిద్ధమా…? #Siddham pic.twitter.com/2TvxPMOO4d
8:42 AM, Jan 28, 2024
కులగణనపై కుతంత్రాలెందుకు?
- పవన్‌పై బీసీ సంఘాల నేతల ఆగ్రహం
- ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నప్పటికీ దేశంలో కులగణన జరగలేదు
- బీసీల ఆవేదనను జగన్ అర్ధం చేసుకుని కులగణన చేపట్టారు
- అందరూ పెద్ద మనస్సుతో స్వాగతించాలి అడ్డుకోవడం సరికాదు
- పవన్ కళ్యాణ్ బీసీ వ్యతిరేకి అని మరోమారు తేటతెల్లమైంది
- బీసీల మేలు కోరి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనస్సుతో కుల గణన చేపట్టారు
- దాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పవన్ అనడం ఆయన సంకుచిత వైఖరికి అద్దంపడుతోంది
- ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల కోసం సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం పెడితే చంద్రబాబు ప్రోద్బలంతో కోర్టులో కేసులు వేయించారు
- ఇప్పుడు కుల గణనను అడ్డుకునేందుకు కోర్టులో వేస్తానని పవన్ అంటున్నాడు
- అంటే చట్టాలు చంద్రబాబు, పవన్‌కు ఏమైనా చుట్టాలా?
- పేదలకు మంచి జరిగితే సహించకుండా కోర్టుల్లో వేస్తామనడం సరైనదేనా?
7:39 AM, Jan 28, 2024
యుద్ధానికి సిద్ధం
- అబద్ధానికి, నిజానికి.. మోసానికి, విశ్వసనీయతకు మధ్య సంగ్రామమిది
- భీమిలి వేదికగా 2024 ఎన్నికల శంఖం పూరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
- ఎన్నికల కురుక్షేత్రంలో అభిమన్యుడిని కాను.. అర్జునుడిని
- సంక్షేమాభివృద్ధి పథకాలే మన ఎన్నికల బాణాలు..
- ఒంటరిగా పోటీ చేసే ధైర్యం బాబుకు లేదు
- మోసాన్ని నమ్ముకోలేదు.. అభివృద్ధిని నమ్ముకొనే ఎన్నికలకు వెళుతున్నాం
- మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు
- రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్పష్టంగా వైఎస్సార్‌సీపీ, జగన్ మార్క్
- కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో చూసినా మన మార్క్ స్పష్టం
- 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు మార్క్ ఎక్కడుంది?
- ఇది నా ఒక్కడిది కాదు..మనందరి పార్టీ
- అన్ని నామినేటెడ్ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దపీట
- చంద్రబాబు దృష్టిలో పల్లె ప్రజలంటే పని మనుషులు
- ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు.. బీసీల తోకలు కత్తిరిస్తామన్న మాటలెవరూ మరచిపోరు
- విద్య, వైద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో ఎన్నడూ లేనంత అభివృద్ధి
- ఈ ఎన్నికలు పేదలకు ఎంతో కీలకం
- నాణ్యమైన విద్య, వైద్యం, 1వ తేదీన పింఛన్, రైతులకు భరోసా.. ఇవన్నీ ఉండాలంటే మళ్లీ మన ప్రభుత్వం రావాల్సిందే
- ప్రతి ఇంటికీ వెళ్లి జరిగిన మంచిని వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు
7:28 AM, Jan 28, 2024
టీడీపీ Vs జనసేన.. మరోసారి విబేధాలు..
- పిఠాపురంలో తెరపైకి లోకల్-నాన్ లోకల్ చర్చ
- టీడీపీ, జనసేన మధ్య మరోసారి బయటపడ్డ వర్గ విభేదాలు
- ఉప్పాడలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బీసీల సమావేశం
- తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ జనసేన నేతల నిరసన
- పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన ఉమ్మడిగా కార్యక్రమాలు చేయాలని జనసేన నేతల డిమాండ్
- జనసేన వస్తే మంచిదేనంటూ వర్మ వివరణ
- పిలవకుండా ఎలా వస్తామంటూ జనసేన నేతల ఆగ్రహం
- సమావేశంలో లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరపైకి తెచ్చిన అయ్యన్నపాత్రుడు
- లోకల్ అభ్యర్థి వర్మను గెలిపించాలంటూ అయ్యన్న కామెంట్స్
7:27 AM, Jan 28, 2024
టీడీపీకి ‘తూర్పు’ సెగ
మంగళగిరికి రాజానగరం, రాజోలు సీట్ల పంచాయితీ
జనసేన అభ్యర్థుల ప్రకటనతో తెలుగుదేశం శ్రేణుల ఆందోళన
టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చి మరీ నిరసన
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఎదుట ఆగ్రహం
తమ సీట్లను జనసేనకు ఎలా కేటాయిస్తారని మండిపాటు
7:15 AM, Jan 28, 2024
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు: సీఎం జగన్
- అందుకే దత్తపుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నాడు
- గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా టీడీపీకి రావు
- మన మేనిఫెస్టోలో 99 శాతం హామీలను నెరవేర్చాం
- పేదరికాన్ని, అసమానతలను పోగొట్టిన బాధ్యతల ప్రభుత్వం మనది అని గర్వంగా చెబుతున్నా
- 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోంది
- ఆలోచన చేయండి.. ప్రతీ ఒక్కరి భుజస్కందాలపై బాధ్యత పెడుతున్నాను
- ఇంటింటికీ వెళ్లి మన ప్రభుత్వం చేసిన మంచిని చెప్పండి.. ప్రతీ పేద కుటుంబానికి వివరించండి
- ఈ యుద్ధం అబద్ధానికి, నిజానికి మధ్య జరుగుతోంది
- ఈ యుద్ధం మోసానికి, నిజాయితీకి మధ్య జరుగుతుంది
- మీరే చూడండి.. చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో కనీసం 10 శాతం కూడా నెరవేర్చలేదు
- మన ప్రభుత్వం 99 శాతం హామీలను నెరవేర్చి ప్రజల పట్ల విశ్వసనీయతతో ఉన్నాం
- చంద్రబాబు ఏమి చేశాడో చెప్పడానికి ఏమీ కనిపించదు.. చేసింది ఏమీ లేదు కాబట్టి ఆ పెద్ద మనిషి ఏమీ చెప్పలేడు
- మన ప్రభుత్వం అలా కాదు.. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం
- ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ చంద్రబాబు చేసేందేమీ లేదు
- ప్రతీ గ్రామానికి మీ బిడ్డ సంక్షేమం అందించాడు
- 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించాం