ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం నాటకాలు  | Former MP Ravindra Naik Criticized Telangana CM KCR | Sakshi
Sakshi News home page

ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం నాటకాలు 

Published Mon, Nov 14 2022 2:30 AM | Last Updated on Mon, Nov 14 2022 2:30 AM

Former MP Ravindra Naik Criticized Telangana CM KCR - Sakshi

పంజగుట్ట (హైదరాబాద్‌): సీఎం కేసీఆర్‌ అవినీతి బయటపడుతుండడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ అని.. ఎమ్మెల్యేల కొనుగోలు.. అని కొత్త నాటకాలకు తెర లేపుతున్నారని మాజీ ఎంపీ రవీందర్‌ నాయక్‌ ఎద్దేవా చేశారు. ఆయన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ .. ఎన్నో ఆకాంక్షలతో నెరవేర్చుకున్న తెలంగాణ ఒక వ్యక్తి కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

తొమ్మిదేళ్ల బడ్జెట్‌ రూ.15 లక్షల కోట్లు, రుణాలు మరో రూ.5 లక్షల కోట్లు.. మొత్తం రూ.20 లక్షల కోట్లు కాగా.. ప్రజలకు పథకాల ద్వారా అందజేసింది కేవలం రూ.50 వేల కోట్లని ఆయన స్పష్టం చేశారు. మిగిలిన దాంట్లో సింహభాగం సీఎం కుటుంబానికే వెళ్లిందని.. దీనిపై కేసీఆర్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశార 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement