సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సుల ఉద్యోగ భర్తీ ప్రక్రియను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తే ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వ ఘనతగా నియామక పత్రాల జారీ పేరిట హడావుడి చేస్తున్నారని వైద్యఆరోగ్య శాఖ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రా లు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ‘వంట అయ్యాక గరిటె తిప్పినట్లు’ఉందని ఎద్దేవా చేశారు.
ఈ మేరకు మంగళవారం హరీశ్ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ 1 నోటి ఫికేషన్‌ను ఫిబ్రవరి 1న ఇస్తామని ఎన్నికల సమయంలో ప్రచారం చేసిన కాంగ్రెస్.. ప్రస్తుతం విద్యార్థుల దృష్టి మరల్చేందుకే స్టాఫ్ నర్సులకు నియామకపత్రాల జారీ పేరిట హడావుడి చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచి్చన హామీ ప్రకారం ఏడాదిలోగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నికల కోడ్ వల్ల ఆటంకం
వైద్య సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు మెడికల్, నర్సింగ్, పారామెడికల్, ఫార్మాసిస్టు, ఇతర సిబ్బంది నియామకానికి తామే శ్రీకారం చుట్టామని హరీశ్‌రావు పేర్కొన్నారు. మొత్తంగా 7,094 స్టాఫ్‌నర్సు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి, 2023 ఆగస్టు 2న ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించినా ఎన్నికల కోడ్ మూలంగా తుది ఫలితాల విడుదల జరగలేదని వివరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన నియామకాలను తమ ఘనతగా చెప్పుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సు పోస్టులను ఉన్నతీకరిస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసినా కాంగ్రెస్ నేటికీ పరిగణనలోకి తీసుకోవడం లేదని హరీశ్‌రావు ఆ ప్రకటనలో విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment