పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్‌చాట్‌లో హరీష్‌ రావు | Harish Rao Comments On Patnam Mahender Reddy | Sakshi
Sakshi News home page

పట్నం మహేందర్ రెడ్డిది ఏ పార్టీ .. చిట్‌చాట్‌లో హరీష్‌ రావు

Published Sun, Oct 13 2024 1:11 PM | Last Updated on Sun, Oct 13 2024 1:57 PM

Harish Rao Comments On Patnam Mahender Reddy

సాక్షి,హైదరాబాద్‌ : బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్‌రావు. మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన హరీష్‌ రావు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీని చేర్చుకుని చీఫ్ విప్ పదవి ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు.  

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారు?.అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ ఛైర్మన్ స్వయంగా .. పట్నం మహేందర్ రెడ్డి చీఫ్ విప్ ఎంపికైనట్లు బులెటిన్ ఇవ్వటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. పట్నం‌ మహేందర్ రెడ్డి అనర్హత పిటిషన్ కౌన్సిల్ ఛైర్మన్‌ దగ్గర పెండింగ్‌లో ఉంది. 

సీఎం రేవంత్‌రెడ్డి హాయాంలో రాజ్యంగం ఎలా ఖూనీ జరుగుతుందనే దానికి ఇదొక ఉదాహరణ. పీఏసీ చైర్మన్ పదవి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలానే వ్యవహరించింది. అరికెపూడి గాంధీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్వయంగా సీఎం, మంత్రులు చెప్పారు..పట్నం మహేందర్ రెడ్డి ఏ పార్టీకి చెందిన వ్యక్తి? ప్రభుత్వం చెప్పాలని’ హరీష్‌ రావు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement